Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

World Cup 2025: పాక్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pakvsaus.jpg

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 (ICC World Cup)లో మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియా రెండో విజయం సాధించింది. టోర్నీలో తొలుత న్యూజిలాండ్‌ వుమెన్‌ను 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన ఆసీస్‌ జట్టు.. తాజాగా పాకిస్తాన్‌ (Aus W vs Pak W)పై ఘన విజయం సాధించింది.

కొలంబోలోని ఆర్‌. ప్రేమదాస స్టేడియంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన ఆసీస్‌.. పాక్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు కెప్టెన్‌ అలిసా హేలీ (20), ఫోబే లిచ్‌ఫీల్డ్‌ (10).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఎలిస్‌ పెర్రీ (5) విఫలం కావడంతో ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

మూనీ సెంచరీ.. అలనా హాఫ్‌ సెంచరీ
ఆ తర్వాత కూడా పాక్‌ బౌలర్లు విజృంభించడంతో ఐదో నంబర్‌ ప్లేయర్‌ అనాబెల్‌ సదర్లాండ్‌ (1) సహా ఆ తర్వాత వచ్చిన ఆష్లే గార్డ్‌నర్‌ (1), తహీలా మెగ్రాత్‌ (5), జార్జియా వారేహామ్‌ (0), కిమ్‌ గార్త్‌ (11) పెవిలియన్‌కు క్యూ కట్టారు.

ఈ నేపథ్యంలో కేవలం 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆసీస్‌ను బెత్‌ మూనీ (Beth Mooney), అలనా కింగ్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. మూనీ 114 బంతుల్లో 109 పరుగులతో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.

చెలరేగిన ఆసీస్‌ బౌలర్లు
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఆసీస్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. కిమ్‌ గార్త్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ సదాఫ్‌ షమాస్‌ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించగా.. మునీబా అలీ (3)ని మేగన్‌ షట్‌ వెనక్కి పంపింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన సిద్రా ఆమిన్‌ (35) కాసేపు పోరాడగా.. ఆష్లే గార్డ్‌నర్‌ ఆమెను అవుట్‌ చేసింది.

ఇక నాలుగో నంబర్‌ బ్యాటర్‌ సిద్రా నవాజ్‌ (5) వికెట్‌ను కిమ్‌ గార్త్‌ తన ఖాతాలో వేసుకోగా.. నటాలియా పర్వేజ్‌ (1)ను మేగన్‌ పెవిలియన్‌కు పంపింది. ఇక కెప్టెన్‌ ఫాతిమా సనా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సదర్లాండ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కాగా.. డయానా బేగ్‌ (7)ను జార్జియా వారేహామ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది.

114 పరుగులకే కుప్పకూలిన పాక్‌
ఈ క్రమంలో 86 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాక్‌ను లక్ష్యం దిశగా నడిపించేందుకు స్పిన్నర్లు రమీన్‌ షమీమ్‌ (15), నష్రా సంధు (11) విఫలయత్నం చేశారు. అయితే, అలనా బౌలింగ్‌లో నష్రా తొమ్మిదో వికెట్‌గా.. సదర్లాండ్‌ బౌలింగ్‌లో షమీమ్‌ పదో వికెట్‌గా వెనుదిరగడంతో పాక్‌ పోరాటం ముగిసిపోయింది.

ఈ క్రమంలో 36.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్‌ అయిన పాక్‌.. ఆసీస్‌ చేతిలో 107 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే.. ఆసీస్‌ తమ రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో ఆడాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్‌ పడకుండానే ఆ మ్యాచ్‌ రద్దైపోయింది.

చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
ICC Womens World Cup 2025
pakistan vs australia
Beth Mooney
Fatima Sana
Alyssa Healy
Alana King
Colombo
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ నిష్క్ర‌మ‌ణ‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ నిష్క్ర‌మ‌ణ‌

T20 WC 2026: పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఐసీసీ

T20 WC 2026: పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఐసీసీ

ఆటలోనే కాదు పౌరుషంలో కూడా తగ్గేదే లేదు...

ఆటలోనే కాదు పౌరుషంలో కూడా తగ్గేదే లేదు...

టీమిండియాతో మ్యాచ్‌.. పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

టీమిండియాతో మ్యాచ్‌.. పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్‌ పాక్‌దే

షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్‌ పాక్‌దే

ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్‌.. రెండో వన్డేలో పాక్ చిత్తు

ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్‌.. రెండో వన్డేలో పాక్ చిత్తు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.