సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం(మే 28న) ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిపోవాలి. కానీ వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్‌డేకు వాయిదా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మధ్యాహ్నం నుంచి ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కనీసం టాస్ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. రాత్రి 11 దాటినా వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక ఫైనల్ మ్యాచ్ వాయిదా పడడం ఇదే తొలిసారి. వర్షం కారణంగా పలు సీజన్లలో మ్యాచ్‌లు రద్దు కావడం లేదా ఓవర్లు కుదించి ఆడడం జరిగింది. కానీ గత 15 సీజన్లలో ఏ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడింది లేదు.. రిజర్వ్ డేకు వాయిదా పడింది లేదు.
ఇక ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. ఫైనల్మ్యాచ్ చూద్దామని వచ్చిన అభిమానులకు వరుణుడి కారణంగా తీవ్ర నిరాశే మిగిలింది. రాత్రి 9 గంటల తర్వాత అభిమానులు ఒక్కొక్కరిగా స్టేడియం నుంచి వెళ్లిపోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May - 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad.
Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD— IndianPremierLeague (@IPL) May 28, 2023
Fans leave the Narendra Modi Stadium.
A sad end to what could have been an amazing Sunday. #IPLFinals to be played tomorrow it seems. #Ahmedabad #IPL2023Final #CskvsGttickets #MSDhoni𓃵 #rain pic.twitter.com/vGlfVQzBb9— 7 & 18 & 45 (@Tamil_paiyan_01) May 28, 2023
చదవండి: #IPL2023Final: డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారిపై మహిళ దౌర్జన్యం