Jasprit Bumrah- Sanjana Ganesh Child: టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా- స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని చిన్నారి బుమ్రా కూడా క్రీడాకారుడు కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కాగా బుమ్రా సతీమణి సంజనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
తాము తల్లిదండ్రులు అయిన విషయాన్ని వీరు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కుమారుడికి అంగద్ జస్ప్రీత్ బుమ్రాగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సహచర క్రికెటర్లు సహా అభిమానులు బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పేర్లను ట్రెండ్ చేస్తున్నారు.
అంగద్ బ్యాటర్ అవుతాడేమో?
ఈ అందమైన ప్రపంచంలోకి అంగద్‌కు స్వాగతం అంటూ వెల్కమ్ చెబుతూ బెస్ట్ విషెస్ అందజేస్తున్నారు. ఇక మరికొంత మందైతే.. ఓ అడుగు ముందుకేసి చిన్నారి భవిష్యత్ గురించి జోస్యం చెబుతూ.. ‘‘అంగద్ తండ్రిలా బౌలర్ కాకుండా.. బ్యాటర్ అవుతాడు’’ అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇప్పుడే పుట్టిన ఫ్యూచర్‌పై ఇలాంటి కామెంట్లు అవసరమా అని మరికొందరు విమర్శిస్తున్నారు.
కొడుకును చూసుకునేందుకు స్వదేశానికి
కాగా బుమ్రా ప్రస్తుతం ఆసియా కప్-2023 టోర్నీతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఐర్లాండ్ పర్యటనలో కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన ఈ స్పీడ్‌స్టర్.. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం శ్రీలంకకు వెళ్లాడు.
అయితే, భార్య ప్రసవం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వచ్చిన బుమ్రా.. మళ్లీ సూపర్-4 మ్యాచ్‌ల కోసం అక్కడికి వెళ్లనున్నాడు. దీంతో నేపాల్‌తో సోమవారం నాటి మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. కాగా 29 ఏళ్ల బుమ్రా 2021లో సంజనా గణేశన్‌ను వివాహమాడాడు.
చదవండి: WC 2023: తిలక్ వర్మను ఎందుకు ఎంపిక చేసినట్లు? అతడు అవసరమా?
Indian Star Pacer Jasprit Bumrah And His Wife Sanjana Ganesan has been blessed by Baby boy. They named him as "Angad".
I guess Next bumrah is a batter for sure!😉
Congratulations @Jaspritbumrah93 ❤️ pic.twitter.com/uDwQ0zdZVr— ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) September 4, 2023
Angad Jasprit Bumrah cheering for his father in future matches pic.twitter.com/RYmgQPmuUe
— ✰ (@insane_birdie) September 4, 2023