Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

ప్లేఆఫ్‌ ముంగిట ధోని ఫిట్‌నెస్‌పై హస్సీ కీలక వ్యాఖ్యలు

Sports Sakshi User Sakshi Sakshi Time May 20, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Dhoni-3.jpg

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే రెండో జట్టుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 77 పరుగుల విజయంతో 17 పాయింట్లు ఖాతాలో వేసుకున్న సీఎస్‌కే గుజరాత్‌ టైటాన్స్‌తో క్వాలిఫయర్‌-1 ఆడనుంది. కేకేఆర్‌తో మ్యాచ్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం దిశగా పయనిస్తున్నప్పటికి అనుకున్న ఓవర్లలో పూర్తి చేయకపోవడంతో రన్‌రేట్‌ సీఎస్‌కే కంటే తక్కువ ఉంది. దీంతో సీఎస్‌కే రెండో స్థానంలో నిలచి సొంత ప్రేక్షకుల మధ్య క్వాలిఫయర్‌-1 ఆడనుంది.

ఇదిలా ఉంటే ధోని ఫిట్‌నెస్‌పై సీఎస్‌కే బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ కీలక వ్యాఖ్యలు చేశాడు.  ఈ సీజన్‌ ఆరంభం నుంచి ధోని మోకాలి సమస్యతో బాధపడుతున్నాడని.. అందుకే పరుగులు తీసేందుకు ఇష్టపడడం లేదని తెలిపాడు. సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్‌ మిడ్‌ ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సమయంలో మైక్‌ హస్సీ కామెంటేటర్‌తో మాట్లాడాడు.

ధోని మోకాలి సమస్య వంద శాతం సమసిపోలేదు. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అందుకే ఎక్కువగా పరుగు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. బ్యాటింగ్‌కు కూడా ఆఖరి 2-3 ఓవర్లలో రావడానికి కారణం కూడా అదే. నొప్పిని భరిస్తూనే తన పనిని పూర్తి చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇంత బాధపెట్టుకొని కూడా అతను తన టార్గెట్‌ను మిస్‌ అవకుండా బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకొని సక్సెస్‌ అవుతున్నాడు అని చెప్పాడు.

కాగా ధోని విషయంలో హస్సీ చేసిన వ్యాఖ్యలు నిజమే. ధోని కూడా మ్యాచ్‌ల్లో చాలాసార్లు తన మోకాలికి బ్యాండేజీ లేదా ఐస్‌క్యాప్‌ పెట్టుకోవడం కనిపించింది. అంతేకాదు ధోనికి ఈ సీజన్‌ చివరిదని రూమర్లు కూడా వచ్చాయి. కానీ రూమర్లను స్వయంగా కొట్టిపారేసిన ధోని 2024 ఐపీఎల్‌ కూడా ఆడొచ్చని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.

 ఇక హస్సీ వ్యాఖ్యలు సీఎస్‌కే అభిమానులను ఆందోళనలో పడేసింది. ఒకవేళ ప్లేఆఫ్‌ సమయానికి ధోనికి మోకాలి సమస్య ఎక్కువై మ్యాచ్‌కు దూరమైతే సీఎస్‌కే పరిస్థితి ఏంటని తెగ బాధపడుతున్నారు. ''దయచేసి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని.. ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సమయంలో ధోని ఫిట్‌నెస్‌పై ఆందోళన కలిగించేలా మాట్లాడడం సరికాదని'' అభిమానులు పేర్కొన్నారు.

చదవండి: జడేజాపై సీరియస్‌ అయిన ధోని!

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
MS Dhoni
Michael Hussey
Fitness
knee injury
Batting coach
CSK
IPL 2023
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..

72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..

144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్‌, నో ట్రైనర్‌ జస్ట్..

144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్‌, నో ట్రైనర్‌ జస్ట్..

‘జీలం’ ఒడ్డున అద్భుత యోగా విన్యాసాలు

‘జీలం’ ఒడ్డున అద్భుత యోగా విన్యాసాలు

గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌!

గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌!

ఎలాంటి డైటింగ్‌ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్‌ ..

ఎలాంటి డైటింగ్‌ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్‌ ..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.