దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు.. తదుపరి ఎడిషన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ (తిరిగి దక్కంచుకోవడం) ప్రక్రియను ఇవాళ (జులై 10) పూర్తి చేశాయి. వచ్చే ఏడాది (2024) జనవరి 13 నుంచి ప్రారంభం కాబోయే ILT20 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గల్ఫ్ జెయింట్స్ సహా మిగతా అన్ని జట్లు తమ స్టార్ క్రికెటర్లను తిరిగి దక్కించుకున్నాయి.
The big names are back for Season 2!🙌
All your favorites from the inaugural edition return to battle it out once again in Season 2 of the #DPWorldILT20.
Are you ready for a firecracker of a tournament?💥
For more details, please visit: https://t.co/PXt4HL1vCp pic.twitter.com/dHdUYMN1D4— International League T20 (@ILT20Official) July 10, 2023
గల్ఫ్ జెయింట్స్.. షిమ్రోన్ హెట్‌మైర్, క్రిస్ జోర్డన్, జేమ్స్ విన్స్, క్రిస్ ఓవర్టన్, క్రిస్ లిన్, అయాన్ ఖాన్, సంచిత్ శర్మ, రిచర్డ్ గ్లీసన్, కార్లోస్ బ్రాత్‌వైట్, రెహాన్ అహ్మద్, గెర్హార్డ్ ఎరాస్మస్‌లను దక్కించుకోగా..
గతేడాది రన్నరప్ డెసర్ట్ వైపర్స్.. హసరంగ, అలెక్స్ హేల్స్, టామ్ కర్రన్, కొలిన్ మన్రో, షెఫానీ రూథర్‌ఫోర్డ్, లూక్ వుడ్, పతిరణ, రోహన్ ముస్తఫా, షెల్డన్ కాట్రెల్, చండీమాల్, అట్కిన్సన్, అలీ నసీర్లను రీటైన్ చేసుకున్నాయి.
అబుదాబీ నైట్‌రైడర్స్.. సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, జో క్లార్క్, చరిత్ అసలంక, అలీ ఖాన్, మతీవుల్లా ఖాన్, మర్చంట్ డి లాంజ్, సాబిర్ అలీని తిరిగి దక్కంచుకుంది.
మిగతా మూడు జట్లు తిరిగి దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు:
దుబాయ్ క్యాపిటల్స్.. జో రూట్, సికందర్ రజా, రోవ్‌మన్ పావెల్, దుష్మంత చమీరా, రజా అకీఫుల్లా ఖాన్
ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. కీరన్ పోలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, విల్ స్మీడ్, మహ్మద్ వసీం, డేవిడ్ మౌస్లీ, జహూర్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ, థామ్సన్, మెక్ కెన్నీ క్లార్క్, ఆండ్రీ ఫ్లెచర్
షార్జా వారియర్స్.. క్రిస్ వోక్స్, జునైద్ సిద్ధిఖీ, మార్క్ దెయాల్, జో డెన్లీ, ముహమ్మద్ జవాదుల్లా, టామ్ కొహ్లెర్ క్యాడ్మోర్`