Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

‘అతడి త్యాగం.. నా సెంచరీ.. టీమిండియాకు సెలక్ట్‌ అయ్యాను’

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 9, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sachin.jpg

సచిన్‌ టెండుల్కర్‌.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో శతక శతకాలు సాధించిన ధీరుడిగా అతడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. రెండున్నర దశాబ్దాల కెరీర్‌లో టీమిండియా తరఫున లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించి క్రికెట్‌ గాడ్‌గా నీరాజనాలు అందుకున్నాడు సచిన్‌.

అయితే, తాను టీమిండియాకు ఎంపికయ్యే క్రమంలో సహచర ఆటగాడు ఒకరు తన కోసం చేసిన త్యాగం గురించి సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) తాజాగా వెల్లడించాడు. అది 1989- 90 దేశీ క్రికెట్‌ సీజన్‌. ముంబైలోని వాంఖడే వేదికగా ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా- ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి.

సచిన్‌ కోసం విరిగిన చేతితోనే బ్యాటింగ్‌
రెస్టాఫ్‌ ఇండియాకు ఆడుతున్న సచిన్‌ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఇంతలో తొమ్మిదో వికెట్‌ పడింది. అప్పటికి బ్యాటింగ్‌కు రావాల్సిన ప్లేయర్‌ గాయపడ్డాడు. అతడు మరెవరో కాదు.. టీమిండియా మాజీ క్రికెటర్‌ గురుశరణ్‌ సింగ్‌ (Gursharan Singh). అతడు బ్యాటింగ్‌కు వస్తేనే సచిన్‌ తన శతక మార్కును అందుకోగలడు.

సచిన్‌ కోసం విరిగిన చేతితోనే బ్యాటింగ్‌ చేసేందుకు గురుశరణ్‌ సిద్ధమయ్యాడు. అతడి సహకారంతో సచిన్‌ సెంచరీ (103) పూర్తి చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌ ద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టు తరఫున అరంగేట్రానికి బాటలు వేసుకున్నాడు.

అతడి త్యాగం.. నా సెంచరీ
నాటి ఈ ఘటన గురించి సచిన్‌ టెండుల్కర్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘‘1989లో నేను ఇరానీ ట్రోఫీ ఆడుతున్న సమయం. టీమిండియా సెలక్షన్‌ కోసం ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఆ మ్యాచ్‌లో నేను 90 పరుగులు పూర్తి చేసుకుని సెంచరీ దిశగా పయనిస్తున్నా.

ఇంతలో తొమ్మిదో వికెట్‌ పడింది. నేను శతకం పూర్తి చేసుకుని జట్టు పరువు పోకుండా కాపాడాలని అనుకున్నా. కానీ బ్యాటింగ్‌కు రావాల్సిన గురుశరణ్‌ చెయ్యి విరిగింది. అయినప్పటికీ.. అప్పటి సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ రాజ్‌ సింగ్‌ దుంగర్పూర్‌ .. గురుశరణ్‌ను నాకు మద్దతుగా నిలవాల్సిందిగా కోరారు.


టీమిండియాకు సెలక్ట్‌ అయ్యాను
ఆయన మాట ప్రకారం గురుశరణ్‌ క్రీజులోకి వచ్చాడు. అతడి సాయంతో నేను సెంచరీ పూర్తి చేసుకుని.. టీమిండియాకు సెలక్ట్‌ అయ్యాను కూడా!.. ఆ తర్వాత గురుశరణ్‌ కూడా భారత జట్టుకు ఆడాడు. ఆరోజు గురుశరణ్‌ చూపిన ధైర్యం, ఔదార్యం మరువలేనివి.

డ్రెసింగ్‌రూమ్‌లో నేను గురుశరణ్‌కు అందరి ముందు ధన్యవాదాలు తెలిపాను. విరిగిన చెయ్యితో బ్యాటింగ్‌ చేయడం అంత తేలికేమీ కాదు. నా సెంచరీ పూర్తైందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. ఆ సమయంలో అతడు చూపిన ధైర్యం, జట్టు కోసం పడిన తాపత్రయం నా హృదయాన్ని మెలిపెట్టాయి’’ అని సచిన్‌ టెండుల్కర్‌.. గురుశరణ్‌ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు.

మ్యాచ్‌ ఓడినా..
కాగా నాటి ఇరానీ కప్‌ మ్యాచ్‌లో ఢిల్లీ విధించిన 554 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెస్టాఫ్‌ ఇండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. 209 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 

ఈ క్రమంలో గురుశరణ్‌ సాయంతో ఆఖరి వికెట్‌కు సచిన్‌ మరో 36 పరుగులు జోడించగలిగాడు. ఇక 245 పరుగులకు రెస్టాఫ్‌ ఇండియా ఆలౌట్‌ కాగా.. ఢిల్లీ 309 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, మ్యాచ్‌ ఓడినా.. వ్యక్తిగత ప్రదర్శన దృష్ట్యా సచిన్‌కు టీమిండియా నుంచి పిలుపు అందింది.

చదవండి: టీమిండియాకు ఆల్‌రౌండర్లు కావలెను!

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Sachin Tendulkar
team india
Irani Cup
rest of india
mumbai
Flashback Sports
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

ఎంతైనా సచిన్ సచినే.. 37 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బుడ్డోడు..

ఎంతైనా సచిన్ సచినే.. 37 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బుడ్డోడు..

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.