Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

డేవిడ్‌ మలాన్‌ ఊచకోత.. 39 బంతుల్లోనే ముగిసిన మ్యాచ్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 29, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
_2Cana_3B.jpg

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌-2025లో ఇవాళ (జనవరి 29) ఓ వన్‌ సైడెడ్‌ మ్యాచ్‌ జరిగింది. ఢాకా క్యాపిటల్స్‌పై ఫార్చూన్‌ బారిషల్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 22 ఓవర్లలో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌ 15.3 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌటైంది. 

బారిషల్‌ బౌలర్లు మొహమ్మద్‌ నబీ (4-0-9-3), తన్వీర్‌ ఇస్లామ్‌ (2-1-2-3), ఫహీమ్‌ అష్రాఫ్‌ (2.3-0-15-3) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు పోటీపడి వికెట్లు తీశారు. ముగ్గురూ తలో మూడు వికెట్లు తీశారు. జేమ్స్‌ ఫుల్లర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. లిటన్‌ దాస్‌, రోన్స్‌ఫర్డ్‌ బీటన్‌ తలో 10 పరుగులు చేయగా.. కెప్టెన్‌ తిసార పెరీరా అత్యధికంగా 15 పరుగులు సాధించాడు. క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో (11) వచ్చాయి. క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో 7 బౌండరీలు, ఓ సిక్సర్‌ మాత్రమే నమోదయ్యాయి.

మలాన్‌ ఊచకోత
74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్‌.. డేవిడ్‌ మలాన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ (16 బంతుల్లో 37 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడటంతో 6.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది (వికెట్‌ కోల్పోయి). మలాన్‌కు కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ కూడా తోడవ్వడంతో మ్యాచ్‌ తొందరగా ముగిసింది. 

తమీమ్‌ 14 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బారిషల్‌ ఇన్నింగ్స్‌లో తౌహిద్‌ హృదోయ్‌ 9 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. తౌహిద్‌ వికెట్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌కు దక్కింది. ఈ గెలుపుతో బారిషల్‌ రంగ్‌పైర్‌ రైడర్స్‌ను వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. క్యాపిటల్స్‌ 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.

కాగా, ఈ మ్యాచ్‌కు ముందు డేవిడ్‌ మలాన్‌ బీపీఎల్‌ ఫ్రాంచైజీలను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్‌ చేశాడు. మీ దగ్గర డబ్బుంటేనే ఫ్రాంచైజీలను తీసుకోండి. లేదంటే ఊరకనే ఉండండంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుత బీపీఎల్‌ సీజన్‌లో కొన్ని ఫ్రాంచైజీలు విదేశీ ఆటగాళ్లకు రెమ్యూనరేషన్‌ చెల్లించడంలో జాప్యం చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో మలాన్‌ ఈ కామెంట్స్‌ చేశాడు. కొద్ది రోజుల కిందట దర్బార్‌ రాజ్‌షాహీ ఫ్రాంచైజీకి చెందిన విదేశీ ఆటగాళ్లు మ్యాచ్‌ ఫీజులు చెల్లించని కారణంగా ఓ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేశాయి. ఆ మ్యాచ్‌లో రాజ్‌షాహీ ఫ్రాంచైజీ స్వదేశీ ఆటగాళ్లను మాత్రమే బరిలోకి దించింది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Bangladesh premier league
Dawid Malan
cricket
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 తండ్రి బాటలోనే కొడుకులు..సెహ్వాగ్ వారసులపై కాసుల వర్షం!

తండ్రి బాటలోనే కొడుకులు..సెహ్వాగ్ వారసులపై కాసుల వర్షం!

ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'

ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'

సచిన్ దరిదాపుల్లోకి కూడా వైభవ్ రాలేడు ఎందుకంటే.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు

సచిన్ దరిదాపుల్లోకి కూడా వైభవ్ రాలేడు ఎందుకంటే.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు

ఐర్లాండ్ టూర్‌కి ముందే షాకింగ్ న్యూస్..ఇద్దరికి లీగల్ నోటీసులు

ఐర్లాండ్ టూర్‌కి ముందే షాకింగ్ న్యూస్..ఇద్దరికి లీగల్ నోటీసులు

వైభ‌వ్ సూర్య‌వంశీకి బీసీసీఐ భారీ షాక్‌

వైభ‌వ్ సూర్య‌వంశీకి బీసీసీఐ భారీ షాక్‌

దోషిగా తేలిన శ్రీలంక ప్లేయర్.. మరో సీనియర్‌కు తప్పని శిక్ష..

దోషిగా తేలిన శ్రీలంక ప్లేయర్.. మరో సీనియర్‌కు తప్పని శిక్ష..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.