Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Asia Cup: కొలంబోలో ఎడతెగని వర్షాలు.. ఏసీసీ కీలక నిర్ణయం! ఇక..

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 11, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ind-vs-pak-rainy-colombo-forces-asia-cup-2023-final-shift-pallekele.jpg

Asia Cup 2023: కొలంబోలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆసియా క్రికెట్‌ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలంబోలో వర్షాల నేపథ్యంలో ఆసియా కప్‌-2023 ఫైనల్‌ వేదికను మార్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ వన్డే టోర్నీని నిర్వహించేందుకు పాకిస్తాన్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే.

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా ఆటగాళ్లను పాక్‌కు పంపేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ససేమిరా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అనేక చర్చల తర్వాత శ్రీలంకతో కలిసి పాకిస్తాన్‌ హైబ్రిడ్‌ విధానంలో ఆసియా కప్‌ నిర్వహణకు అంగీకరించింది.

శ్రీలంకతో కలిసి సంయుక్తంగా పాక్‌

భారత జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరిగేందుకు వీలుగా ఏసీసీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్‌ స్టేజీలో వివిధ వేదికల్లో నిర్వహించిన మ్యాచ్‌లలో గ్రూప్‌-ఏ నుంచి టీమిండియా, పాకిస్తాన్‌.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌ సూపర్‌-4 దశకు చేరుకున్నాయి.

ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల పోరు వర్షార్పణం

అయితే, కొలంబోలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పల్లెకెల్లెలో దాయాదుల మ్యాచ్‌ వర్షార్పణం కావడంతో.. ఆదివారం నాటి భారత్‌- పాక్‌ పోరుకు రిజర్వ్‌ డే కేటాయించారు. చిరకాల ప్రత్యర్థుల పోటీ నేపథ్యంలో ఏసీసీ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ వరుణుడు కరుణించే అవకాశాలు కనిపించడం లేదు.

ఆర్‌. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం 24.1 ఓవర్ల టీమిండియా స్కోరు 147/2 వద్ద ఉండగా ఆటకు ఆటంకం కలిగించిన వర్షం.. సోమవారం కూడా అడ్డంకిగా మారింది. దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు మొదలుకావాల్సిన మ్యాచ్‌ గంట తర్వాత కూడా ఇంకా ఆరంభం కాలేదు.

ఫైనల్‌ ఒక్కటే కాదు.. ఆ మ్యాచ్‌ల వేదికలోనూ మార్పులు?

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఫైనల్‌ వేదిక మార్పుపై ఏసీసీ దృష్టి సారించినట్లు సమాచారం. వాస్తవానికి కొలంబోలో సెప్టెంబరు 17న ఫైనల్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే, ఆరోజు కూడా వర్షం ముప్పు సూచనలు ఉన్నట్లు సమాచారం.

ఈ  నేపథ్యంలో క్యాండీలోని పల్లెకెల్లె స్టేడియంలో ఫైనల్‌ నిర్వహణకు ఏసీసీ మొగ్గుచూపుతున్నట్లు టైమ్స్‌నౌ తన కథనంలో పేర్కొంది. మిగిలిన మ్యాచ్‌ల(భారత్‌- శ్రీలంక, పాక్‌- శ్రీలంక, భారత్‌- బంగ్లాదేశ్‌)  మ్యాచ్‌ల వేదికలు కూడా మార్చే యోచనలో ఉన్నట్లు మరో జాతీయ మీడియా పేర్కొంది.

చదవండి: చిక్కుల్లో పాక్‌ క్రికెట్‌ జట్టు.. ఐసీసీ సీరియస్‌! ఏమైందంటే?

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Asia Cup 2023
India vs Pakistan
Colombo
India vs Sri lanka
Pallekele
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

వైభవ్ వీరవిహారం.. ట్రై సిరీస్ విజేతగా భారత్‌

వైభవ్ వీరవిహారం.. ట్రై సిరీస్ విజేతగా భారత్‌

T20 WC 2026: పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఐసీసీ

T20 WC 2026: పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఐసీసీ

భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

IND vs SL : గ్రౌండ్‌లోనే కొట్టుకున్న ఇండియా, శ్రీలంక

IND vs SL : గ్రౌండ్‌లోనే కొట్టుకున్న ఇండియా, శ్రీలంక

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.