Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

జోరు మీదున్న భారత కుర్రాళ్లు

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 17, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
INDIA-U-19.jpg

నేడు బంగ్లాదేశ్‌తో పోరు 

అండర్‌–19 వరల్డ్‌ కప్‌  

మ.గం.1.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లలో ప్రసారం

బులవాయో: అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో ఐదు సార్లు చాంపియన్‌ భారత జట్టు మరో టైటిల్‌ వేటలో తమ జోరు కొనసాగించేందుకు రెండో మ్యాచ్‌ బరిలోకి దిగుతోంది. నేడు (శనివారం) జరిగే గ్రూప్‌ ‘బి’ పోరులో బంగ్లాదేశ్‌ అండర్‌–19తో భారత కుర్రాళ్లు తలపడతారు. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న భారత్‌ను నిలువరించడం బంగ్లాకు కూడా కష్టమే. కెపె్టన్‌ ఆయుశ్‌ మాత్రే, విధ్వంసక బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీలతో ఓపెనింగ్‌ బలంగా ఉండగా వేదాంత్, విహాన్‌ మల్హోత్రాలు కీలక బ్యాటర్లు. 

మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకునే అభిజ్ఞాన్‌ కుందు మిడిలార్డర్‌లో జట్టు బలం. దీపేశ్, హెనిల్, ఖిలాన్, అంబరీశ్‌లతో జట్టు బౌలింగ్‌ కూడా పదునుగా ఉంది. గత ఏడాది కాలంగా మన అండర్‌–19 టీమ్‌ అద్భుత ఫామ్‌లో ఉంది. ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలపై సిరీస్‌లు నెగ్గడంతో పాటు ఆసియా కప్‌లో కూడా జట్టు ఫైనల్‌ చేరింది. గత 17 మ్యాచ్‌లలో భారత్‌ 14 గెలిచింది. 

తొలి మ్యాచ్‌లో అమెరికాను భారత్‌ చిత్తు చేయగా...టోర్నీలో బంగ్లాకు ఇదే తొలి మ్యాచ్‌. బంగ్లా టీమ్‌లో కెపె్టన్‌ అజీజుల్‌ హకీమ్‌ మినహా మిగతావారికి పెద్దగా అనుభవం లేదు. హకీమ్‌తో పాటు రెండేళ్ల క్రితం వరల్డ్‌ కప్‌లోనూ రాణించిన జవాద్‌ అబ్రార్‌ల, కలీమ్‌ సిద్దిఖీలపై బ్యాటింగ్‌ భారం ఉండగా... జింబాబ్వేలో పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై తమ బౌలర్లు ఇక్బాల్‌ హుస్సేన్, అల్‌ ఫహద్‌ రాణిస్తారని బంగ్లా ఆశిస్తోంది. సమీయుల్‌ బషర్‌ ప్రధాన స్పిన్నర్‌. 

భారత్‌ గెలుపు బోణీ... 
అండర్‌–19 వరల్డ్‌ కప్‌ను భారత్‌ ఘన విజయంతో ప్రారంభించింది. గురువారం జరిగిన పోరులో భారత్‌ 6 వికెట్ల తేడాతో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ)ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అమెరికా 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. నితీశ్‌ సూదిని (52 బంతుల్లో 36; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెనిల్‌ పటేల్‌ (5/16) ఐదు వికెట్లు తీశాడు. అనంతరం పదే పదే వాన అంతరాయం కలిగించడంతో భారత్‌ ల్యన్ని డక్‌వర్త్‌ – లూయీస్‌ ప్రకారం 37 ఓవర్లలో 96 పరుగులుగా నిర్దేశించారు. భారత్‌ 17.2 ఓవర్లలో 4 వికెట్లకు 99 పరుగులు చేసింది. ఆయుశ్‌ మాత్రే (19), వైభవ్‌ సూర్యవంశీ (2) 
విఫలమైనా... అభిజ్ఞాన్‌ కుందు (41 బంతుల్లో 42 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టును గెలిపించాడు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
under-19 world cup
Indian team
Group B
India vs Bangladesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఘనంగా ముగించారు

ఘనంగా ముగించారు

భారత మహిళల క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ

భారత మహిళల క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ

భారత్‌ ‘హ్యాట్రిక్‌’ విజయం

భారత్‌ ‘హ్యాట్రిక్‌’ విజయం

జర్మనీకి భారత్‌ షాక్‌

జర్మనీకి భారత్‌ షాక్‌

గిల్, ఇషాన్‌ శతకాల మోత

గిల్, ఇషాన్‌ శతకాల మోత

భారీ విజయమే లక్ష్యంగా...

భారీ విజయమే లక్ష్యంగా...

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.