Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

శతక్కొట్టిన పృథ్వీ షా.. నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదంటూ..

Sports Sakshi User Sakshi Sakshi Time Aug 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
prithvi.jpg

టీమిండియా ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) కాంపిటేటివ్‌ క్రికెట్‌ పునరాగమనంలో అదరగొట్టాడు. చెన్నై వేదికగా బుచ్చిబాబు ఇన్విటేషనల్‌ టోర్నమెంట్‌ అరంగేట్ర పోరులో సెంచరీ (141 బంతుల్లో 111; 15 ఫోర్లు, 1 సిక్స్‌)తో రాణించాడు. 

ఈ సందర్భంగా పృథ్వీ షా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా 2021లో టీమిండియా తరఫున చివరిగా ఆడిన ఈ ముంబై బ్యాటర్‌.. గత కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.

వేటు వేసిన ముంబై సెలక్టర్లు
క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్‌ లేమి, అధిక బరువు తదితర కారణాల వల్ల దేశవాళీ క్రికెట్‌కూ పృథ్వీ దూరమయ్యాడు. ముంబై సెలక్టర్లు కీలక మ్యాచ్‌ల నుంచి అతడిని తప్పించడంతో పృథ్వీ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. 

మరోవైపు.. ఐపీఎల్‌ మెగా వేలం-2025లో కూడా అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఒకప్పుడు సచిన్‌ టెండుల్కర్‌కు సరైన వారసుడిగా కీర్తించబడిన పృథ్వీ కెరీర్‌.. అంతే వేగంగా పతనమైంది.

ఆదరించిన మహారాష్ట్ర 
ఈ నేపథ్యంలో దేశీ క్రికెట్‌లో ముంబై నుంచి మహారాష్ట్ర (Maharashtra) జట్టుకు మారిన పృథ్వీ షా.. కొత్త ప్రయాణంలో శుభారంభం అందుకున్నాడు. బుచ్చిబాబు రెడ్‌ బాల్‌ ఈ టోర్నీలో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా... ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో ‘శత’క్కొట్టాడు. ఛత్తీస్‌గఢ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్‌ కాగా... అనంతరం మహారాష్ట్ర జట్టు 73 ఓవర్లలో 217 పరుగులు చేసింది.

ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పృథ్వీ షా సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి తోడ్పాటు లభించలేదు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (1) విఫలమయ్యాడు. వికెట్‌ కీపర్‌ సౌరభ్‌ (50 నాటౌట్‌; 5 ఫోర్లు) అండతో పృథ్వీ షా జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన చత్తీస్‌గఢ్‌ ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.

నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు
ఇక సెంచరీ చేసిన అనంతరం పృథ్వీ షా తన మనసులోని ఆవేదనను పంచుకున్నాడు. ‘‘నేను బాగున్నాను. నిజంగానే బాగున్నా. నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. మరేం పర్లేదు. ఇంతకు ముందు కూడా నాకు ఇలాగే జరిగింది.

ఎవరూ లేకపోయినా.. నా కుటుంబం నాకు మద్దతుగా ఉంది. మానసికంగా నేను కుంగిపోయినపుడు నా స్నేహితులు నాతోనే ఉన్నారు. అయితే, మరికొందరు మాత్రం తమ తమ పనులతో బిజీ అయిపోయారు. వాళ్లకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా!.. ఎవరి పని వాళ్లది.

నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ
నాకు సాయంగా రాలేదని వారిని నేను తప్పుబట్టను. ఏం చేసినా ఒంటరిగానే చేయాలి.. నన్ను నేను నిరూపించుకోవాలి అని గట్టిగా అనుకున్నాను. నిజానికి నాకు అదే మంచిది కూడా!జీవితంలో ఇప్పటికే ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. ఒకసారి ఉన్నత శిఖరాలు.. మరోసారి అధఃపాతాళం. అయినా నేను తిరిగి పుంజుకున్నాను. కాబట్టి అసాధ్యమనేది ఏదీ ఉండదని నమ్ముతాను.

నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. పనిపట్ల అంకిత భావం ఉంది. ఈ సీజన్‌లో నేను, నా జట్టు గొప్పగా రాణిస్తుందనే నమ్మకంతో ఉన్నా’’ అంటూ పృథ్వీ షా తన విమర్శకులకు కౌంటర్‌ ఇస్తూనే.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతానని పేర్కొన్నాడు.

చదవండి: అప్పుడు గిల్‌ లేడు కాబట్టే సంజూ ఓపెనర్‌.. కానీ ఇప్పుడు: అగార్కర్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Prithvi Shaw
Buchi Babu Invitation Cricket Tournament
Maharashtra
Ruturaj Gaikwad
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.