Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

కొన్‌స్టాస్‌ ఓవరాక్షన్‌.. వైల్డ్‌ ఫైర్‌లా బుమ్రా!.. నాతోనే పెట్టుకుంటావా..?

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 3, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bumrah2.jpg

టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు తొలిరోజు ఆట రసవత్తరంగా సాగింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఇరుజట్ల క్రికెటర్లు పోటీపడ్డారు. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతికి చోటు చేసుకున్న పరిణామాలు టీమిండియా అభిమానులకు మాంచి కిక్కిచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?!

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border- Gavaskar Trophy) 2024-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్‌లో బుమ్రా కెప్టెన్సీలో గెలిచిన టీమిండియా.. అనంతరం రోహిత్‌ శర్మ సారథ్యంలో అడిలైడ్‌లో ఓడిపోయి.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకుంది.

రోహిత్‌ లేకుండానే
అయితే, మెల్‌బోర్న్‌ టెస్టులో కనీసం డ్రా చేసుకునే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేక ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విఫలమైన రోహిత్‌ శర్మ(ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 31 రన్స్‌) ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah) తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.

ఇక ఆసీస్‌తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, టాపార్డర్‌ విఫలమైన కారణంగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌(10), కేఎల్‌ రాహుల్‌(4)తో పాటు శుబ్‌మన్‌ గిల్‌(20), విరాట్‌ కోహ్లి(17) నిరాశపరిచారు.

పంత్‌ పోరాటం.. బుమ్రా మెరుపులు
మిడిలార్డర్‌లో రిషభ్‌ పంత్‌(40), రవీంద్ర జడేజా(26) రాణించగా.. నితీశ్‌ రెడ్డి(0) పూర్తిగా విఫలమయ్యాడు. ఇక వాషింగ్టన్‌ సుందర్‌(14), ప్రసిద్‌ కృష్ణ(3) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. పదో స్థానంలో వచ్చిన బుమ్రా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 22 పరుగులు సాధించాడు.

185 పరుగులకు ఆలౌట్‌
ఇక బుమ్రా మెరుపుల కారణంగానే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ బౌలర్లలో స్కాట్‌ బోలాండ్‌ నాలుగు, మిచెల్‌ స్టార్క్‌ మూడు, ప్యాట్‌ కమిన్స్‌ రెండేసి వికెట్లు కూల్చగా.. నాథన్‌ లియాన్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

కొన్‌స్టాస్‌ ఓవరాక్షన్‌
ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే తమ తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు షాక్‌ తగిలింది. సిడ్నీలో శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి మూడు ఓవర్లలో వికెట్‌ నష్టానికి తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతి పడటానికి ముందు ఆసీస్‌ యువ ఓపెనర్‌ సామ్‌ కొన్‌స్టాస్‌(Sam Konstas) ఓవరాక్షన్‌ చేశాడు.


బుమ్రా బౌలింగ్‌కు వస్తున్న సమయంలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా కాస్త ఆగమన్నట్లుగా సైగ చేయగా.. బుమ్రా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. దీంతో నాన్‌- స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న కొన్‌స్టాస్‌ బుమ్రాను చూస్తూ ఏదో అనగా అతడు సీరియస్‌ అయ్యాడు. 

వైల్డ్‌ ఫైర్‌లా బుమ్రా.. ఓ రేంజ్‌లో టీమిండియా సంబరాలు
ఈ క్రమంలో కొన్‌స్టాస్‌ అతి చేస్తూ బుమ్రా వైపు రాగా.. బుమ్రా కూడా అంతే ధీటుగా బదులిచ్చాడు. దీంతో అంపైర్‌ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు. అయితే, ఈ సంఘటన జరిగిన వెంటనే తన అద్భుత బంతితో ఖవాజా(2)ను అవుట్‌ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో ఖవాజా ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ క్యాచ్‌ పట్టగానే టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. 

‘‘నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది’’ అన్నట్లుగా బుమ్రా కొన్‌స్టాస్‌ వైపునకు రాగా.. అక్కడే ఉన్న యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ కూడా కొన్‌స్టాస్‌కు కౌంటర్‌ ఇచ్చాడు. దీంతో ముఖం మాడ్చుకున్న 19 ఏళ్ల ఈ టీనేజర్‌ ఆట ముగిసిన నేపథ్యంలో నిరాశగా మైదానాన్ని వీడాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆఖరి బంతికి అద్భుతం చేశావు భయ్యా అంటూ టీమిండియా ఫ్యాన్స్‌ బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కొన్‌స్టాస్‌కు ఇలాంటి ఓవరాక్షన్‌ కొత్తేం కాదు. 

మెల్‌బోర్న్‌లో తన అరంగేట్ర టెస్టులో కోహ్లితో గొడవ పెట్టుకున్న కొన్‌స్టాస్‌కు.. బుమ్రా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈసారి తనతో నేరుగా పెట్టుకున్నందుకు.. ఆసీస్‌ను దెబ్బతీసేలా వికెట్‌తో బదులిచ్చాడు.

చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ అవుట్‌!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!

Fiery scenes in the final over at the SCG! 

How's that for a finish to Day One 👀#AUSvIND pic.twitter.com/BAAjrFKvnQ

— cricket.com.au (@cricketcomau) January 3, 2025

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Jasprit Bumrah
sam konstas
Usman Khawaja
india vs australia
sydney test
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బుమ్రా పునరాగమనం

బుమ్రా పునరాగమనం

బుమ్రాతో పోల్చడానికి సిగ్గుండాలి!

బుమ్రాతో పోల్చడానికి సిగ్గుండాలి!

T20 WC:  రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

T20 WC: రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

అతడిని ఎందుకు సెలక్ట్‌ చేయట్లేదు: గంగూలీ

అతడిని ఎందుకు సెలక్ట్‌ చేయట్లేదు: గంగూలీ

శాంస‌న్ కాదు.. అత‌డే అందుకు అర్హుడు: డివిలియర్స్‌

శాంస‌న్ కాదు.. అత‌డే అందుకు అర్హుడు: డివిలియర్స్‌

స్లో బంతుల వెనుక 16 ఏళ్ల కథ!

స్లో బంతుల వెనుక 16 ఏళ్ల కథ!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.