Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

రాకాసి బౌన్సర్‌ వేసిన ఆసీస్‌ బౌలర్‌.. ఇచ్చిపడేసిన జైస్వాల్‌! ఆఖరికి..

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 2, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
jaiswal.jpg

ఆస్ట్రేలియా ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఎలెవన్‌(Prime Ministers XI)తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ మెరుగైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. తద్వారా భారత ఇన్నింగ్స్‌లో రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. పీఎం ఎలెవన్‌తో మ్యాచ్‌ సందర్భంగా జైస్వాల్‌కు కోపమొచ్చింది.

తనను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించిన ఆసీస్‌ పేసర్‌ జాక్‌ నిస్బెట్‌(Jack Nisbet)కు బ్యాట్‌తో పాటు.. నోటితోనూ గట్టిగానే సమాధానమిచ్చాడు. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు.. డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు ఆడనుంది.

తొలిరోజు ఆట టాస్‌ పడకుంగానే 
అయితే, పింక్‌ బాల్‌తో నిర్వహించే ఈ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో.. ఆసీస్‌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఎలెవన్‌తో గులాబీ బంతితో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడింది. రెండురోజుల పాటు జరగాల్సిన ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా శనివారం నాటి తొలిరోజు ఆట టాస్‌ పడకుంగానే ముగిసిపోగా.. రెండో రోజు సవ్యంగా సాగింది. అయితే, ఈ మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించారు.

కాన్‌స్టాస్‌ శతకం
కాన్‌బెర్రా వేదికగా ఆదివారం టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పీఎం ఎలెవన్‌ జట్టు ఓపెనర్‌ సామ్‌ కాన్‌స్టాస్‌ శతకం(107)తో చెలరేగగా.. మిగతా వాళ్లలో హనో జాకబ్స్‌(61), జాక్‌ క్లేటన్‌(40) మెరుగ్గా రాణించారు. మిగతా వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పీఎం జట్టు 43.2 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

భారత బౌలర్లలో పేసర్లు హర్షిత్‌ రాణా నాలుగు వికెట్లు కూల్చగా.. ఆకాశ్‌ దీప్‌ రెండు, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. స్పిన్నర్లలో వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజకు తలా ఒక వికెట్‌ దక్కింది.

 42.5 ఓవర్లలోనే ఛేదించినా
ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ శుభారంభం అందించగా.. కేఎల్‌ రాహుల్‌(27 రిటైర్డ్‌ హర్ట్‌), శుబ్‌మన్‌ గిల్‌(50- రిటైర్డ్‌ హర్ట్‌) రాణించారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(3) మాత్రం విఫలం కాగా.. నితీశ్‌ రెడ్డి(42), వాషింగ్టన్‌ సుందర్‌(42 నాటౌట్‌) అదరగొట్టారు. 

మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా(27) ఫర్వాలేదనిపించగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌(1) పూర్తిగా విఫలమయ్యాడు. దేవ్‌పడిక్కల్‌ నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నిజానికి రోహిత్‌ సేన 42.5 ఓవర్లలోనే 241 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించినా... ప్రాక్టీస్‌ కోసం పూర్తి ఓవర్లు ఆడటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌ను పీఎం ఎలెవన్‌ పేసర్‌ జాక్‌ నిస్బెట్‌ వేశాడు. అతడి బౌలింగ్‌లో తొలి రెండు బంతులను యశస్వి జైస్వాల్‌ బౌండరీకి తరలించగా.. నిస్బెట్‌ జైస్వాల్‌ను చూస్తూ ఏదో అన్నాడు. 

వెనక్కి వెళ్లు..
ఇందుకు బదులుగా.. ‘‘వెనక్కి వెళ్లు.. వెళ్లి బౌలింగ్ చెయ్‌’’ అని జైస్వాల్‌ కౌంటర్‌ ఇచ్చాడు. దీంతో చిరునవ్వుతోనే వెనక్కి వెళ్లిన నిస్బెట్‌ ఆఖరి వరకు రాకాసి బౌన్సర్లతో జైస్వాల్‌ను తిప్పలు పెట్టాడు.

దీంతో ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఆఖరి వరకు తగ్గేదేలే అన్నట్లు తలపడ్డారు. ఇక నిస్బెట్‌ ఓవర్లో జైస్వాల్‌ ఎనిమిది పరుగులు రాబట్టగా.. అతడు మాత్రం వికెట్‌లెస్‌గా వెనుదిరిగాడు. జైస్వాల్‌ను అవుట్‌ చేయాలన్న అతడి కల నెరవేరలేదు. 

అంతే కాదు మ్యాచ్‌ మొత్తంలో ఆరు ఓవర్లు వేసిన 21 ఏళ్ల నిస్బెట్‌ 32 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అయితే, ఎనిమిదో ఓవర్లో మరోసారి బరిలోకి దిగిన నిస్బెట్‌ జైస్వాల్‌ను పరుగులు రాబట్టకుండా అడ్డుకోగలిగాడు.

చదవండి: బీసీసీఐ మ్యాచ్‌.. 10కి 10 వికెట్లు సాధించిన 18 ఏళ్ల యువ కెరటం
 

Yashasvi Jaiswal took it up to Jack Nisbet in Canberra but the fiery NSW quick wasn't backing down! 👀 #PMXIvIND pic.twitter.com/tX3O86wEv2

— cricket.com.au (@cricketcomau) December 1, 2024

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Yashasvi Jaiswal
india vs australia
test series
rohit sharma
Canberra
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

ఘనంగా ముగించారు

ఘనంగా ముగించారు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.