ముంబై: ప్రస్తుత టీమిండియాలో సమర్థమైన ఆఫ్ స్పిన్నర్ లేడని, ఈ లోటే టెస్టుల్లో ఫలితాలపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. వాషింగ్టన్ సుందర్ ఉన్నప్పటికీ అతను స్పిన్ ఆల్‌రౌండరని పేర్కొన్నాడు. మీడియా సంస్థకిచి్చన ఇంటర్వ్యూలో అతను మాట్లాడూతూ ‘స్పెషలిస్టు రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్ అంటూ జట్టులో ఎవరూ లేరు. తమిళనాడు ఆల్‌రౌండర్ సుందర్ ఉన్నా... అతనింకా పూర్తిస్థాయి స్పిన్నర్‌గా బౌలింగ్ అయితే వేయలేదు. 30 నుంచి 35 ఓవర్లు వేయగలిగితేనే అతను రాటుదేలుతాడు. పార్ట్‌టైమ్ బౌలింగ్‌తో ఒరిగేదేమీ ఉండదు. ఈ నేపథ్యంలో ఓ ఆఫ్‌స్పిన్నర్‌గా అతను నిలదొక్కుకునేందుకు చాలా కాలం పట్టొచ్చు’ అని అన్నాడు. భారత ఉపఖండంలో స్పిన్ వికెట్లదే కీలకపాత్ర అని అలాంటి పిచ్‌లున్న దేశంలోని జట్టుకు నాణ్యమైన స్పిన్ బౌలర్లు లేకపోవడం ప్రతికూలంగా మారుతుందని అదే ప్రస్తుత ఫలితాలకు కారణమని హర్భజన్ విశ్లేషించాడు.
ADVERTISEMENT
ADVERTISEMENT