Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Day 2: చెలరేగిన ఇంగ్లండ్‌ స్పిన్నర్లు.. ఆదుకున్న జైస్వాల్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 24, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
jaiswal.jpg

India vs England, 4th Test Day 2 Score: టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. తొలిరోజు ఆటలో అరంగేట్ర పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా కూడా ఇంగ్లండ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.

అయితే, జో రూట్‌ రాకతో సీన్‌ మారిపోయింది. ‘బజ్‌బాల్‌’ కాన్సెప్ట్‌నకుకు విరుద్ధంగా అచ్చమైన సంప్రదాయ క్రికెట్‌ ఆడుతూ రూట్‌ అజేయ సెంచరీతో చెలరేగిన కారణంగా.. తొలి రోజు ఇంగ్లండ్‌ తిరిగి పుంజుకోగలిగింది. ఆట పూర్తయ్యే సరికి 300 పరుగుల మార్కు దాటేసింది.ఈ క్రమంలో 302/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టి 353 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఓవరాల్‌గా భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. ఆకాశ్‌ దీప్‌ మూడు వికెట్లు, మహ్మద్‌ సిరాజ్‌ రెండు, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

𝙅𝙖𝙖𝙙𝙪𝙞 𝙅𝙖𝙙𝙙𝙪 weaving magic with the ball 🪄



Three quick wickets helped #TeamIndia bowl out the visitors early! 💪🏻#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/iiWyPgAn4C

— JioCinema (@JioCinema) February 24, 2024

ఈ క్రమంలో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన టీమిండియాకు ఇంగ్లండ్‌ దిగ్గజ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సర్‌ ఆదిలోనే షాకిచ్చాడు. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మను 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత యువ బౌలర్‌ షోయబ్‌ బషీర్‌ తన స్పిన్‌ మాయాజాలం ప్రదర్శించాడు.

పాక్‌ మూలాలున్న ఈ రైటార్మ్‌ స్పిన్నర్‌ దెబ్బకు శుబ్‌మన్‌ గిల్‌(38), రజత్‌ పాటిదార్‌(17) లెగ్‌ బిఫోర్‌ వికెట్లుగా వెనుదిరిగారు. ఇక జట్టును ఆదుకుంటాడనుకున్న రవీంద్ర జడేజా(12)ను కూడా బషీరే పెవిలియన్‌కు పంపడం గమనార్హం.

Bashir breaks the crucial partnership between Gill and Jaiswal! 🥲 #INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/hCKcWdJq5A

— JioCinema (@JioCinema) February 24, 2024

ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ మాత్రం నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. అర్ధ శతకం పూర్తి చేసుకుని దానిని సెంచరీగా మలిచే ప్రయత్నం చేయగా.. బషీర్‌ అద్బుత రీతిలో అతడి బౌల్డ్‌ చేశాడు. దీంతో 73 పరుగులకే జైస్వాల్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 

Jaiswal has cracked the code for run-making! 🙌🏻



He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4

— JioCinema (@JioCinema) February 24, 2024

ఇక సర్ఫరాజ్‌ ఖాన్‌(14), రవిచంద్రన్‌ అశ్విన్‌(1)లను మరో స్పిన్నర్‌ టామ్‌ హార్లే పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఈ క్రమంలో జైస్వాల్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌, అశూ స్థానంలో వచ్చిన కుల్దీప్‌ యాదవ్‌ ఆచితూచి ఆడే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం నాటి ఆట ముగిసే టీమిండియా 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ కంటే 134 పరుగులు వెనుబడి ఉంది. చేతిలో ఇంకా మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఆట పూర్తయ్యే సరికి జురెల్‌ 30, కుల్దీప్‌ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.  మొత్తానికి రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ టీమిండియాపై పైచేయి సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది.

చదవండి: బంతితో చెలరేగిన బషీర్‌.. అంతకంటే ముందు సర్ఫరాజ్‌కు షాకిచ్చాడిలా!

Kuldeep Yadav spinning surprises with both bat & ball! 🤩#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSport pic.twitter.com/D7hDjNf04x

— JioCinema (@JioCinema) February 24, 2024

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
India vs England
Ranchi Test
Yashasvi Jaiswal
Shoaib Bashir
Tom Hartley
Shubman Gill
Dhruv Jurel
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

గుర్నూర్‌ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు

గుర్నూర్‌ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.