Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Ind vs Eng: అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు.. ఇదే లాస్ట్‌ ఛాన్స్‌!

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 22, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ind2.jpg

అభిషేక్‌ శర్మ(Abhishek Sharma)కు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ ఎంతో కీలకమని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఈ సిరీస్‌లో గనుక విఫలమైతే ఈ పంజాబీ బ్యాటర్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నాడు. కాబట్టి ఈసారి అభిషేక్‌ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో మునిగిపోవడం ఖాయమన్న ఆకాశ్‌ చోప్రా(Aakash Chopra).. సవాళ్లను అధిగమిస్తే మాత్రం మరికొన్ని రోజులు టీమిండియాలో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.

అరంగేట్రంలో డకౌట్‌.. ఆ వెంటనే సెంచరీ
గతేడాది జూలైలో జింబాబ్వేతో టీ20 సిరీస్‌ సందర్భంగా.. అభిషేక్‌ శర్మ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే డకౌట్‌ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. మరుసటి మ్యాచ్‌లో సెంచరీ బాది సత్తా చాటాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బ్యాట్‌ ఝులిపించలేకపోయాడు.

ఇక ఇప్పటి వరకు 12 టీ20లు పూర్తి చేసుకున్న అభిషేక్‌ వర్మ కేవలం 256 పరుగులకే పరిమితం అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ అభిషేక్‌ తనను నిరూపించుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం కావొచ్చని అభిప్రాయపడ్డాడు.

అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు
‘‘ఈసారి కూడా సెలక్టర్లు అభిషేక్‌ శర్మపై నమ్మకం ఉంచారు. అతడిని జట్టులో కొనసాగించడం నాకూ నచ్చింది. అయితే, అతడు ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal) టీ20 జట్టులోకి దూసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

కాబట్టి అభిషేక్‌కు అతడితో పోటీ ఊపిరాడనివ్వదనడంలో సందేహం లేదు. యశస్వి జైస్వాల్‌ కూడా లెఫ్టాండర్‌ బ్యాటర్‌ కావడం అభిషేక్‌ శర్మకు మరో మైనస్‌. జైసూ మూడు ఫార్మాట్లకు తగిన ఆటగాడు. టెస్టు, టీ20లలో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు.

అలా అయితే వృథానే
ఇక వన్డేల్లో కూడా అరంగేట్రానికి సిద్ధమయ్యాడు’’ అని పేర్కొన్నాడడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ కోసమే.. టీ20లలో అతడికి విశ్రాంతినిచ్చారేమోనన్న అభిప్రాయాలు ఉన్నాయన్నాడు ఆకాశ్‌ చోప్రా. ఒకవేళ ఇంగ్లండ్‌తో వన్డేల్లో శుబ్‌మన్‌ గిల్‌- రోహిత్‌ శర్మనే ఇన్నింగ్స్‌ ఆరంభిస్తే.. జైసూను ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసినందుకు ఫలితం ఉండదని పేర్కొన్నాడు.

ఒకే జట్టుతో ఆడతామన్న టీమిండియా సారథి
ఏదేమైనా యశస్వి జైస్వాల్‌ మాత్రం తిరిగి టీ20 జట్టులోకి వస్తే.. అభిషేక్‌ శర్మకు కష్టాలు తప్పవని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇ దిలా ఉంటే.. టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 

టీ20 ప్రపంచకప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఒకే జట్టుతో ఆడేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు వెల్లడించాడు. అయితే, ఆకాశ్‌ చోప్రా అన్నట్లు అభిషేక్‌ శర్మ మరోసారి విఫలమైతే అతడిపై వేటు తప్పకపోవచ్చు. కాగా బుధవారం(జనవరి 22) నుంచి ఇండియా- ఇంగ్లండ్‌ మధ్య టీ20 సిరీస్‌ మొదలుకానుంది.

చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్‌ ఫోర్‌’ వీరే: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్లు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
India vs England
Abhishek Sharma
T20 series
Aakash Chopra
Yashasvi Jaiswal
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

గుర్నూర్‌ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు

గుర్నూర్‌ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.