Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

CT 2025: కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌లకు దక్కని చోటు.. కెప్టెన్‌గా అతడు!

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 13, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ct202533.jpg

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ ఆథర్టన్‌ తన.. ‘ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’ను ప్రకటించాడు. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురికి మాత్రమే స్థానమిచ్చిన అతడు.. కేఎల్‌ రాహుల్‌ను విస్మరించాడు. అంతేకాదు శ్రేయస్‌ అయ్యర్‌ను కూడా పక్కనపెట్టాడు.

ఇక ఓపెనింగ్‌ జోడీగా అఫ్గనిస్తాన్‌ యువ స్టార్‌ ఇ‍బ్రహీం జద్రాన్‌(Ibrahim Zadran), న్యూజిలాండ్‌ యంగ్‌స్టర్‌ రచిన్‌ రవీంద్ర(Rachin Ravindra)లను మైఖేల్‌ ఆథర్టన్‌ ఎంచుకున్నాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు జోష్‌ ఇంగ్లిస్‌ను ఎంపిక చేసుకున్న ఈ మాజీ సారథి.. కెప్టెన్‌గా కివీస్‌ నాయకుడు మిచెల్‌ సాంట్నర్‌కు స్థానమిచ్చాడు.

అత్యుత్తమ ఇన్నింగ్స్‌ అతడిదే
ఇక గ్రూప్‌ దశలోనే తమ జట్టు నిష్క్రమించినప్పటికీ జో రూట్‌కు ఈ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్లో ఆథర్టన్‌ చోటు కట్టబెట్టాడు. ఇంగ్లండ్‌ నుంచి ఒకే ఒక్క ఆటగాడిగా రూట్‌కు ఈ మాజీ బ్యాటర్‌ స్థానం ఇచ్చాడు. తన జట్టు ఎంపిక గురించి మైఖేల్‌ ఆథర్టన్‌ స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీలో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌  జద్రాన్‌ బ్యాటింగ్‌ నుంచి వచ్చింది.

అందుకే రచిన్‌ రవీంద్రతో పాటు ఓపెనింగ్‌ జోడీగా జద్రాన్‌ను ఎంచుకున్నా. ఇక వన్‌డౌన్‌లో విరాట్‌ కోహ్లి, రూట్‌ నాలుగో స్థానంలో ఉండాలి. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా నా ఓటు జోష్‌ ఇంగ్లిస్‌కే. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతడు అద్భుత నైపుణ్యాలు కనబరిచాడు.

సారథి అతడే
ఇక ఆరోస్థానంలో ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌కు నేను స్థానం ఇస్తాను. అతడు బ్యాట్‌తో బాల్‌తో రాణించగలడు. అతడు జట్టులో ఉంటే సమతూకంగా ఉంటుంది. ఇక నా ఏడో ప్లేయర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌. మిచెల్‌ సాంట్నర్‌ను నా జట్టుకు కెప్టెన్‌గా ఎంచుకుంటాను. 

ఇద్దరు సీమర్లు మహ్మద్‌ షమీ, మ్యాట్‌ హెన్రీలకు చోటిస్తా. సాంట్నర్‌తో పాటు మరో స్పిన్నర్‌గా వరుణ్‌ చక్రవర్తిని ఎంచుకుంటా’’ అని మైఖేల్‌ ఆథర్టన్‌ వెల్లడించాడు.

కాగా పాకిస్తాన్‌ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్‌ ట్రోఫీ మార్చి 9న దుబాయ్‌లో ముగిసింది. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా అవతరించింది. ఈ వన్డే టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. 

ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్‌ ఆడగా.. వన్డే ప్రపంచకప్‌-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌ ఆడాయి.

రాహుల్‌,శ్రేయస్‌ అదరగొట్టారు
ఇక ఈ మెగా టోర్నీలో అఫ్గన్‌ ఓపెనర్‌ జద్రాన్‌ ఇంగ్లండ్‌పై వీరోచిత శతకం బాదాడు. 117 పరుగులు సాధించి టోర్నీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. మరోవైపు.. రచిన్‌ రెండు శతకాల సాయంతో 263 పరుగులతో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. కోహ్లి పాకిస్తాన్‌పై అజేయ శతకం చేయగా.. షమీ బంగ్లాదేశ్‌పై, వరుణ్‌ న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. 

అయితే, టీమిండియా మిడిలార్డర్‌లో దిగి కీలక ఇన్నింగ్స్‌ ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌(243 రన్స్‌), కేఎల్‌ రాహుల్‌(140 రన్స్‌)లకు మాత్రం ఆథర్టన్‌ చోటివ్వకపోవడం గమనార్హం. కాగా ఇంగ్లండ్‌ తరఫున ఆథర్టన్‌ 115 టెస్టులు, 54 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.

మైఖేల్‌ ఆథర్టన్‌ ఎంచుకున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ -2025 టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌:
ఇబ్రహీం జద్రాన్‌, రచిన్‌ రవీంద్ర, విరాట్‌ కోహ్లి, జో రూట్‌, జోష్‌ ఇంగ్లిస్‌(వికెట్‌ కీపర్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ సాంట్నర్‌(కెప్టెన్‌), మ్యాట్‌ హెన్రీ, మహ్మద్‌ షమీ, వరుణ్‌ చక్రవర్తి.

చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
ICC Champions Trophy 2025
KL Rahul
Shreyas Iyer
Ibrahim Zadran
Mitchell Santner
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

శ్రేయస్‌ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి

శ్రేయస్‌ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో'

'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో'

IND vs AFG: కేఎల్‌ రాహుల్‌ను పక్కనపెట్టారా?

IND vs AFG: కేఎల్‌ రాహుల్‌ను పక్కనపెట్టారా?

ఢిల్లీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌..! రీ ఎంట్రీ ఇవ్వనున్న పంత్‌?

ఢిల్లీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌..! రీ ఎంట్రీ ఇవ్వనున్న పంత్‌?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.