Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

IND vs AUS 3rd Test: ఫుల్‌ ప్రాక్టీస్‌...

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 13, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ind.jpg

బ్రిస్బేన్‌లో చెమటోడ్చిన టీమిండియా

రేపటి నుంచి ఆస్ట్రేలియాతో మూడో టెస్టు  

బ్రిస్బేన్‌: ఆ్రస్టేలియాతో మూడో టెస్టుకు ముందు భారత క్రికెట్‌ జట్టు కఠోర సాధన చేస్తోంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’ని నిలబెట్టుకోవడంతో పాటు... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ చేరడమే లక్ష్యంగా సాగుతున్న టీమిండియా గురువారం బ్రిస్బేన్‌లో చెమటోడ్చింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో టెస్టు గెలిచి 1–1తో సమంగా నిలవగా... శనివారం నుంచి మూడో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. దీని కోసం గురువారమే బ్రిస్బేన్‌ చేరుకున్న రోహిత్‌ శర్మ బృందం... రోజంతా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. 

గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లు గెలిచిన టీమిండియా... ఈసారి కూడా అదే మ్యాజిక్‌ కొనసాగిస్తూ ‘హ్యాట్రిక్‌’ కొట్టాలని భావిస్తోంది. అడిలైడ్‌లో ‘పింక్‌ బాల్‌’తో జరిగిన రెండో టెస్టులో పరాజయంతో జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసం లోపించినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో మాజీ కెపె్టన్‌ విరాట్‌ కోహ్లి ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు. టెస్టు ఫార్మాట్‌లో రోహిత్‌ కన్నా ఎక్కువ అనుభవం ఉన్న కోహ్లి... గురువారం ప్రాక్టీస్‌ సందర్భంగా సహచరుల్లో స్ఫూర్తి నింపాడు. 

తిరిగి పుంజుకునే విధంగా యువ ఆటగాళ్లకు కీలక సూచనలు ఇచ్చాడు. బుమ్రా, రోహిత్‌తోనూ కోహ్లి విడిగా చర్చిస్తూ కనిపించాడు. గత మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి విఫలమైన కెపె్టన్‌ రోహిత్‌ శర్మ... మూడో టెస్టులో ఏ స్థానంలో బరిలోకి దిగుతాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రాక్టీస్‌ సందర్భంగా రోహిత్‌ అటు కొత్త బంతితో పాటు... పాత బంతితోనూ సాధన కొనసాగించాడు. యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్‌ కొత్త బంతితో ప్రాక్టీస్‌ చేశారు.

పచ్చికతో కూడిన గబ్బా పిచ్‌... పేస్‌కు, బౌన్స్‌కు సహకరించడం ఖాయం కాగా... రోహిత్‌ ఓపెనర్‌గానే బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీయడమే మేలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్రాక్టీస్‌ సెషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించాడు. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీతో గంభీర్‌ సుదీర్ఘంగా సంభాషిoచాడు. 

ఆకాశ్‌కు అవకాశం దక్కేనా! 
నెట్స్‌లో భారత బౌలర్లంతా తీవ్రంగా శ్రమించగా... పేసర్‌ ఆకాశ్‌దీప్‌ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయినా మూడో టెస్టులో అతడికి అవకాశం దక్కడం కష్టమే. ఆ్రస్టేలియాతో తొలి టెస్టు ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్షిత్‌ రాణా రెండో మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఇప్పుడప్పుడే అతడి స్థానానికి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా... ప్రాక్టీస్‌లో ఆకాశ్‌ బౌలింగ్‌ చూస్తుంటే హర్షిత్‌ స్థానంలో అతడికి అవకాశం ఇవ్వడమే మేలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మూడో టెస్టు జరగనున్న పిచ్‌ హర్షిత్‌ బౌలింగ్‌ శైలికి సహకరించే అవకాశాలున్నాయి. శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకొని దేశవాళీల్లో సత్తాచాటిన సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ... ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో పాల్గొనే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. రంజీ ట్రోఫీతో పాటు ముస్తాక్‌ అలీ టోర్నీలో షమీ సత్తా చాటినా... టెస్టు మ్యాచ్‌కు అవసరమైన ఫిట్‌నెస్‌ అతడు ఇంకా సాధించలేదు. 

‘షమీ గాయం నుంచి కోలుకున్నా... ఇంకా మడమ వాపు పూర్తిగా తగ్గలేదు. ఎక్కువ పనిభారం పడితే గాయం తిరగబెట్టే ప్రమాదం ఉంది. అతడు అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడటానికి ముందు ఒక్కో మ్యాచ్‌లో 10 ఓవర్ల పాటు మూడు స్పెల్స్‌ వేయాల్సి ఉంటుంది. 

ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న విజయ్‌ హజారే ట్రోఫీలో షమీ బెంగాల్‌ తరఫున బరిలోకి దిగుతాడు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మూడో టెస్టులోనూ భారత జట్టు ఏకైక స్పిన్నర్‌తోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌లో ఎవరికి చాన్స్‌ దక్కుతుందో చూడాలి.  

జైస్వాల్‌ బస్‌ మిస్‌.. 
రెండో టెస్టు ముగిసిన అనంతరం గురువారం అడిలైడ్‌ నుంచి బ్రిస్బేన్‌కు బయలుదేరే సమయంలో భారత యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ నిర్ణీత సమయానికి టీమ్‌ బస్‌ వద్దకు చేరుకోలేకపోయాడు. దీంతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ... జైస్వాల్‌ను అక్కడే వదిలి మిగిలిన జట్టుతో ఎయిర్‌పోర్ట్‌కు పయనమయ్యాడు. జట్టు సభ్యులంతా వచి్చన తర్వాత కూడా జైస్వాల్‌ అక్కడికి రాకపోవడంతో రోహిత్‌ అసహనానికి గురయ్యాడు. 

ఉదయం 10 గంటలకు విమానం ఎక్కాల్సి ఉండటంతో... జట్టు సభ్యులంతా గం 8:30కి హోటల్‌ నుంచి బయలుదేరగా... జైస్వాల్‌ సమయానికి రాలేకపోయాడు. దీంతో 20 నిమిషాల అనంతరం హోటల్‌ సిబ్బంది ప్రత్యేక వాహనంలో జైస్వాల్‌ను విమానాశ్రయానికి చేర్చారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
australia
third Test
Border-Gavaskar Trophy
team india
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

 బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.