Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

అందుకే అంతగా ఏడ్చాను!

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 15, 2024 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gukesh.jpg

తన భావోద్వేగంపై గుకేశ్‌ స్పందన 

సింగపూర్‌ సిటీ: వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌గా ఖాయమైన తర్వాత దొమ్మరాజు గుకేశ్‌ ఎంతో భావోద్వేగానికి లోనైన వీడియోను అభిమానులంతా చూశారు. విజయానంతరం అతను కన్నీళ్లపర్యంతమయ్యాడు. దీనిపై ‘ఫిడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుకేశ్‌ మాట్లాడాడు. అందుకు కారణాన్ని వివరించాడు. ‘నేను ఈ పోరులో మొదటినుంచి ఆధిక్యం కనబర్చలేదు. కొన్ని గేమ్‌లలో విజయానికి దగ్గరగా వచ్చి కూడా ఆ అవకాశం ఉపయోగించుకోలేకపోయాను. 

అంతా సాఫీగా, ఏకపక్షంగా పోరు జరిగి నా గెలుపు కాస్త ముందే ఖాయమై ఉంటే నేనూ మామూలుగానే కనిపించేవాడినేమో. కానీ చివర్లో గెలిచిన తీరుతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. అప్పటి వరకు గేమ్‌ డ్రా అవుతుందని, టైబ్రేక్‌కు వెళితే ఎలా సిద్ధం కావాలనే విషయం గురించి కూడా ఆలోచనలు మెదులుతున్నాయి. కానీ అద్భుతం జరిగి గెలిచేశాను. 

పైగా ఎనిమిదేళ్ల వయసులో చెస్‌ నేర్చుకున్న రోజులు కూడా ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. అందుకే ఆ కన్నీళ్లు’ అంటూ గుకేశ్‌ వివరించాడు. తాను ప్రపంచ చాంపియన్‌గా నిలిచినా...ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, అయితే ప్రతీ సవాల్‌కు తాను సిద్ధమేనని గుకేశ్‌ వ్యాఖ్యానించాడు. పైగా చదరంగంలాంటి ఆటలో ఎవరూ వంద శాతం పర్‌ఫెక్ట్‌గా ఉండరని అతను అన్నాడు. 

‘ఇప్పటి వరకు చెస్‌ను శాసించిన గొప్ప గొప్ప ఆటగాళ్లకు కూడా పరాజయాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ఆటలో నేర్చుకునేందుకు ఇంకా అవకాశం ఉంటుంది. నా వయసు కూడా అందుకు సహకరిస్తుంది. ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని గుకేశ్‌ చెప్పాడు. చాంపియన్‌షిప్‌ సమయంలో తనకు సరిగ్గా ఇంటి భోజనం తరహాలో దక్షిణాది వంటకాలు అందించిన చెఫ్‌కు అతను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
D Gukesh
World chess champion
Interview
Emotion
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

254 బల్లులు తిన్న.. పోతానేమో అనుకొని రాత్రంతా పడుకోలేదు

254 బల్లులు తిన్న.. పోతానేమో అనుకొని రాత్రంతా పడుకోలేదు

ఆమె ప్రశ్నిస్తే ట్రంప్‌కే కాదు.. ఎవరికైనా చెమట్లు పట్టాల్సిందే!

ఆమె ప్రశ్నిస్తే ట్రంప్‌కే కాదు.. ఎవరికైనా చెమట్లు పట్టాల్సిందే!

వరల్డ్‌ నంబర్‌వన్‌ను చావుదెబ్బ కొట్టిన ప్రజ్ఞానంద!

వరల్డ్‌ నంబర్‌వన్‌ను చావుదెబ్బ కొట్టిన ప్రజ్ఞానంద!

మేం లొంగిపోలేదు.. అరెస్ట్‌ చేశారు

మేం లొంగిపోలేదు.. అరెస్ట్‌ చేశారు

గుకేశ్‌కు ఈసారి ఓటమి తప్పదు!

గుకేశ్‌కు ఈసారి ఓటమి తప్పదు!

మళ్లీ ఓడిన గుకేశ్‌

మళ్లీ ఓడిన గుకేశ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.