Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

IND Vs NZ: ఇలా ఎలా బౌల్డ్‌ అయ్యాను? షాక్‌లో రోహిత్‌ శర్మ

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 18, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Rohitsharma.jpg

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రోహిత్‌ శర్మకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న హిట్‌మ్యాన్‌ నిర్ణయం బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ(2) సహా స్టార్‌ బ్యాటర్లంతా విఫలం కావడంతో 46 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది.

టీమిండియా శుభారంభం
అనంతరం బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 402 రన్స్‌ చేసి.. ఏకంగా 356 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియా శుభారంభమే అందుకుంది.

రోహిత్‌ హాఫ్‌ సెంచరీ
ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ 52 బంతులు ఎదుర్కొని 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రోహిత్‌ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 52 పరుగులు చేశాడు. అయితే, నిలకడగా ఆడుతున్న సమయంలో రోహిత్‌ దురదృష్టకరరీతిలో అవుట్‌ అయ్యాడు.

ఊహించని రీతిలో బౌల్డ్‌
భారత రెండో ఇన్నింగ్స్‌ 22వ ఓవర్‌ను కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ వేశాడు. అతడి బౌలింగ్‌లో ఐదో బంతికి రోహిత్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, ఊహించని విధంగా బంతి బ్యాట్‌ను తాకి.. బౌన్స్‌ అయి వికెట్లను తాకగా.. స్టంప్స్‌ ఎగిరిపడ్డాయి. నిజంగా ఇది రోహిత్‌ దురదృష్టమనే చెప్పవచ్చు.

ఇలా ఎలా బౌల్డ్‌ అయ్యాను?.. దురదృష్టం భయ్యా!
ఒకవేళ ప్రమాదాన్ని పసిగట్టి కాస్త జాగ్రత్త పడి ఉంటే వికెట్‌ నిలిచేదే! ఏదేమైనా.. తాను అవుటైన తీరుపై రోహిత్‌ శర్మ సైతం తీవ్ర నిరాశకు గురయ్యాడు. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంటూ అతడు.. ‘‘ఇలా ఎలా బౌల్డ్‌ అయ్యాను?’’ అన్నట్లుగా  ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ వైరల్‌గా మారింది. 

ఈ నేపథ్యంలో.. ‘‘ఈ మ్యాచ్‌లో నువ్వు నిజంగా అన్‌లక్కీ భయ్యా’’ అంటూ నెటిజన్లు రోహిత్‌పై సానుభూతి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో టీమిండియా 25 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.

భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌
👉మొదటి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20
👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
👉వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దు కాగా.. రెండో రోజు టాస్‌ పడింది

👉బెంగళూరులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ
👉భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 46 పరుగులకే ఆలౌట్‌
👉పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయానంటూ తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్‌ 
👉న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 402 ఆలౌట్‌.

చదవండి: టీమిండియా 46 ఆలౌట్‌.. అజింక్య రహానే పోస్ట్‌ వైరల్‌

 
 
 
 

View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioCinema (@officialjiocinema)

What a terrible test match for Rohit Sharma to remember in all senses.#INDvNZ pic.twitter.com/f0d3gtrGvZ

— iNaveenVijayakumar (@iNaveentalks) October 18, 2024

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
rohit sharma
India vs New Zealand
test series
Ajaz Patel
Yashasvi Jaiswal
bengaluru
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

ఒక్క క్షణికావేశం.. జీవితంలో 37 ఏళ్లు నాశనమయ్యాయి!

ఒక్క క్షణికావేశం.. జీవితంలో 37 ఏళ్లు నాశనమయ్యాయి!

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం..!

భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.