Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

వీడి వల్ల డబ్బు దండగ!.. వాళ్ల ఫోన్లు కూడా ఎత్తను: టీమిండియా స్టార్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Aug 7, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Harshit-Rana.jpg

‘వీడి వల్ల ఏమవుతుందిలే? క్రికెట్‌ ఆడుతున్న ప్రతోడు సచిన్‌, కోహ్లి అయిపోతారా ఏంటి? వీడిపై పెట్టుబడి దండగ. డబ్బు వృథా’ అంటూ గేలి చేసిన వాళ్ల ముందే టీమిండియాకు ఆడటమే కాదు.. చిన్న వయసులోనే ఐసీసీ ట్రోఫీని ముద్దాడితే.. ఆ కిక్కే వేరప్పా!!

భారత యువ పేసర్‌ హర్షిత్‌ రాణా Harshit Rana) విషయంలో ఇదే నిజమైంది. తనను హేళన చేసిన బంధువుల ముందే తండ్రిని సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు 23 ఏళ్ల ఈ ఫాస్ట్‌బౌలర్‌. దండగ అంటూ తిట్టినోళ్లే తనను పొగిడేలా చేసుకున్నాడు. అప్పుడు కనీసం తనతో మాట్లాడని వాళ్లు కూడా.. ఇప్పుడు ఫోన్లు చేస్తుంటే కాస్త గొప్పగానే అనిపిస్తున్నా.. వారికి రిప్లై మాత్రం ఇవ్వడం లేదంటున్నాడు హర్షిత్‌ రాణా.

పేరుప్రఖ్యాతులు రాగానే..
దేశానికి ఆడే స్థాయికి చేరుకునే క్రమంలో తనకు బంధువుల నుంచి ఎదురైన తిరస్కారం గురించి హర్షిత్‌ రాణా స్వయంగా వెల్లడించాడు. ‘‘మనకు ఒక్కసారి పేరుప్రఖ్యాతులు రాగానే.. అప్పటిదాకా దూరంగా ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ‘దగ్గరై బంధువు’లైపోతారు.


నిరాశపరిచే వారే ఎక్కువ
నేను క్రికెటర్‌ అవుతానంటే నవ్విన నా సోదరసోదరీమణులు, మా బంధువులు.. అనవసరంగా వాడి కోసం కష్టపడుతున్నావంటూ మా నాన్నను వెనక్కిలాగే ప్రయత్నం చేసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.

వాళ్ల కాల్స్‌ లిఫ్ట్‌ చేయను
వీడి వల్ల ఏం కాదు.. క్రికెట్‌లో అసలేం ఉందని నిరాశపరిచిన వాళ్లే ఎక్కువ. అయితే, ఈరోజు వాళ్లే మళ్లీ మా నాన్నకు ఫోన్‌ చేసి.. నీ కష్టానికి ఫలితం దక్కిందంటూ పొగడటం వింతగా అనిపిస్తుంది. వాళ్లు నాకు కూడా ఫోన్లు చేస్తారు. కానీ నేను మాత్రం వాళ్ల కాల్స్‌ లిఫ్ట్‌ చేయను.

ఇదేమీ నా ఓవర్‌ ఆటిట్యూడ్‌ కాదు. గతంలో వాళ్లు నన్ను చాలా మాటలు అన్నారు. అలాంటి వాళ్లతో ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదనే అనుకుంటాను’’ అంటూ హర్షిత్‌ రాణా ఉద్వేగానికి లోనయ్యాడు. యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్లాబాదియా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌.. తన మనసులోని భావాలు పంచుకున్నాడు.

ఐపీఎల్‌ నుంచి టీమిండియా బాట
కాగా 2022లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో అడుగుపెట్టిన హర్షిత్‌ రాణా.. గతేడాది అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 2024లో కేకేఆర్‌ టైటిల్‌ గెలవడంలో ఈ రైటార్మ్‌ పేసర్‌ తన వంతు పాత్ర పోషించాడు.

ఈ క్రమంలోనే టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన హర్షిత్‌ రాణా.. 2024లోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఈ ఏడాది వన్డే, టీ20లలోనూ టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాడు.

ఇప్పటి వరకు తన కెరీర్‌లో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడిన 23 ఏళ్ల హర్షిత్‌ రాణా.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 4, 10, 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది రోహిత్‌ శర్మ సారథ్యంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడు. చివరగా ఈ మెగా వన్డే టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్‌ ఆడి ఓ వికెట్‌ తీశాడు కూడా! 

చదవండి: Mohammed Siraj: అసదుద్దీన్‌ ఒవైసీకి సిరాజ్‌ రిప్లై ఇదే.. పోస్ట్‌ వైరల్‌
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Harshit Rana
ICC Champions Trophy 2025
india vs australia
Delhi
IPL 2025
Kolkata Knight Riders
Off the field
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇథనాల్‌ పెట్రోల్‌.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ

ఇథనాల్‌ పెట్రోల్‌.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ

 కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ రిలీఫ్‌

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ రిలీఫ్‌

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

కాక్రోచ్‌ పార్టీ సంచలన ఆరోపణలు!

కాక్రోచ్‌ పార్టీ సంచలన ఆరోపణలు!

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.