Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

మెరుపు సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. సెలెక్టర్లకు మరోసారి సవాల్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Aug 18, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sarfaraj_20khan.jpg

టీమిండియా యువ బ్యాటర్‌, ముంబై స్టార్‌ ప్లేయర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ బుచ్చిబాబు క్రికెట్‌ టోర్నీలో మెరుపు సెంచరీతో చెలరేగాడు. టీఎన్‌సీఏ ఎలెవెన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 114 బంతుల్లో 138 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కేవలం 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆకాశ్‌ పార్కర్‌తో కలిసి ఆరో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొడ కండరాలు పట్టేయడంతో ఆకస్మికంగా మైదానాన్ని వీడాడు.

భారీ పరివర్తన.. 2 నెలల్లో 17 కిలోలు
27 ఏళ్ల సర్ఫరాజ్‌ ఇటీవల భారీగా బరువు తగ్గాడు. ఓవర్‌ వెయిట్‌ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న అతడు.. 95 కిలోల నుంచి 78 కిలోలకు చేరాడు. కఠినమైన శారీరక శ్రమ, సమతూకమైన డైట్‌ను పాటించి రెండు నెలల్లో ఏకంగా 17 కిలోలు తగ్గి ఔరా అనిపించాడు. సర్ఫరాజ్‌ వెయిట్‌ లాస్‌ ప్రక్రియ స్పూర్తిదాయకంగా ఉంది. తండ్రి పర్యవేక్షన, విరాట్‌ కోహ్లి స్పూర్తితో బరువు తగ్గినట్లు సర్పారాజ్‌ చెప్పుకొచ్చాడు.

సెలెక్టర్లకు సవాల్‌
తాజా సెంచరీతో సర్ఫరాజ్‌ భారత సెలెక్టర్లకు మరోసారి సవాలు విసిరాడు. గత కొంతకాలంగా మంచి ప్రదర్శనలే చేస్తున్నా సర్ఫరాజ్‌కు టెస్ట్‌ జట్టులో చోటు దక్కడం లేదు. సీనియర్ల కారణంగా అతనికి అవకాశాలు రావడం లేదు.

స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ తొలి మ్యాచ్‌లోనే మెరుపు హాఫ్‌ సెంచరీ బాది ఆకట్టుకున్నాడు. ఆతర్వాత న్యూజిలాండ్‌పై 150 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.

అయితే సర్ఫరాజ్‌ సెంచరీ తర్వాత ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా 11 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 3 హాఫ్‌ సెంచరీల సాయంతో 371 పరుగులు చేశాడు.

టీమిండియాలో సీనియర్లు స్థిరపడటం చేత సర్ఫరాజ్‌కు సరైన అవకాశాలు రాలేదు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి ఎంపికైనా బెంచ్‌కే పరిమితమయ్యాడు. తాజాగా ఇంగ్లండ్‌ సిరీస్‌కు జట్టులో చోటే దక్కలేదు. ఆ సిరీస్‌కు ముందు సర్ఫరాజ్‌ ఇండియా ఏ తరఫున ఆడుతూ ఇంగ్లండ్‌ లయన్స్‌పై 92 పరుగులు చేశాడు. అయినా భారత మిడిలార్డర్‌ బలంగా ఉండటంతో అతను జట్టుకు ఎంపిక కాలేదు.

ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కరుణ్‌ నాయర్‌, సాయి సుదర్శన్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో టీమిండియా తదుపరి ఆడబోయే టెస్ట్‌ సిరీస్‌ల కోసం​ సర్ఫరాజ్‌ను పరిగణలోకి తీసుకోవచ్చు.

 

 

 

 

 

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
buchi babu cricket tournament
Mumbai Cricketer
Sarfaraz Khan
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సుడిగాలి శతకం.. అయినా వరించని అదృష్టం

సుడిగాలి శతకం.. అయినా వరించని అదృష్టం

ఆసుపత్రిపాలైన సర్ఫరాజ్‌ ఖాన్‌

ఆసుపత్రిపాలైన సర్ఫరాజ్‌ ఖాన్‌

భారత్‌తో మ్యాచ్‌.. పాక్‌ హెడ్‌ కోచ్‌  ఘోర తప్పిదం

భారత్‌తో మ్యాచ్‌.. పాక్‌ హెడ్‌ కోచ్‌ ఘోర తప్పిదం

సర్ఫరాజ్, సిద్ధేశ్‌ సెంచరీలు

సర్ఫరాజ్, సిద్ధేశ్‌ సెంచరీలు

సరికొత్త తలనొప్పిగా సర్ఫరాజ్‌ ఖాన్‌

సరికొత్త తలనొప్పిగా సర్ఫరాజ్‌ ఖాన్‌

సర్ఫరాజ్‌ సునామీ

సర్ఫరాజ్‌ సునామీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.