Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

నా భర్తది ఆత్మహత్య: ఇంగ్లండ్‌ మాజీ బ్యాటర్‌ భార్య

Sports Sakshi User Sakshi Sakshi Time Aug 12, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
eng.jpg

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రాహమ్‌ థోర్ప్‌ది సహజ మరణం కాదని అతడి భార్య అమెండా తెలిపారు. శారీరక, మానసిక సమస్యలతో పోరాడలేక బలవన్మరణానికి పాల్పడ్డాడని విచారం వ్యక్తం చేశారు. తనను ప్రేమించే, తాను ప్రేమించే భార్యాపిల్లలు ఉన్నా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒత్తిడిని అధిగమించలేకే తమకు శాశ్వతంగా దూరమైపోయాడని ఉద్వేగానికి గురయ్యారు.

కాగా 55 ఏళ్ల థోర్ప్‌ మరణవార్త ఆగష్టు 5న వెల్లడైంది.  2022లో అఫ్గానిస్తాన్‌కు హెడ్‌ కోచ్‌గా నియమితుడైన థోర్ప్‌.. అప్పటి నుంచే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ ఆ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. అయితే స్పష్టమైన వ్యాధి, ఏ రకమైన అనారోగ్యమన్న సంగతి మాత్రం వెల్లడి కాలేదు. తాజాగా... ఆయన భార్య అమెండా వ్యాఖ్యలతో థోర్ప్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం బయటకు వచ్చింది.

‘ది టైమ్స్‌’తో అమెండా మాట్లాడుతూ.. ‘‘తను మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవాడు. మేము కూడా అతడిపై ప్రేమను కురిపించేవాళ్లం. గత కొన్నాళ్లుగా అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయాడు. తనను తిరిగి మామూలు మనిషిని చేసేందుకు మేమెంతగానో ప్రయత్నించాం. కానీ తను శారీరక, మానసిక సమస్యలతో పోరాడలేక విసుగుచెందాడు.

అందుకే తనను తాను అంతం చేసుకున్నాడు. గత రెండేళ్లుగా అతడు డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో 2022లో తొలిసారి ప్రాణం తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత కాస్త తేలికపడ్డా.. మళ్లీ ఒత్తిడిలో కూరుకుపోయాడు. ఈసారి మాత్రం కోలుకోలేకపోయాడు. మెరుగైన చికిత్స అందించాం. కానీ దురదృష్టవశాత్తూ ఈసారి అతడిని కాపాడుకోలేకపోయాం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక థోర్ప్‌ కుమార్తె కిట్టీ మాట్లాడుతూ.. ‘‘జీవితాన్ని ఎంతగానో ప్రేమించిన వ్యక్తి.. కానీ ఇలా చేశారు. ఆయన అలా ఒత్తిడిలో కుంగిపోతే చూసి మా గుండె పగిలిపోయింది. నాన్న శరీరంలో వేరే ఎవరో చొరబడి ఇలా చేసారేమో అన్నంత బాధ కలుగుతోంది. నాన్న చాలా మంచివారు. ఆయన మరణవార్త తెలియగానే చాలా మంది స్పందించారు. అందుకు మాకు కాస్త సంతోషంగా అనిపించింది. ఆయనను గుర్తుపెట్టుకున్న వాళ్లందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొంది.

కాగా ఎడంచేతి బ్యాటర్‌ అయిన థోర్ప్‌ 1993 నుంచి 2005 వరకు తన కెరీర్‌ను కొనసాగించాడు. ఇంగ్లండ్‌ జట్టులో కీలకమైన మిడిలార్డర్‌ బ్యాటర్‌గా సేవలందించాడు. 100 టెస్టులు ఆడిన థోర్ప్‌ 44.66 సగటుతో 6,744 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలున్నాయి. 82 అంతర్జాతీయ వన్డేలు ఆడి 37.18 సగటుతో 2,830 పరుగులు సాధించాడు. కౌంటీ జట్టు సర్రేతో థోర్ప్‌ది సుదీర్ఘబంధం! అండర్‌–11 స్థాయిలోనే ఆ జట్టులో చేరిన థోర్ప్‌  ఏకంగా 17 ఏళ్ల పాటు సేవలందించి దాదాపు 20 వేల పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌ ముగిశాక కోచ్‌గానూ పని చేశాడు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Graham Thorpe
england
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంగ్లండ్‌కు నో చెప్పిన ఆర్సీబీ హెడ్‌ కోచ్‌

ఇంగ్లండ్‌కు నో చెప్పిన ఆర్సీబీ హెడ్‌ కోచ్‌

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటన

ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటన

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. స్టోక్స్‌ రీఎంట్రీ

ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. స్టోక్స్‌ రీఎంట్రీ

హడలెత్తించిన హెన్రీ

హడలెత్తించిన హెన్రీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.