Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

పెళ్లిళ్లు.. విడాకులు.. హైదరాబాద్‌ స్పోర్ట్స్‌ స్టార్స్‌కి ఏమైంది..?

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 15, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sports.jpg

సెలబ్రిటీలకు సంబంధించి పెళ్లిళ్లు ఎంత గొప్పగా ప్రచారానికి నోచుకుంటాయో విడాకులు అంతకు మించి ప్రచారం పొందుతాయి. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీలే వివాహ బంధాన్ని విఛ్చిన్నం చేసుకోవడంలో ముందుంటారని ఒక అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు అది దాదాపుగా అన్ని రంగాలకూ విస్తరించింది. అదే క్రమంలో ఇప్పుడు క్రీడారంగాన్ని కూడా అంటుకున్నట్టు కనిపిస్తోంది.

తాజాగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తన విడాకుల నిర్ణయాన్ని ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా ప్రకటించారు. పారుపల్లి కశ్యప్‌తో (సైనా భర్త) విడిపోయే నిర్ణయం తాను స్వయంగా తీసుకున్నానని, ఈ ప్రయాణంలో ‘‘పీస్, గ్రోత్, హీలింగ్‌’’ కోసం ఇద్దరం  ఒకే మాటతో ముందుకు వెళుతున్నామని తెలిపింది. ఇది ఓ రకంగా షాకింగ్‌ అనే చెప్పాలి.

సాధారణంగా స్పోర్ట్స్‌ స్టార్స్‌కు సంబంధించిన విడాకుల అంశాలపై ముందస్తు అంచనాలు, సూచనలు ఏవీ వెలువడడం జరుగదు. అదే సినిమా రంగానికి చెందిన వాళ్లయితే విడిపోవడానికి కాస్త ముందుగానే మీడియా ఈ విషయాన్ని పసిగట్టేయగలుగుతుంది.

ఇక్కడ మరో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విశేషం ఏమిటంటే... హైదరాబాద్‌ నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు, మరీ ముఖ్యంగా తమ క్రీడా విజయాలతో ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచిన మహిళలది ఇదే బాట కావడం. గతంలో ఇదే విధంగా విడిపోయిన ప్రముఖ క్రీడాకారిణుల్లో సానియా మీర్జా అందరికీ చిరపరిచితం.

ఆటతోనే కాకుండా అందంతో కూడా అందరి మనసుల్నీ దోచుకున్న టెన్నిస్‌ స్టార్‌ సానియా.. పాకిస్తాన్‌ క్రికెటర్‌  షోయెబ్‌ మాలిక్‌ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ బంధం చివరికి 2024 లో ముక్కలైంది. సానియా మీర్జా కూడా హైదరాబాద్‌ వాసే కావడం గమనార్హం.

మరో క్రీడాకారిణి కూడా ఇదే నగరం నుంచి విడాకులు తీసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం వరకూ బ్యాడ్మింటన్‌ కి చిరునామాగా నిలిచిన గుత్తా జ్వాల చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆమె 2005లో మరో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చేతన్‌ ఆనంద్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కేవలం ఆరేళ్లకే అంటే 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

నాటి ఒక యువ టాలీవుడ్‌ హీరోతో అనుబంధం అంటూ పుకార్లకు కూడా ఎదుర్కున్న గుత్తా జ్వాల కూడా హైదరాబాద్‌ వాసే.  తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్‌ ప్రతిష్టను నలుదిశలా చాటిన ఈ టాప్‌ స్పోర్ట్స్‌ స్టార్స్‌ యువతుల్లో క్రీడారంగం పట్ల ఎంతగా స్ఫూర్తి నింపారో తెలియంది కాదు.

అయితే ఒకే నగరానికి చెందిన వీరంతా వ్యక్తిగత జీవితాల్లో ఒకే రకమైన ఒడిదుడుకులు ఎదుర్కోవడం విచిత్రం. కొసమెరుపు ఏమిటంటే... హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ చిత్ర పటంలో చేర్చిన మహ్మద్‌ అజారుద్దీన్‌ కూడా విడాకులు తీసుకోవడం. ఆయన 1996లో సినీనటి సంగీతా బిజిలానీని పెళ్లి చేసుకుని 2010లో విడాకులు తీసుకున్నారు.
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Saina Nehwal
Parupalli Kashyap
Sania Mirza
Gutta Jwala
Hyderabad
Mohammed Azharuddin
Satya Stories
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.