Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

1258 బంతులు.. 521 పరుగులు.. ఆ స్టయిలే వేరు!.. వారసుడు ఎవరో?

Sports Sakshi User Sakshi Sakshi Time Aug 25, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pujara_0.jpg

గంటల తరబడి క్రీజులో పాతుకుపోగల నైపుణ్యం...  సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల ఆత్మస్థయిర్యం! ఒత్తిడిని చిత్తు చేయగల దృఢ సంకల్పం... ప్రత్యర్థుల సహనాన్ని పరీక్షించగల మనోధైర్యం! ఒక్క మాటలో చెప్పాలంటే... నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం!!

క్రీజులో అడుగుపెట్టింది తడువు ఓ మహాయజ్ఞానికి పూనుకున్నట్లు... పిచ్, పరిస్థితులు, ప్రత్యర్థులు ఇలా వేటితో సంబంధం లేకుండా తన కర్తవ్యాన్ని వందకు రెండొందల శాతం నిర్వర్తించిన టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా. 

ఎన్నో మరపురాని విజయాలు
పదిహేనేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు పుజారా ఆదివారం (ఆగష్టు 24) రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ పేసర్లు బాడీలైన్‌ బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టినా... ఇంగ్లండ్‌ పిచ్‌లపై అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్‌ వంటి వాళ్లు స్వింగ్‌తో ఊరించినా... వికెట్‌ విలువ గుర్తెరిగి ప్రత్యర్థులకు టీమిండియాకు మధ్య అడ్డుగోడలా నిలిచిన పుజారా జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. 

విరాట్‌ కోహ్లి లాంటి కవర్‌ డ్రైవ్‌లు, రోహిత్‌ శర్మ లాంటి పుల్‌ షాట్‌లు, రిషబ్‌ పంత్‌ వంటి ఫాలింగ్‌ హుక్‌ షాట్‌లు ఆడగల సామర్థ్యం లేకున్నా... కేవలం తన సహనంతోనే సుదీర్ఘ కాలం జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఘనత పుజారాది.

1258 బంతులు.. 521 పరుగులు
ఫోర్లు, సిక్స్‌ల రూపంలో కొలవలేని గొప్పతనం అతడిది. సెంచరీలు, డబుల్‌ సెంచరీలు వివరించలేని ఆటతీరు అతడిది. టీ20లు రాజ్యమేలుతున్న తరుణంలోనూ సంప్రదాయ క్రికెట్‌కే పెద్దపీట వేస్తూ... సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన అతడి ఘనతలను స్ట్రయిక్‌రేట్‌తో సరితూచడం సాధ్యం కానిది.

2018–19లో ఆ్రస్టేలియా గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్‌ గెలవడం వెనక దాగిఉన్న పుజారా అకుంఠిత దీక్షను లెక్కించేందుకు కొలమానాలు లేవనడం అతిశయోక్తి కాదు. 1258 బంతులు ఎదుర్కొన్న అతడు 521 పరుగులతో సిరీస్‌ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. 

ఇక 2021 బ్రిస్బేన్‌ టెస్టులో ఆ్రస్టేలియాపై అతడు కనబర్చిన పోరాటపటిమ ముందు ఎన్ని త్రిశతకాలైన దిగదుడుపే. తొలి ఇన్నింగ్స్‌లో 94 బంతులాడిన పుజారా... రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 211 బంతులు ఎదుర్కొని 56 పరుగులు సాధించిన వైనాన్ని ఏ క్రీడాభిమాని మరవగలడు.

భర్తి చేసేదెవరో?
అతడి వికెట్‌ పడగొట్టడం సాధ్యంకాని ఆసీస్‌ పేసర్లు బాడీలైన్‌ బౌలింగ్‌తో విజృంభించినా... వెన్నుచూపకుండా వికెట్ల ముందు వీరుడిలా నిలిచిన తీరును ఏ గణాంకాలతో లెక్కించగలం! ఒకటా రెండా... జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఎన్నో సార్లు విలువైన ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించిన పుజారా ఆటకు అల్విదా చెప్పాడు. అతడి స్థానాన్ని భర్తి చేసేదెవరో చూడాలి మరి! 
 –సాక్షి క్రీడా విభాగం

చదవండి: KCL: సంజూ శాంసన్ విధ్వంసం.. 16 బంతుల్లోనే! వీడియో వైర‌ల్‌

Cheteshwar Pujara announced himself on the international stage with a gritty 159 against New Zealand in 2012.

Relive his maiden Test ton here 👇👇#ThankYouPujji | @cheteshwar1 pic.twitter.com/5bmR9VU1KQ

— BCCI (@BCCI) August 24, 2025

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Cheteshwar Pujara
india vs australia
test cricket
Test retirement
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆల్‌టైమ్ టెస్ట్ జట్టు ప్ర‌క‌ట‌న‌.. సచిన్‌ టెండూల్కర్‌కు నో ఛాన్స్‌

ఆల్‌టైమ్ టెస్ట్ జట్టు ప్ర‌క‌ట‌న‌.. సచిన్‌ టెండూల్కర్‌కు నో ఛాన్స్‌

ఫ్యాబ్‌-4: ఇద్ద‌రు పోయారు.. మ‌రో ఇద్ద‌రు మిగిలారు!

ఫ్యాబ్‌-4: ఇద్ద‌రు పోయారు.. మ‌రో ఇద్ద‌రు మిగిలారు!

ఆఫ్గాన్ చిత్తు చిత్తు.. టెస్టుల్లో భారత్ కు అతిపెద్ద విజయం

ఆఫ్గాన్ చిత్తు చిత్తు.. టెస్టుల్లో భారత్ కు అతిపెద్ద విజయం

టెస్టు క్రికెట్‌పై ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఆందోళ‌న‌.. ముంచింది మీరేగా!

టెస్టు క్రికెట్‌పై ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఆందోళ‌న‌.. ముంచింది మీరేగా!

ఇంగ్లండ్‌ బౌలర్‌ అరుదైన రికార్డు.. 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే

ఇంగ్లండ్‌ బౌలర్‌ అరుదైన రికార్డు.. 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే

అఫ్గానిస్తాన్‌కు షాక్‌.. గుడ్‌బై చెప్పనున్న ర‌షీద్ ఖాన్‌!

అఫ్గానిస్తాన్‌కు షాక్‌.. గుడ్‌బై చెప్పనున్న ర‌షీద్ ఖాన్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.