Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

టీమిండియా కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 27, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
harman.jpg

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత తమ తొలి సిరీస్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. సొంతగడ్డపై శ్రీలంకతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హ్యాట్రిక్‌ విజయాలు సాధించి.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ ట్రోఫీని గెలిచింది.

తిరువనంతపురం వేదికగా శుక్రవారం రాత్రి నాటి మ్యాచ్‌లో శ్రీలంక మహిళా జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన హర్మన్‌ సేన.. విజయాల పరంపరను కొనసాగించింది. గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ స్టేడియంలో టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ హర్మన్‌ నమ్మకాన్ని నిలబెట్టే రీతిలో భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.

 112 పరుగులకే పరిమితం
నిర్ణీత 20 ఓవర్లలో లంకను కేవలం 112 పరుగులకే పరిమితం చేశారు. రేణుకా సింగ్‌ ఠాకూర్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. లంక బ్యాటర్లలో ఓపెనర్‌ హాసిని పెరీరా (18 బంతుల్లో 25), ఇమేషా దులాని (32 బంతుల్లో 27), కవిశా దిల్హారి (13 బంతుల్లో 20), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కౌశాని నుతయంగన (16 బంతుల్లో 19 నాటౌట్‌) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.

ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. లంక బౌలర్‌ కవిశా దిల్హారి బౌలింగ్‌లో స్మృతి మంధాన (1) లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరిగింది. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌ (9)ను కవిశా వెనక్కి పంపింది.

షఫాలీ, హర్మన్‌ ధనాధన్‌
ఇలాంటి దశలో మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. షఫాలీ 42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది 79 పరుగులు చేయగా.. హర్మన్‌ (18 బంతుల్లో 21) షఫాలీతో కలిసి అజేయంగా నిలిచింది. 13.2వ ఓవర్లో ఫోర్‌ బాది షఫాలీ జట్టును గెలుపు తీరాలు దాటించింది.

ఇక ఇంతకుముందు విశాఖపట్నంలో తొలి రెండు టీ20లలోనూ గెలిచిన భారత్‌ 3-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. భారత జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ఇది 77వ విజయం. తద్వారా అంతర్జాతీయ మహిళల పొట్టి క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన సారథిగా హర్మన్‌ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి.. ఈ జాబితాలో తొలి స్థానానికి ఎగబాకింది.

మహిళల అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు (సూపర్‌ ఓవర్‌ సహా)
👉హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (ఇండియా)- 130 మ్యాచ్‌లలో 77 విజయాలు
👉మెగ్‌ లానింగ్‌ (ఆస్ట్రేలియా)- 100 మ్యాచ్‌లలో 76 విజయాలు
👉హీదర్‌ నైట్‌ (ఇంగ్లండ్‌)- 96 మ్యాచ్‌లలో 72 విజయాలు
👉చార్లెట్‌ ఎడ్‌వర్డ్స్‌ (ఇంగ్లండ్‌)- 93 మ్యాచ్‌లలో 68 విజయాలు
👉ఎన్‌ చైవాయి (థాయ్‌లాండ్‌)- 79 మ్యాచ్‌లలో 55 విజయాలు.

చదవండి: Ro-Ko: అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత?
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Harmanpreet Kaur
India vs Sri lanka
T20 series
Meg Lanning
Renuka Singh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సంజూను కావాలనే తప్పించారా?

సంజూను కావాలనే తప్పించారా?

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

హర్మన్‌ సేనకు మిథాలీరాజ్‌ కీలక సూచన

హర్మన్‌ సేనకు మిథాలీరాజ్‌ కీలక సూచన

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.