Ind vs Zim 2nd T20 live updates: హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేను 90 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రవి బిష్ణోయ్, దూబే, తిలక్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
జింబాబ్వే ఏడో వికెట్ డౌన్
జింబాబ్వే ఏడో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన బ్రాడ్ ఎవాన్స్.. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
జింబాబ్వే ఆరో వికెట్ డౌన్
జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రియాన్ బర్ల్.. తిలక్ వర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 90/6
జింబాబ్వే ఐదో వికెట్ డౌన్
జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన మాధవీరే.. దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు.
జింబాబ్వే నాలుగో వికెట్ డౌన్
జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో కెప్టెన్ సికందర్ రజా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆతిథ్య జట్టు 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
జింబాబ్వే మూడో వికెట్ డౌన్
జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన డియోన్ మైర్స్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
జింబాబ్వే రెండో వికెట్ డౌన్
జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన బెన్ కుర్రాన్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
జింబాబ్వే తొలి వికెట్ డౌన్
జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. 19 బంతుల్లో 32 పరుగులు చేసిన బ్రియాన్ బెన్నెట్.. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
దూకుడుగా ఆడుతున్న జింబాబ్వే
220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో బెన్నెట్(22), బెన్ కుర్రాన్(1) తలా వికెట్ సాధించారు.
జింబాబ్వే టార్గెట్ 220 పరుగులు
హరారే వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్స్‌లతో 1), తిలక్ వర్మ(29 బంతుల్లో 60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.
యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 9 బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో ముజార్బానీ, నగరవా, బెన్నెట్, న్యూమన్ న్యాముహురి తలా వికెట్ సాధించారు.
ఇషాన్ కిషన్ అవుట్
ఇషాన్ కిషన్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 81 పరుగులు చేసిన కిషన్.. న్యూమన్ న్యాముహురి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 195/5
తిలక్ వర్మ ఫిప్టీ
తిలక్ వర్మ చెలరేగి ఆడుతున్నాడు. ఈ హైదరాబాదీ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 17 ఓవర్లకు భారత్ స్కోర్: 188/3
భారీ స్కోర్ దిశగా భారత్
16 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(75), తిలక్ వర్మ(40) ఉన్నారు.
ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ
ఇషాన్ కిషన్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో కిషన్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 51 పరుగులతో కిషన్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.
టీమిండియా మూడో వికెట్ డౌన్
టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. బెన్నెట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 95/3
నిలకడగా ఆడుతున్న శ్రేయస్, కిషన్
8 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(14), ఇషాన్ కిషన్(26) ఉన్నారు.
భారత్ రెండో వికెట్ డౌన్.. వైభవ్ ఔట్
వైభవ్ సూర్యవంశీ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 9 బంతుల్లోనే 20 పరుగులు చేసిన వైభవ్.. నగరావ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన భారత్
1.5వ ఓవర్- 10 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ముజరబానీ బౌలింగ్‌లో ర్యాన్ బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (8) ఔటయ్యాడు.
హరారే వేదికగా రెండో టీ20లో జింబాబ్వే-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌తో టీమిండియా తరపున యువ పేసర్ యాశ్ ఠాకూర్ అరంగేట్రం చేశాడు. అశోక్ శర్మ స్ధానంలో యశ్ ఠాకూర్‌కు అవకాశమిచ్చారు. జింబాబ్వే మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
తుది జట్లు
భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్
జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ