Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

గట్టెక‍్కిన అల్‌కరాజ్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 1, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ALCARAZ-33F.jpg

తొలి రౌండ్‌లోనే ఓడిన మెద్వెదెవ్, రూనె సబలెంకా శుభారంభం

మాజీ రన్నరప్‌ ఆన్స్‌ జబర్‌ నిష్క్రమణ  

‘హ్యాట్రిక్‌’ టైటిల్‌ లక్ష్యంగా వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నిలో బరిలోకి దిగిన స్పెయిన్‌ స్టార్‌ అల్‌కరాజ్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తొలి రౌండ్‌ అడ్డంకిని అలవోకగా అధిగమిస్తాడని భావించినా... ఇటలీ సీనియర్‌ ప్లేయర్‌ ఫాగ్‌నిని పోరాటపటిమ కారణంగా ఏకంగా 4 గంటల 37 నిమిషాలు చెమటోడ్చి... చివరకు ఐదు సెట్‌ల పోరులో అల్‌కరాజ్‌ గట్టెక్కాడు.  

లండన్‌: టెన్నిస్‌ సీజన్‌ మూడో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ వింబుల్డన్‌లో తొలి రోజు సంచలన  ఫలితాలు నమోదయ్యాయి. పురుషుల సింగిల్స్‌ విభాగంలో రష్యా స్టార్, తొమ్మిదో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా), ఎనిమిదో సీడ్‌ హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టగా... డిఫెండింగ్‌ చాంపియన్, రెండో సీడ్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) తొలి రౌండ్‌ను దాటేందుకు తీవ్రంగా శ్రమించాడు. ప్రపంచ 138వ ర్యాంకర్‌ ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ 7–5, 6–7 (5/7), 7–5, 2–6, 6–1తో గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 

4 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ 14 ఏస్‌లు సంధించి, 9 డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 62 అనవసర తప్పిదాలు చేసి, 52 విన్నర్స్‌ కొట్టాడు. తన సరీ్వస్‌ను ఐదుసార్లు కోల్పోయిన అల్‌కరాజ్‌... ప్రత్యర్థి సరీ్వస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో బెంజిమిన్‌ బోంజి (ఫ్రాన్స్‌) 3 గంటల 7 నిమిషాల్లో 7–6 (7/2), 3–6, 7–6 (7/3), 6–2తో మెద్వెదెవ్‌పై... నికోలస్‌ జారీ (చెక్‌ రిపబ్లిక్‌) 3 గంటల 34 నిమిషాల్లో 4–6, 4–6, 7–5, 6–3, 6–4తో హోల్గర్‌ రూనెపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. వాలెంటిన్‌ రాయర్‌ (ఫ్రాన్స్‌)తో జరిగిన మ్యాచ్‌లో 24వ సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) తొలి రెండు సెట్‌లను 3–6, 2–6తో కోల్పోయాక వెన్నునొప్పితో ఆటను కొనసాగించలేక వైదొలిగాడు.  

నిశేష్ కు నిరాశ 
కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్‌ టోర్నిలో ఆడుతున్న తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్‌ నిశేష్‌ బసవరెడ్డికి నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లో 20 ఏళ్ల నిశేష్‌ 6–7 (5/7), 3–6, 2–6తో అమెరికాకే చెందిన లెర్నర్‌ టియెన్‌ చేతిలో ఓడిపోయాడు. నిశేష్‌కు 66,000 పౌండ్లు (రూ. 77 లక్షల 56 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

కష్టపడ్డ కీస్‌ 
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ సబలెంకా (బెలారస్‌) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సబలెంకా 6–1, 7–5తో కార్సన్‌ బ్రాన్‌స్టిన్‌ (కెనడా)పై గెలిచింది. ఈ ఏడాది ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ చాంపియన్, ఆరో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) గెలిచేందుకు కష్టపడింది. 2 గంటల 41 నిమిషాల పోరులో కీస్‌ 6–7 (4/7), 7–5, 7–5తో ఎలీనా రూసె (రొమేనియా)పై నెగ్గింది. 20వ సీడ్, 2017 ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఒస్టాపెంకో (లాతి్వయా)... 2022, 2023 రన్నరప్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యూనిషియా) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. 

తొమోవా (బల్గేరియా)తో జరిగిన మ్యాచ్‌లో జబర్‌ తొలి సెట్‌ను 6–7 (5/7)తో కోల్పోయి, రెండో సెట్‌లో 0–2తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది. బ్రిటన్‌ ప్లేయర్‌ సోనె కార్టల్‌ 7–5, 2–6, 6–2తో ఒస్టాపెంకోను ఓడించి రెండో  రౌండ్‌కు చేరింది. టోర్నీ మొదటిరోజు రికార్డు స్థాయిలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో ఆటగాళ్లకు పట్టపగలే చుక్కలు కనబడ్డాయి. చాలా మంది ప్లేయర్లు మ్యాచ్‌ మధ్యలో బ్రేక్‌లు  తీసుకుంటూ... ఐస్‌ ప్యాక్‌లతో శరీరాన్ని  చల్లబర్చుకుంటూ... ఆటను కొనసాగించారు.   
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Wimbledon Grand Slam tennis tournament
Italy
Fabio Fognini
Carlos Alcaraz
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చెక్క’నైన చాక్లెట్‌

‘చెక్క’నైన చాక్లెట్‌

జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..

జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..

నో స్ట్రిక్ట్‌ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌

నో స్ట్రిక్ట్‌ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌

ఐదువేల ఏళ్ల నాటి 'మమ్మీ'లో సజీవంగా పేగు బ్యాక్టీరియా..!

ఐదువేల ఏళ్ల నాటి 'మమ్మీ'లో సజీవంగా పేగు బ్యాక్టీరియా..!

ఇటలీ గురుద్వారా వద్ద కాల్పులు.. ఇద్దరు భారతీయులు మృత్యువాత

ఇటలీ గురుద్వారా వద్ద కాల్పులు.. ఇద్దరు భారతీయులు మృత్యువాత

ఇటలీలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయుల మృతి

ఇటలీలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయుల మృతి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.