Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

‘వరల్డ్‌ నంబర్‌ వన్‌ కావాలని కోరుకోలేదు’

Sports Sakshi User Sakshi Sakshi Time Nov 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ro.jpg

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)పై భారత మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌ (Mohammad Kaif) ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ నంబర్‌ వన్‌ కావాలనే ఆశ హిట్‌మ్యాన్‌కు లేదని.. ఎల్లప్పుడూ జట్టు కోసమే తాపత్రయపడేవాడని తెలిపాడు. రోహిత్‌ అద్భుత కెప్టెన్సీ కారణంగానే భారత జట్టు వన్డే, టీ20లలో అగ్రస్థానానికి చేరుకుందని కొనియాడాడు.

కాగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) రోహిత్‌ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కు సారథ్య బాధ్యతలు అప్పగించగా.. హిట్‌మ్యాన్‌ కేవలం బ్యాటర్‌గా జట్టులో కొనసాగుతున్నాడు. 

తొలిసారి అగ్రస్థానం
ఇక ఆసీస్‌ టూర్‌లో మూడు వన్డేల సిరీస్‌లో 38 ఏళ్ల రోహిత్‌ 202 పరుగులు చేసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్నాడు. రెండు స్థానాలు మెరుగుపరచుకుని.. 781 పాయింట్లతో నంబర్‌ వన్‌ వన్డే బ్యాటర్‌గగా నిలిచాడు. 

అతిపెద్ద వయస్కుడిగా
తద్వారా సచిన్‌ టెండూల్కర్, మహేంద్ర సింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి, శుబ్‌మన్‌ గిల్‌ తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన ఐదో భారతీయ క్రికెటర్‌గా హిట్‌మ్యాన్‌ గుర్తింపు దక్కించుకున్నాడు. అంతేకాదు.. ఐసీసీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ దక్కించుకున్న అతిపెద్ద వయస్కుడిగానూ రోహిత్‌ చరిత్ర సృష్టించాడు.

వరల్డ్‌ నంబర్‌ వన్‌ కావాలని కోరుకోలేదు
ఈ నేపథ్యంలో మొహమ్మద్‌ కైఫ్‌ రోహిత్‌ శర్మ జట్టుకు నిస్వార్థ సేవ చేశాడంటూ అతడి అంకితభావాన్ని ప్రశంసించాడు. ‘‘ఐసీసీ వన్డే నంబర్‌ వన్‌ ర్యాంకు నడుచుకుంటూ రోహిత్‌ దగ్గరకు వచ్చింది. తాను ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ బ్యాటర్‌ కావాలని రోహిత్‌ ఎప్పుడూ అనుకోలేదు.

అలాంటి కోరిక ఒకటి మనసులో ఉందని ఎన్నడూ చెప్పనూ లేదు. తన ధ్యాస ఎల్లప్పుడూ జట్టు గురించే. టీమిండియా గెలవాలి.. టాప్‌లో ఉండాలి.. ఇదే తన ఆశయం. అతడు గొప్ప కెప్టెన్‌.

టీమిండియాను నంబర్‌ వన్‌గా నిలిపాడు
కీలక సమయాల్లో బ్యాట్‌తో రాణించడం తనకు అలవాటు. ఇక జట్టు విజయానికి కారణం ఎవరైనా వారిని తప్పక ప్రశంసిస్తాడు రోహిత్‌. టీమిండియా వన్డే ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్నపుడు రోహిత్‌ కెప్టెన్సీ చేపట్టాడు.

జట్టును నంబర్‌ వన్‌గా నిలిపిన తర్వాత అతడు తప్పుకోవాల్సి వచ్చింది. ఇక టీ20లలో రెండో ర్యాంకులో ఉన్నపుడు పగ్గాలు చేపట్టిన రోహిత్‌.. ఈ ఫార్మాట్లోనూ టీమిండియాను అగ్రస్థానంలో నిలిపి.. వరల్డ్‌కప్‌ (2024) అందించి కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు’’ అని కైఫ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

అజేయ సెంచరీతో చెలరేగిన రోహిత్‌ 
ఇక ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ... చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం ఆసీస్‌తో వన్డే సిరీస్‌ ఆడిన విషయం తెలిసిందే.  కంగారూలతో చివరి మ్యాచ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన రోహిత్‌ భారత్‌ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.

కాగా 2019 వన్డే ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో 5 శతకాలతో చెలరేగిన రోహిత్‌ శర్మ కెరీర్‌ అత్యుత్తమంగా 882 రేటింగ్‌ పాయింట్లు సాధించినా... రెండో ర్యాంక్‌లోనే నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అతడికి తొలిసారి ‘టాప్‌’ ప్లేస్‌ దక్కింది.

చదవండి: ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసు.. గెలిచినా.. ఓడినా ఏడ్చేస్తా: భారత కెప్టెన్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
rohit sharma
india vs australia
ODI series
ICC ODI rankings
Shubman Gill
mohammad kaif
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌

ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌

జయహో...భారత్.. శ్రీలంకపై ఘన విజయం

జయహో...భారత్.. శ్రీలంకపై ఘన విజయం

బుమ్రా పునరాగమనం

బుమ్రా పునరాగమనం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.