Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

‘పింక్‌ బాల్‌’తో అంత ఈజీ కాదు.. నాకిదే ‘తొలి’ టెస్టు: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 5, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kl.jpg

‘పింక్‌ బాల్‌’తో మ్యాచ్‌ అంత ఈజీ కాదంటున్నాడు టీమిండియా బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌. క్రీజులోకి వెళ్లిన తర్వాతే దాని సంగతేమిటో పూర్తిగా అర్థమవుతుందని పేర్కొన్నాడు. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ ఆడనుంది. 

అయితే, ప్రస్తుతం భారత జట్టులో ఎనిమిది మందికి మాత్రమే డే అండ్‌ నైట్‌(పింక్‌ బాల్‌) టెస్టు ఆడిన అనుభవం ఉంది. అందులోనూ విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌ మాత్రమే ఆస్ట్రేలియా గడ్డపై పింక్‌ బాల్‌తో ఆడారు.

ఇక కేఎల్‌ రాహుల్‌కు ఇదే తొలి ‘పింక్‌ బాల్‌ టెస్టు’ మ్యాచ్‌ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎర్ర బంతికి, గులాబీ మధ్య తేడా తనకు స్పష్టంగా కనిపిస్తోందని... డే అండ్‌ నైట్‌ టెస్టులో ‘పింక్‌ బాల్‌’ను ఎదుర్కోవడం అంత సులువు కాదని రాహుల్‌ వ్యాఖ్యానించాడు. 

నాకు ఇది కొత్త అనుభవం
‘బౌలర్‌ చేతినుంచి బంతి విడుదలయ్యే సమయంలో దానిని గుర్తించడం కష్టంగా ఉంది. ఎర్ర  బంతితో పోలిస్తే చాలా గట్టిగా ఉండటంతో పాటు వేగంగా కూడా దూసుకొస్తోంది. ఫీల్డింగ్‌లో క్యాచ్‌ పట్టే సమయంలో కూడా తేడా స్పష్టంగా కనిపిస్తోంది. 

స్వింగ్‌ కూడా భిన్నంగా అవుతోంది కాబట్టి అదే మాకు పెద్ద సవాల్‌ కానుంది. నాకు ఇది కొత్త అనుభవం. క్రీజ్‌లోకి వెళ్లాకే దాని సంగతేమిటో చూస్తాను. ఎలాంటి స్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని రాహుల్‌ చెప్పాడు.

అయితే ప్రాక్టీస్‌ ద్వారా అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నామని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ‘గులాబీ బంతి ఎలా స్పందిస్తోందో, ఆడటం ఎంత కష్టమో తెలుసుకునేందుకే మాకు కొంత సమయం పట్టింది. బౌలర్‌ చేతి నుంచి వచ్చే బంతిని గుర్తించడమే తొలి అడుగు. 

అప్పుడే సరైన షాట్‌ ఆడేందుకు తగిన అవకాశం ఉంటుంది. అందుకే మేమంతా ఎక్కువ బంతులను ఎదుర్కొనేందుకు ప్రయత్నించాం’ అని రాహుల్‌ వెల్లడించాడు. కాగా రెండో టెస్టు కోసం సన్నద్ధమయ్యే క్రమంలో భారత జట్టు ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవన్‌తో వన్డే ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడింది. ఆ తర్వాత పింక్‌ బాల్‌ టెస్టుకు వేదికైన అడిలైడ్‌ చేరుకున్న టీమ్‌ రెండు ప్రాక్టీస్‌ సెషన్లలో పాల్గొంది.

ఓపెనర్‌గా ఆడిస్తారా?
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్‌ రాహుల్‌ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అయితే రెండో టెస్టు కోసం రోహిత్‌ శర్మ అందుబాటులోకి రావడంతో అతని ఓపెనింగ్‌ స్థానంపై సందిగ్ధత నెలకొంది. అతను ఓపెనర్‌గా కొనసాగాలా లేక మిడిలార్డర్‌లో ఆడాలా అనేదానిపై చర్చ మొదలైంది. దీనిపై రాహుల్‌ స్పందించాడు. 

బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ అంశంపై అతడు మాట్లాడాడు. ‘అడిలైడ్‌ టెస్టులో నా బ్యాటింగ్‌ స్థానం ఏమిటనేది నాకు ఇప్పటికే చెప్పేశారు. అయితే మ్యాచ్‌ జరిగే వరకు దాని గురించి మాట్లాడవద్దని కూడా చెప్పారు. నేను దేనికైనా సిద్ధమే. ఏ స్థానమైనా తుది జట్టులో ఉండటమే నాకు అన్నింటికంటే ముఖ్యం. అవకాశం రాగానే బరిలోకి దిగి జట్టు కోసం ఆడటమే ప్రధానం. నేను వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌ చేశాను.

ఆరంభంలో తొలి 20–25 బంతులు కొంత ఇబ్బందిగా అనేపించేవి. డిఫెన్స్‌ ఆడాలా లేక అటాక్‌ చేయాలనే అని సందేహ పడేవాడిని. అయితే ఇన్నేళ్ల అనుభవం తర్వాత నా ఇన్నింగ్స్‌ను ఎలా నడిపించాలో స్పష్టత వచి్చంది. తొలి 30–40 బంతులు సమర్థంగా ఎదుర్కోగలిగితే అది ఓపెనింగ్‌ అయినా మిడిలార్డర్‌ అయినా అంతా ఒకేలా అనిపిస్తుంది. దానిపైనే నేను దృష్టి పెడతా’ అని రాహుల్‌ వెల్లడించాడు.  

ముందే చెప్పారు
ఇక టెస్టు సిరీస్‌లో ఓపెనింగ్‌ చేయాల్సి రావచ్చని తనకు ఆస్ట్రేలియా బయల్దేరడానికి ముందే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చెప్పిందని... అందుకే అన్ని రకాలుగా సన్నద్ధమయ్యానని రాహుల్‌ చెప్పాడు. సరిగ్గా పదేళ్ల క్రితం రాహుల్‌ ఇదే ఆ‍స్ట్రేలియా గడ్డపై టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 

ఈ పదేళ్ల కెరీర్‌లో అతను 54 టెస్టులు ఆడాడు. ఈ క్రమంలో పలు గాయాలను అధిగమించిన అతడు... మానసికంగా కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ‘పదేళ్లు కాదు...25 ఏళ్లు గడిచినట్లుగా అనిపిస్తోంది. ఇన్నేళ్లలో నాకు ఎదురైన గాయాలు, ఆటకు దూరమైన రోజులు అలా అనిపించేలా చేస్తున్నాయి. అయితే ఈ దశాబ్దపు కెరీర్‌ను ఆస్వాదించాననేది వాస్తవం. 

వచ్చే పదేళ్ల కెరీర్‌ కోసం ఎదురు చూస్తున్నా
చిన్నప్పుడు నాన్నతో కలిసి ఉదయమే టీవీలో టెస్టులు చూసిన రోజులను దాటి అదే ఆసీస్‌ గడ్డపై తొలి టెస్టు ఆడే సమయంలో ఎంతో భావోద్వేగానికి లోనయ్యా. ఆ సమయంలో నా బ్యాటింగ్, చేయాల్సిన పరుగుల గురించి ఆలోచనే రాలేదు. 

కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. గుర్తుంచుకునే క్షణాలతో పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నా. ఇన్నేళ్లలో ఏ స్థానంలో అయిన ఆడగలిగేలా మానసికంగా దృఢంగా తయారయ్యా. వచ్చే పదేళ్ల కెరీర్‌ కోసం ఎదురు చూస్తున్నా’ అని రాహుల్‌ వివరించాడు.

చదవండి: టీ20 క్రికెట్‌లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్‌ పాండ్యా లేకుండానే!

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
india vs australia
test series
pink ball test
KL Rahul
Virat Kohli
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సెంచ‌రీ హీరోకు నో ఛాన్స్‌

భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సెంచ‌రీ హీరోకు నో ఛాన్స్‌

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో'

'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో'

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.