Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

భారత్‌ x ఆస్ట్రేలియా

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 19, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
india.jpg

నేడు తొలి వన్డే 

గిల్‌ కెప్టెన్సీలో తొలి సిరీస్‌ 

రోహిత్, కోహ్లిలపై అందరి దృష్టి  

ఉ.గం.9.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం

ఆసియా కప్‌ టి20ల్లో అజేయంగా ట్రోఫీ గెలుపు, అంతకు ముందు ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అద్భుత ప్రదర్శన...ఇప్పుడు కొంత విరామానంతరం భారత జట్టు మూడో ఫార్మాట్‌లో పెద్ద టీమ్‌తో సమరానికి సిద్ధమైంది. ఈ సారి ఎదురుగా ఉంది వన్డే ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియా. ఆసీస్‌ గడ్డపైనే జరిగే ఈ మూడు వన్డేల పోరులో పైచేయి సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 

కొత్త కెప్టెన్‌ గిల్‌ నేతృత్వంలో ఈ సమరానికి భారత్‌ సిద్ధం కాగా... ఈ ఫార్మాట్‌లో ఆల్‌టైమ్‌ అత్యుత్తమ ఆటగాళ్లలో ఇద్దరైన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మల ఆటపైనే అందరి దృష్టీ నిలిచింది. మరో వైపు పలువురు కీలక ఆటగాళ్లు దూరమైనా...ఆసీస్‌ తమ స్వదేశంలో పటిష్టమైన బలగంతోనే బరిలోకి దిగుతోంది. 

పెర్త్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచిన దాదాపు ఏడు నెలల తర్వాత భారత జట్టు వన్డేల్లో బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మధ్య నేడు (ఆదివారం) తొలి మ్యాచ్‌ జరుగుతుంది. ఇరు జట్లు చివరిసారిగా తలపడిన వన్డేలో (చాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్‌) భారత్‌ 4 వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియాకు సంబంధించి కెప్టెన్ గా శుబ్‌మన్‌ గిల్‌ రావడం ప్రధాన మార్పు కాగా...గాయంతో ప్యాట్‌ కమిన్స్‌ తప్పుకోవడంతో మిచెల్‌ మార్ష్ ఆసీస్‌ సారథిగా బాధ్యతలు చేపట్టాడు.  

ఆటగాళ్లంతా ఫామ్‌లో... 
చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ 2027 వరల్డ్‌ కప్‌ జట్టు విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకున్నా...దానికి చాలా సమయం ఉందని కోచ్‌ గంభీర్‌ చెబుతున్నా వాస్తవ పరిస్థితి ఏమిటో సగటు క్రికెట్‌ అభిమానులందరికీ తెలుసు. ఈ సిరీస్‌ గెలిచినా గెలవకపోయినా స్టార్‌ బ్యాటర్లు కోహ్లి, రోహిత్‌ ఎలా ఆడతారనేదే అన్నింటికంటే ముఖ్యం. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇంతకంటే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొన్న సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నా...ఇలాంటి అనుభవం పూర్తిగా భిన్నం. 

వీరిద్దరు పరస్పర కెప్టెన్సీలో కాకుండా మరో సారథి (ధోని) నాయకత్వంలో ఆడి తొమ్మిదేళ్లయింది. ఇప్పుడు ఎంతో జూనియర్‌ అయిన గిల్‌ కెప్టెన్సీలో ఆడటంతో పాటు కచ్చితంగా రాణించాల్సిన స్థితిలో వీరిద్దరు ఉన్నారు. ఆట, అనుభవం విషయంలో కొత్తగా చెప్పాల్సింది లేకపోయినా, ఇక్కడా బాగా ఆడాలని అంతా కోరుకుంటున్నారు. ఇతర బ్యాటర్లలో గిల్, శ్రేయస్, రాహుల్‌ కీలకం కానున్నారు. వన్డే టీమ్‌లోనూ జట్టులో పలువురు ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. 

అక్షర్, వాషింగ్టన్‌ సుందర్‌ రూపంలో ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లతో పాటు ఆంధ్ర ఆటగాడు నితీశ్‌ రెడ్డి బరిలోకి దిగడం కూడా ఖాయం. రెగ్యులర్‌ స్పిన్నర్‌గా కుల్దీప్‌ ఆడతాడు. బుమ్రా వన్డే సిరీస్‌కు లేకపోవడంతో ప్రధాన పేసర్‌గా సిరాజ్‌ బాధ్యతలు తీసుకోనుండగా, ఆసీస్‌ పరిస్థితులను బట్టి చూస్తే రెండో పేసర్‌గా ప్రసిధ్‌ లేదా అర్ష్ దీప్‌ లలో ఒకరికి చాన్స్‌ దక్కుతుంది. మొత్తంగా జట్టు అన్ని విధాలా పటిష్టంగా కనిపిస్తోంది.  

కొత్త ఆటగాళ్లతో... 
వేర్వేరు కారణాలతో పలువురు ఆస్ట్రేలియా రెగ్యులర్‌ వన్డే ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెన్‌షా, ఒవెన్‌ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. ఆసీస్‌ టాప్‌ పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్‌తో పాటు కమిన్స్‌ గైర్హాజరు ఎలిస్‌కు అవకాశం ఇస్తోంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు హెడ్, మార్ష్తమ దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ప్రభావితం చేయగలరు. మిగతా ప్రధాన బ్యాటర్లకు పెద్దగా అనుభవం లేకపోయినా సొంతగడ్డ అనుకూలత వారికి బలం కానుంది.

పిచ్, వాతావరణం 
ఆప్టస్‌ స్టేడియం బ్యాటింగ్‌కు పెద్దగా అనుకూలించే మైదానం కాదు. బౌలర్లే ప్రభావం చూపిస్తారు. గత ఆరేళ్లలో మూడు వన్డేలే జరగ్గా, అన్నింటిలో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. ఆసీస్‌ ఇక్కడ ఆడిన మూడూ ఓడింది. మ్యాచ్‌కు స్వల్ప వర్ష సూచన ఉంది.  

తుది జట్లు (అంచనా) 
భారత్‌: గిల్‌ (కెప్టెన్‌), రోహిత్, కోహ్లి, శ్రేయస్, అక్షర్, రాహుల్, నితీశ్, సుందర్, కుల్దీప్, సిరాజ్,ప్రసిధ్‌/ అర్ష్ దీప్‌. 
ఆ్రస్టేలియా: మార్ష్(కెప్టెన్‌), హెడ్, షార్ట్, రెన్‌షా, ఫిలిప్, ఒవెన్, కనోలీ, స్టార్క్, ఎలిస్, కునెమన్,హాజల్‌వుడ్‌. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Indian team
first ODI
australia
Shubman Gill
Mitchell Marsh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

ఘనంగా ముగించారు

ఘనంగా ముగించారు

IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

ఆస్ట్రేలియాపై గెలుపు.. నాకౌట్‌కు యూఎస్‌ఏ

ఆస్ట్రేలియాపై గెలుపు.. నాకౌట్‌కు యూఎస్‌ఏ

మీ వల్ల గందరగోళంలో శుబ్‌మన్‌ గిల్‌: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

మీ వల్ల గందరగోళంలో శుబ్‌మన్‌ గిల్‌: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

భారత మహిళల క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ

భారత మహిళల క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.