Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

సెలక్టర్లను బాగానే విమర్శిస్తున్నావు షమీ!.. కానీ..: మాజీ క్రికెటర్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 16, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
shami.jpg

టీమిండియా సెలక్టర్లను ఉద్దేశించి సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami) చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra)స్పందించాడు. షమీ బాధలో అర్థం ఉందని.. అయితే, అందరూ నాణేనికి మరోవైపు కూడా చూడాలని అన్నాడు.

చివరగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో భాగంగా టీమిండియాకు ఆడాడు షమీ. ఈ వన్డే మెగా టోర్నీలో తొమ్మిది వికెట్లు తీసిన ఈ బెంగాల్‌ పేసర్‌ను.. ఆస్ట్రేలియాతో వన్డేలకు సెలక్టర్లు పక్కనపెట్టారు. అతడి ఫిట్‌నెస్‌ గురించి తమకు అప్‌డేట్‌ లేదంటూ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్వయంగా మీడియాతో పేర్కొన్నాడు.

అది నా పని కాదు
ఈ నేపథ్యంలో షమీ స్పందిస్తూ.. తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నానంటూ సెలక్టర్లకు కౌంటర్‌ ఇచ్చాడు. రంజీల్లో ఆడే వాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు. ‘‘ఫిట్‌నెస్‌ గురించి సమాచారం ఇవ్వడం లేదంటే అడగటం నా పని కాదు.. జాతీయ క్రికెట్‌ అకాడమీకి వెళ్లి సన్నద్ధ కావడమే నా చేతుల్లో ఉంటుంది’’ అంటూ పరోక్షంగా అగార్కర్‌ను టార్గెట్‌ చేశాడు.

సెలక్టర్లను బాగానే విమర్శిస్తున్నావు షమీ!.. కానీ
ఈ విషయంపై కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా తాజాగా స్పందిస్తూ.. ‘‘టీమిండియా సెలక్షన్‌ కమిటీ గురించి షమీ చాలా గట్టిగానే మాట్లాడుతున్నాడు. విమర్శిస్తున్నాడు. అయితే, ప్రతి విషయంలోనూ రెండు కోణాలు ఉంటాయి.

ఇరువర్గాల మాటల్ని మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కోచ్‌, కెప్టెన్‌ లేదంటే సెలక్టర్‌ ఎవరో ఒకరు షమీ వ్యాఖ్యలపై స్పందించేదాకా వేచి చూడాలి. అంతవరకు ఈ విషయంలో తప్పు ఎవరిదో నిర్ధారించలేము.

అతడి ఆవేదనలో అర్థం ఉంది
ఏదేమైనా సెలక్టర్లు షమీని పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. కాబట్టి అతడి బాధ, ఆవేదనలో అర్థం ఉంది. ఒకవేళ షమీ తన ఫిట్‌నెస్‌తో సంతృప్తి చెందినా.. సెలక్టర్లు పక్కనపెడితే అది తన దురదృష్టమే. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు. షమీ గనుక తిరిగి టీమిండియాలోకి రావాలనుకుంటే చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

చెలరేగిన షమీ
టీమిండియా పేసర్‌ షమీ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో 3 వికెట్లతో మెరిశాడు. చాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న ఈ సీనియర్‌ పేసర్‌... ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో బెంగాల్‌ తరఫున ఆకట్టుకున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 72.5 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది.

భుపెన్‌ లాల్‌వాని (128 బంతుల్లో 71; 9 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... బెంగాల్‌ బౌలర్లలో షమీ 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇషాన్‌ పొరెల్‌ 3, సూరజ్‌ సింధు జైస్వాల్‌ 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంంచిన బెంగాల్‌ బుధవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 8 పరుగులు చేసింది. 

ఇక 8/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన బెంగాల్‌.. 50 ఓవర్ల ఆట ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టాఇకి 142 పరుగులు చేసింది. ఉత్తరాఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌ కంటే ఇంకా 71 పరుగులు వెనుకబడి ఉంది.

చదవండి: వైభ‌వ్ సూర్య‌వంశీ అట్ట‌ర్ ప్లాప్‌.. టీ20 మ్యాచ్‌ అనుకున్నావా?

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Mohammed Shami
Ajit Agarkar
india vs australia
ODI series
Aakash Chopra
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌

ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌

జయహో...భారత్.. శ్రీలంకపై ఘన విజయం

జయహో...భారత్.. శ్రీలంకపై ఘన విజయం

బుమ్రా పునరాగమనం

బుమ్రా పునరాగమనం

భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

వైభవ్‌కు ఉన్న సంస్కారం మా వాళ్లకెక్కడిది?: శ్రీలంక దిగ్గజం

వైభవ్‌కు ఉన్న సంస్కారం మా వాళ్లకెక్కడిది?: శ్రీలంక దిగ్గజం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.