Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

మా అన్నను ఆడించేందుకు.. నాపై వేటు వేశారు: భారత మాజీ క్రికెటర్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 25, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
1245.jpg

సీకే నాయుడు- సీఎస్‌ నాయుడు, క్రిపాల్‌ సింగ్‌- ఏజీ మిల్కా సింగ్‌, సుభాష్‌- బాలూ గుప్తే, అమర్‌ సింగ్‌- లధా రామ్‌జీ, మాధవ్‌- అరవింద్‌ ఆప్టే, మోహిందర్‌- సురీందర్‌ అమర్‌నాథ్‌, వజీర్‌ అలీ- నజీర్‌ అలీ, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అన్నదమ్ముల జోడీలు ఇవి.

ప్రస్తుతం ఆక్టివ్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యా- కృనాల్‌ పాండ్యా (Hardik Pandya- Krunal Pandya)లతో పాటు మాజీ ఆటగాళ్లు పఠాన్‌ బ్రదర్స్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అన్న యూసఫ్‌ పఠాన్‌ (Yousuf Pathan) బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ అయితే.. తమ్ముడు ఇర్ఫాన్‌ పఠాన్‌ (Irfan Pathan) బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. అన్న కంటే ముందు తమ్ముడే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అయితే, ఎవరికి వారు తమదైన శైలిలో దూసుకుపోయి గుర్తింపు సాధించారు.

ఇక వీరిద్దరు మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన, 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యులు కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఒకానొక సందర్భంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అన్న యూసఫ్‌ సేవలు వినియోగించుకునే క్రమంలో టీమిండియా యాజమాన్యం తమ్ముడు ఇర్ఫాన్‌ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టిందట.

కోచ్‌ నాతో ఇదే అన్నాడు
ఈ విషయాన్ని ఇర్ఫాన్‌ పఠాన్‌ తాజాగా వెల్లడించాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా తాను అద్భుత ప్రదర్శన కనబరిచినా.. తదుపరి న్యూజిలాండ్‌ టూర్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశాన్ని మేనేజ్‌మెంట్‌ ఇవ్వలేదని తెలిపాడు. యూసఫ్‌ కోసం తనను తప్పించామని నాటి కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ స్వయంగా తనతో అన్నట్లు తెలిపాడు.



మా అన్నను ఆడించేందుకు.. నాపై వేటు వేశారు
ఈ మేరకు సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాలో నా స్థానాన్ని నా సోదరుడు తీసుకున్నాడు. 2009లో శ్రీలంకతో మ్యాచ్‌లో మేమిద్దరం కలిసి ఆడి.. గెలిచాం. రెండు మ్యాచ్‌లలో కలిపి నేను నాలుగు వికెట్లు తీశాను.

జట్టులో నా చోటు పదిలమైందని అనుకున్నాను. కానీ న్యూజిలాండ్‌తో నాకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత జట్టు నుంచి తప్పించారు.

అప్పుడు గ్యారీ కిర్‌స్టన్‌.. ‘సారీ.. నీకు జట్టులో చోటు లేదు.. ఎందుకంటే.. ఏడో స్థానంలో ఆడేందుకు మేము మీ సోదరుడి పేరును పరగణనలోకి తీసుకున్నాం’ అని చెప్పాడు’’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ చెప్పుకొచ్చాడు. జట్టు కూర్పు కోసం ఎవరిపై ఎప్పుడు ఎందుకు వేటు వేస్తారో తెలియని పరిస్థితి ఉంటుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌ నేపథ్యంలో చర్చ సందర్భంగా ఇర్ఫాన్‌ ఈ విషయాన్ని వెల్లండించాడు.

బ్రదర్స్‌ అదుర్స్‌
కాగా గుజరాత్‌కు చెందిన 40 ఏళ్ల ఇర్ఫాన్‌ పఠాన్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. 2003- 2012 వరకు టీమిండియాకు ఆడిన ఈ లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ మీడియం బౌలర్‌.. 29 టెస్టుల్లో 100, 120 వన్డేల్లో 173, 24 టీ20 మ్యాచ్‌లలో 28 వికెట్లు కూల్చాడు.

అదే విధంగా.. ఎడమచేతి వాటం గల ఇర్ఫాన్‌ పఠాన్‌ టెస్టుల్లో 1105, వన్డేల్లో 1544, టీ20లలో 127 పరుగులు సాధించాడు. మరోవైపు.. 42 ఏళ్ల యూసఫ్‌ పఠాన్‌ 2007- 2012 మధ్య కాలంలో 57 వన్డేల్లో 810, 22 టీ20లలో 236 పరుగులు చేశాడు. ఈ రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ ఖాతాలో 33 వన్డే వికెట్లు, 13 టీ20 వికెట్లు ఉన్నాయి.

చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్‌ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్‌

𝘒𝘢𝘩𝘢𝘯𝘪 𝘣𝘩𝘢𝘪𝘺𝘰 𝘬𝘪...𝘗𝘢𝘵𝘩𝘢𝘯 𝘬𝘪 𝘻𝘶𝘣𝘢𝘯𝘪! 😊#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @IrfanPathan @rpsingh @Vimalwa pic.twitter.com/AkdeeMzz67

— Sony Sports Network (@SonySportsNetwk) June 24, 2025

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
team india
Irfan Pathan
Yousuf Pathan
India vs Sri lanka
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.