Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్‌ రిప్లై ఇవ్వాలి: పాక్‌ మాజీ కెప్టెన్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Nov 12, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
temindia.jpg

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్య‌మివ్వ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాక‌రించింది. ఇదే విష‌యాన్ని భార‌త క్రికెట్ బోర్డు ఐసీసీకి కూడా తెలియ‌జేసింది.

భార‌త్ ఆడే మ్యాచ్‌ల‌ని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించాల‌ని బీసీసీఐ డిమాండ్ చేస్తుండ‌గా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం అందుకు సుముఖంగా లేదు. క‌చ్చితంగా భార‌త జ‌ట్టు త‌మ దేశానికి రావ‌ల్సేందేన‌ని పీసీబీ మొండి పట్టుతో ఉంది. అయితే టీమిండియా పాక్‌కు రాదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా పీసీబీకి తేల్చి చేప్పినట్లు తెలుస్తోంది. అదే విధంగా పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ మరో ఆఫర్ ఇచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 

భారత్‌ ఆడే మ్యాచ్‌లు కోల్పోయినప్పటికీ నష్టపరిహారం పూర్తిగా భర్తీ చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కానీ ఈ ఆఫర్‌ను అంగీకరించేందుకు పీసీబీ సిద్దంగా లేదని, అందుకు నిరసనగా ఆతిథ్య హక్కులు వదులు కోవాలని భావిస్తున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

అదొక పగటి కల..
ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హాఫీజ్ మరోసారి భారత్‌పై విషం చిమ్మాడు. "ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్‌కు రావాలనుకోవడం ఒక పగటి కల. ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు సిద్దం ఉంది.

భద్రత పరంగా ఎటువంటి సమస్య లేదు. వరల్డ్‌లోని అన్ని క్రికెట్ దేశాలకు పాకిస్తాన్ స్వదేశంలో ఆతిథ్యం ఇస్తోంది. కానీ ఒక్క భారత్‌కే మాత్రం ఇక్కడ ఆడటం భద్రత కాదు. ఇందుకు బదులుగా మా ప్రభుత్వం, పీసీబీ నుంచి స్ట్రాంగ్‌ రిప్లై వ‌స్తుంది అని ఆశిస్తున్నా" హాఫీజ్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. 

It was a day dream that India wil come to Pakistan to play #ChampionsTrophy2025. Pakistan is safe & ready to host the event. Pakistan hosting all cricket nations at home but somehow not *secure* for India 😇😇😇. Waiting for strong & surprised response from government & PCB.

— Mohammad Hafeez (@MHafeez22) November 11, 2024

చదవండి: IND vs AUS: 'బుమ్రా వరల్డ్‌లోనే బెస్ట్‌ బౌలర్‌.. అతడితో అంత ఈజీ కాదు'

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
India vs Pakistan
ICC Champions Trophy 2025
Pakistan Cricket Board
BCCI
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

 బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

తెలంగాణ టి20కి వేళాయె..

తెలంగాణ టి20కి వేళాయె..

ఇంగ్లండ్‌ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!

ఇంగ్లండ్‌ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!

మాజీ కోచ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీ ఎలాంటి తప్పులు చేయకూడదంటే?

మాజీ కోచ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీ ఎలాంటి తప్పులు చేయకూడదంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.