India vs Zimbabwe 3rd T20 live updates and highlights: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్(54 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు.
భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ రెండు, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(81) మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు.
జింబాబ్వే ఆరో వికెట్ డౌన్
జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మరుమణి.. అశోక్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
జింబాబ్వే ఐదో వికెట్ డౌన్
జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మాధవీరే.. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
స్పీడ్ పెంచిన జింబాబ్వే బ్యాటర్లు
15 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో మాధవీరే(28), ర్యాన్ బర్ల్(40) ఉన్నారు. ఆతిథ్య జట్టు విజయానికి 30 బంతుల్లో 71 పరుగులు కావాలి.
జింబాబ్వే నాలుగో వికెట్ డౌన్
జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన బెన్ కుర్రాన్.. బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 77/4
జింబాబ్వే మూడో వికెట్ డౌన్
యశ్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్లో జింబాబ్వే వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. డియాన్ మైర్స్(19), సికిందర్(0) వెంటవెంటనే ఔటయ్యారు. 5 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 40/3
జింబాబ్వే తొలి వికెట్ డౌన్
193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో బెన్నెట్ ఔటయ్యాడు
జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో భారత బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు.
49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(27), రింకూ సింగ్(25), ఇషాన్ కిషన్(29) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ రెండు, సికిందర్ రజా, ముజార్బానీ, మాధవీరే తలా వికెట్ పడగొట్టారు.
భారత్ నాలుగో వికెట్ డౌన్
భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. బ్రాడ్ ఎవాన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 172/4
వైభవ్ అవుట్
వైభవ్ సూర్యవంశీ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు.
ఇషాన్ కిషన్ అవుట్
ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన కిషన్.. రజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
వైభవ్ ఫిప్టీ
వైభవ్ సూర్యవంశీ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. వైభవ్ 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ 95 పరుగలు చేసింది. క్రీజులో వైభవ్‌తో పాటు ఇషాన్ కిషన్(29) ఉన్నాడు.
దూకుడుగా ఆడుతున్న వైభవ్
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(18 బంతుల్లో 31) దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లకు టీమిండియా స్కోర్: 60/1
అభిషేక్ అవుట్
జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. హరారే వేదికగా జరుగుతున్న మూడో టీ20లో 2 పరుగులు చేసి ఔటయ్యాడు.
హరారే వేదికగా నామమాత్రపు మూడో టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ చివరి టీ20లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది.
ప్రిన్స్ యాదవ్, శివమ్ దూబేల స్ధానంలో అశోక్ శర్మ, సూర్యన్ష్ షెడ్గేలు తుది జట్టులోకి వచ్చారు. జింబాబ్వే కూడా ఓ మార్పు చేసింది. రిచర్డ్ నగరావా స్ధానంలో వెల్లింగ్టన్ మసకద్జాకు అవకాశమిచ్చారు.
తుది జట్లు
జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ
భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ