Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

శుబ్‌మన్‌ సూపర్‌ సెంచరీ.. ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌

Sports Sakshi User Sakshi Sakshi Time May 27, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gt.jpg

మే 7న లీగ్‌ దశలో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీ కోల్పోవడంపై స్పందిస్తూ... ఇంకా కొన్ని మ్యాచ్‌లు ఉన్నాయి కదా, శతకం సాధిస్తాను అంటూ చెప్పాడు. అతని ఆత్మవిశ్వాసం ఎలాంటిదంటే ఒక సెంచరీ కాదు, తర్వాతి ఐదు మ్యాచ్‌ల్లో ఏకంగా మూడు  సెంచరీలు సాధించేశాడు! శుక్రవారం మ్యాచ్‌లో అతని సత్తా ఏమిటో మళ్లీ కనిపించింది.

అసలైన ‘సెమీస్‌’ సమరంలో అతను అద్భుత ఆటతో ఐదుసార్లు చాంపియన్‌ ముంబైను పుట్టి ముంచాడు. గిల్‌ శతకంతో భారీ స్కోరు సాధించిన గుజరాత్‌ ఆపై పదునైన బౌలింగ్‌తో రోహిత్‌ సేనను కట్టి పడేసింది. హోరాహోరీ అనుకున్న సమరం ఏకపక్షంగా మారిపోగా, డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు సిద్ధమైంది. రేపు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.   

అహ్మదాబాద్‌: హార్దిక్‌ పాండ్యా నాయకత్వంలో గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ టోర్నీలో వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌–2లో గుజరాత్‌ 62 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.  టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శుబ్‌మన్‌ గిల్‌ (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) శతకంతో కదం తొక్కాడు.

గిల్, సాయి సుదర్శన్‌ (31 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌కు 64 బంతుల్లోనే 138 పరుగులు జోడించారు. అనంతరం ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్‌ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, తిలక్‌ వర్మ (14 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. గుజరాత్‌ బౌలర్‌ మోహిత్‌ శర్మ 14 బంతుల్లో కేవలం 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.  



అంతా గిల్‌మయం... 

ఓపెనర్‌ సాహా (18) తొందరగానే అవుటయ్యాక గిల్‌ జోరు మొదలైంది. జోర్డాన్‌ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన తర్వాత అదే ఓవర్లో గిల్‌ ఇచ్చి న కష్టసాధ్యమైన క్యాచ్‌ను (వ్యక్తిగత స్కోరు 30 వద్ద) డేవిడ్‌ వదిలేయడం కూడా కలిసొచ్చింది. 32 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది.

మరోవైపు సుదర్శన్‌ కూడా తన వంతుగా సహకారం అందించాడు. హాఫ్‌ సెంచరీ తర్వాత గిల్‌ మరింత చెలరేగిపోయాడు. 50 నుంచి 100కు చేరేందుకు అతనికి 17 బంతులు మాత్రమే సరిపోయాయి. ఇందులో 6 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ఆకాశ్‌ మధ్వాల్‌ వేసిన ఓవర్లోనే 3 సిక్సర్లు బాదిన అతను చావ్లా ఓవర్లో మరో రెండు సిక్స్‌లు కొట్టాడు.

49 బంతుల్లో సెంచరీ సాధించిన అనంతరం గ్రీన్‌ ఓవర్లో గిల్‌ వరుసగా 6, 4, 6తో తన ధాటిని కొనసాగించా డు. మరో షాట్‌కు ప్రయత్నించి డేవిడ్‌కే క్యాచ్‌ ఇవ్వ డంతో ఎట్టకేలకు ఆ అద్భుత ఇన్నింగ్స్‌ ముగిసింది. చివర్లో వేగంగా ఆడటంలో విఫలమైన సుదర్శన్‌ ‘రిటైర్డ్‌ అవుట్‌’తో తప్పుకోగా, హార్దిక్‌ (13 బంతుల్లో 28 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు షాట్లతో గుజరాత్‌ భారీ స్కోరుతో  ముగించింది.  



తిలక్‌ మెరుపులు... 

గుజరాత్‌ ఇన్నింగ్స్‌ సమయంలో మైదానంలో కలిసి నడుస్తుండగా జోర్డాన్‌ మోచేయి అనుకోకుండా ఇషాన్‌ కంటికి తగిలింది. దాంతో ‘కన్‌కషన్‌’కు గురైన అతను ఆడలేని స్థితిలో ఉండగా,  ఓపెనర్‌గా వచ్చి న నేహల్‌ వధేరా (4) తొలి ఓవర్లోనే వెనుదిరిగాడు.

షమీ తర్వాతి ఓవర్లోనే రోహిత్‌ శర్మ (8) కూడా అవుట్‌ కావడంతో ముంబై కష్టాలు పెరిగాయి. ఈ దశలో తిలక్‌ జోరుతో ముంబై కోలుకుంది. తన తొలి 4 బంతుల్లోనే 2 సిక్స్‌లు కొట్టిన తిలక్‌... షమీని ఓ ఆటాడుకున్నాడు. అతని ఓవర్లో వరుసగా 4, 4, 4, 4, 2, 6 కొట్టడంతో 24 పరుగులు వచ్చాయి.

అయితే రషీద్‌ చక్కటి బంతితో తిలక్‌ను బౌల్డ్‌ చేయగా, గ్రీన్‌ (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయినా సూర్య క్రీజ్‌లో ఉండటంతో జట్టు ఆశలు మిగిలే ఉన్నాయి. కొన్ని చూడచక్కటి షాట్లు ఆడిన అతను 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ మోహిత్‌ ఓవర్లో మరో మెరుపు షాట్‌కు ప్రయత్నించి సూర్య బౌల్డ్‌ కావడంతో గెలుపు దారులు మూసుకుపోయాయి. 



స్కోరు వివరాలు 

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (స్టంప్డ్‌) ఇషాన్‌ (బి) చావ్లా 18; గిల్‌ (సి) డేవిడ్‌ (బి) ఆకాశ్‌ 129; సుదర్శన్‌ (రిటైర్డ్‌ అవుట్‌) 43; పాండ్యా (నాటౌట్‌) 28; రషీద్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 233. వికెట్ల పతనం: 1–54, 2–192, 3–214. 

బౌలింగ్‌: బెహ్రన్‌డార్ఫ్‌ 4–0–28–0, గ్రీన్‌ 3–0–35–0, ఆకాశ్‌ మధ్వాల్‌ 4–0–52–1, జోర్డాన్‌ 4–0–56–0, చావ్లా 3–0–45–1, కార్తికేయ 2–0–15–0.  



ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) లిటిల్‌ (బి) షమీ 8; వధేరా (సి) సాహా (బి) షమీ 4; గ్రీన్‌ (బి) లిటిల్‌ 30; సూర్యకుమార్‌ (బి) మోహిత్‌ 61; తిలక్‌ వర్మ (బి) రషీద్‌ 43; విష్ణు (సి) పాండ్యా (బి) మోహిత్‌ 5; డేవిడ్‌ (ఎల్బీ) (బి) రషీద్‌ 2; జోర్డాన్‌ (సి) సుదర్శన్‌ (బి) మోహిత్‌ 2; చావ్లా (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ 0; కార్తికేయ (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ 6; బెహ్రన్‌డార్ఫ్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్‌) 171. వికెట్ల పతనం: 1–5, 2–21, 3–72, 4–124, 5–155, 6–156, 7–158, 8–161, 9–162, 10– 171. బౌలింగ్‌: షమీ 3–0–41–2, పాండ్యా 2–0– 24–0, రషీద్‌ 4–0–33–2, నూర్‌ 4–0–35–0, లిటిల్‌ 3–0–26–1, మోహిత్‌ 2.2–0–10–5.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Gujarat Titans
Mumbai Indians
IPL 2023
Shubman Gill
qualifier 2
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

మీ వల్ల గందరగోళంలో శుబ్‌మన్‌ గిల్‌: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

మీ వల్ల గందరగోళంలో శుబ్‌మన్‌ గిల్‌: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

డబుల్‌ సెంచరీ చేసేవాడినే... కానీ

డబుల్‌ సెంచరీ చేసేవాడినే... కానీ

గిల్, ఇషాన్‌ శతకాల మోత

గిల్, ఇషాన్‌ శతకాల మోత

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.