Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

యశస్విని వెనక్కినెట్టిన రచిన్‌: అవార్డులు గెలిచింది వీళ్లే.. పూర్తి జాబితా

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 25, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
skykohli.jpg

ICC Awards 2023: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)- 2023 వార్షిక పురస్కారాల్లో భారత్‌కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలవగా.. టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకున్నాడు.

కోహ్లి ఏకంగా నాలుగోసారి(వన్డే) ఈ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించగా.. సూర్య వరుసగా రెండోసారి పురస్కారం అందుకుని ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని ఘనత(టీ20) సాధించాడు. 

కెప్టెన్సీలో అదరగొట్టాడు.. అందుకే

గత ఏడాది సూర్య 18 మ్యాచ్‌లు ఆడి 155.95 స్ట్రయిక్‌రేట్‌తో 733 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ‘టి20 ఫార్మాట్‌లో భారత మిడిలార్డర్‌ వెన్నెముకగా సూర్య ఉన్నాడు. తన దూకుడైన ఆటతో పలుసార్లు భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్సీ బాధ్యతల్లోనూ అతను ఒత్తిడికి లోనుకాకుండా నిలకడగా రాణించాడు’ అని ఐసీసీ వ్యాఖ్యానించింది.  

ఇక ఈ టీమిండియా స్టార్లతో పాటు 2023 ఏడాదికి గానూ ఐసీసీ అవార్డులు అందుకున్న జాబితా చూద్దాం.

►మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- ప్యాట్‌ కమిన్స్‌(ఆస్ట్రేలియా)- ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 విజేత జట్టు కెప్టెన్‌

►మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- విరాట్‌ కోహ్లి(ఇండియా)

డబ్ల్యూటీసీ టైటిల్‌

►మెన్స్‌ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- ఉస్మాన్‌ ఖవాజా (ఆస్ట్రేలియా)- 13 మ్యాచ్‌లలో కలిపి 1210 పరుగులు- ఆసీస్‌ డబ్ల్యూటీసీ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర

యశస్విని వెనక్కినెట్టి

►మెన్స్‌ ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్‌)- వన్డే వరల్డ్‌కప్‌లో 578 పరుగులు. యశస్వి జైస్వాల్‌, గెరాల్డ్‌ కోయెట్జీ, దిల్షాన్‌ మధుషాంకలను వెనక్కినెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు.

డచ్‌ జట్టు విజయాలకు కారణం

►మెన్స్‌ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- బాస్‌ డి లీడే(నెదర్లాండ్స్‌)- 285 పరుగులు చేసి, 15 వికెట్లు తీసి- వన్డే వరల్డ్‌కప్‌నకు డచ్‌ జట్టు అర్హత సాధించడంలో కీలక పాత్ర- వన్డే ప్రపంచకప్‌లో 139 పరుగులు- 16 వికెట్లు.

మహిళా క్రికెట్‌లో మహరాణులు

►వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- నాట్‌ సీవర్‌ బ్రంట్‌(ఇంగ్లండ్‌)

►వుమెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- చమరి ఆటపట్టు(శ్రీలంక)- 8 మ్యాచ్‌లలో కలిపి 415 రన్స్‌

►వుమెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- హేలీ మాథ్యూస్‌(వెస్టిండీస్‌)- స్టెఫానీ టేలర్‌ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో వెస్టిండియన్‌ ప్లేయర్‌- టీ20లలో జట్టుకు అవసరమైన సమయంలో 99 నాటౌట్‌, ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 132, 79 రన్స్‌

►వుమెన్స్‌ ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- ఫోబె లిచ్‌ఫీల్డ్‌(ఆస్ట్రేలియా)- ఆసీస్‌ టాపార్డర్‌కు వెన్నెముకగా నిలిచినందుకు

►వుమెన్స్‌ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- క్వీంటర్‌ అబెల్‌(కెన్యా)- అంతర్జాతీయ టీ20లలో 476 పరుగులు, 30 వికెట్లు

జింబాబ్వేకే ఆ అవార్డు

స్పిరిట్‌ ఆఫ్‌ ది క్రికెట్ అవార్డు- జింబాబ్వే జాతీయ జట్టు(ఓటమి బాధలో ఉన్న వెస్టిండీస్‌ ఆటగాడు అకీల్‌ హుసేన్‌ను ఓదార్చినందుకు)

అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌.

ఐసీసీ టెస్టు జట్టు: 

ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్.

ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: 

ఫోబె లిచ్‌ఫీల్డ్, చమరి ఆటపట్టు (కెప్టెన్), ఎలిస్ పెర్రీ, అమేలియా కెర్, బెత్ మూనీ (వికెట్ కీపర్), నాట్ సీవర్-బ్రంట్, యాష్ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, నాడిన్ డి క్లెర్క్, లీ తహుహు, నహీదా అక్తర్.

ఐసీసీ 2023 వన్డే జట్టు: 

రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.

ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్:

చమరి అటపట్టు(కెప్టెన్), బెత్ మూనీ (వికెట్ కీపర్), లారా వోల్వార్డ్, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, ఎల్లిస్ పెర్రీ, యాష్ గార్డెన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగాన్ షట్‌.

ఐసీసీ పురుషుల టీ20 జట్టు: 

యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్‌మన్‌, సికందర్ రజా, అల్పేశ్ రాంజాని, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎన్గరవ, అర్ష్‌దీప్‌ సింగ్.

చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు!

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
ICC awards
Virat Kohli
suryakumar yadav
Pat Cummins
Rachin Ravindra
Nat Sciver
Usman Khawaja
rohit sharma
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సెంచ‌రీ హీరోకు నో ఛాన్స్‌

భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సెంచ‌రీ హీరోకు నో ఛాన్స్‌

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

రోహిత్‌ శర్మ హ్యాట్రిక్‌.. వీడియో వైరల్‌

రోహిత్‌ శర్మ హ్యాట్రిక్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.