Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ జీతం అన్ని కోట్లా?.. ద్రవిడ్‌ కంటే రెట్టింపు?!

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 10, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gauti_0.jpg

టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టనున్నాడు. భారత జట్టు హెడ్‌ కోచ్‌గా సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. కాగా రెండుసార్లు ప్రపంచకప్‌(2007, 2011) గెలిచిన భారత జట్టులో భాగమైన గౌతీ రాజకీయాల్లోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు.

రెండు పడవల మీద ప్రయాణం చేయలేనని
బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన ఈ ఢిల్లీ బ్యాటర్‌.. కామెంటేటర్‌గానూ కొనసాగాడు. అయితే, రెండు పడవల మీద ప్రయాణం చేయలేనని చెబుతూ రాజకీయాలకు స్వస్తి పలికిన గంభీర్‌.. పూర్తి స్థాయిలో క్రికెట్‌కే అంకితమయ్యాడు.

ఐపీఎల్‌ జట్లు లక్నో సూపర్‌ జెయింట్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మెంటార్‌గా వ్యవహరించి జట్లను విజయాల బాట పట్టించాడు. లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్‌ చేరడంలో గౌతీ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది కేకేఆర్‌ చాంపియన్‌గా నిలవడంలోనూ ఈ మాజీ కెప్టెన్‌ సేవలు మరువలేనివి.

ఈ క్రమంలోనే గౌతం గంభీర్‌ భారత పురుషుల క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో గౌతీ జీతం ఎంత ఉంటుందన్న అంశం క్రికెట్‌ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది.

టీ20 ప్రపంచకప్‌-2024 అందించి
కాగా 2021 నుంచి ఇప్పటి దాకా రాహుల్‌ ద్రవిడ్‌ టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వెళ్తూ వెళ్తూ భారత్‌కు టీ20 ప్రపంచకప్‌-2024 అందించిన కోచ్‌గా ద్రవిడ్‌ పేరు సంపాదించాడు.

ఇక హెడ్‌ కోచ్‌గా అతడికి బీసీసీఐ ఏడాదికి రూ. 12 కోట్ల మేర వేతనం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే గంభీర్‌ మాత్రం ఇంతకు రెట్టింపు జీతం పొందనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

కేకేఆర్‌ మెంటార్‌గా గంభీర్‌కు రూ. 25 కోట్లు?
కాగా కేకేఆర్‌ మెంటార్‌గా గంభీర్‌కు రూ. 25 కోట్లు ఆ జట్టు యాజమాన్యం పారితోషికంగా అందించిందని అప్పట్లో వదంతులు పుట్టుకొచ్చాయి. 

ఈ నేపథ్యంలో..  హెడ్‌ కోచ్‌గా వచ్చినందున ఆ పదవికి రాజీనామా చేయాలి కాబట్టి.. బోర్డు ఈ  మొత్తం తనకు జీతంగా చెల్లించాలని గౌతీ కండిషన్‌ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

జీతంతో పాటు అన్ని సదుపాయాలు
వార్తా సంస్థ IANS వివరాల ప్రకారం.. 2019 వరకు ప్రధాన కోచ్‌కు రోజూవారీ వేతనం కింద రూ. 21 వేలు(విదేశీ పర్యటనలో రూ. 42 వేలు), బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణం, హోటళ్లలో బస, అందుకు సంబంధించిన ప్రతీ ఖర్చు బీసీసీఐ చెల్లించేదని తెలుస్తోంది.

అయితే, హెడ్‌ కోచ్‌ వేతనం విషయంలో బేరసారాలకు ఆస్కారం ఉందనే వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గంభీర్‌ నియామకానికి సంబంధించిన ప్రకటన కూడా ఆలస్యం జరిగిందని నెట్టింట ప్రచారం సాగింది.

ఎట్టకేలకు గంభీర్‌ ఆశించిన మొత్తానికి బీసీసీఐ సరేనన్న తర్వాతే అతడు పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అయితే, ఇంత వరకు టీమిండియా హెడ్‌ కోచ్‌ జీతం గురించి ఎక్కడా ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం గమనార్హం.

అదే నా లక్ష్యం: గంభీర్‌
‘‘నా చిరునామా భారతదేశం. దేశానికి సేవ చేయగలడం నా జీవితంలో కలిగిన అతి పెద్ద అదృష్టం. ఇప్పుడు మరో రూపంలో పునరాగమనం చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఎప్పటిలాగే ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేయడమే నా లక్ష్యం.

140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను టీమిండియా మోస్తుంది. వారి కలలు నిజంచేసేందుకు నా స్థాయిలో ఏదైనా చేసేందుకు నేను సిద్ధం’’ అని భారత జట్టు కొత్త హెడ్‌ కోచ్‌గా నియమితుడైన తర్వాత గౌతమ్‌ గంభీర్ వ్యాఖ్యానించాడు.  కాగా గంభీర్‌ మూడున్నరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు.

చదవండి: దటీజ్‌ ద్రవిడ్‌.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ!

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Gautam Gambhir
team india coach
BCCI
rahul dravid
T20 World Cup 2024
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

 బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

తెలంగాణ టి20కి వేళాయె..

తెలంగాణ టి20కి వేళాయె..

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

ఇంగ్లండ్‌ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!

ఇంగ్లండ్‌ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!

‘నాపై దేశద్రోహి ముద్ర’.. గంభీర్‌పై శ్రీశాంత్‌ ఆరోపణలు

‘నాపై దేశద్రోహి ముద్ర’.. గంభీర్‌పై శ్రీశాంత్‌ ఆరోపణలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.