Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

CT 2025: అతడిని ఎలా ఎంపిక చేశారు?: వసీం అక్రం

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 3, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pak.jpg

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై బౌలింగ్‌ దిగ్గజం వసీం అక్రం(Wasim Akram) పెదవి విరిచాడు. ఒకే ఒక్క స్పెషలిస్టు స్పిన్నర్‌కు మాత్రమే చోటివ్వడాన్ని తప్పుబట్టాడు. అదే విధంగా.. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ షాహీం ఆష్రఫ్‌(Faheem Ashraf)ను ఈ మెగా టోర్నీకి ఎందుకు ఎంపిక చేశారో అర్థం కావడం లేదంటూ విమర్శించాడు.

కాగా 2017 తర్వాత తొలిసారిగా జరుగుతున్న చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఆతిథ్య జట్టు హోదాలో ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్లతో తలపడనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఈవెంట్‌ మొదలుకానుండగా.. ఇటీవలే పీసీబీ తమ జట్టును ప్రకటించింది.

అతడిని ఎలా ఎంపిక చేశారు?
ఈ నేపథ్యంలో పాక్‌ దిగ్గజ క్రికెటర్‌ వసీం అక్రం స్పందిస్తూ.. ‘‘జట్టును ప్రకటించేశారు. కొద్ది మంది పేర్లను గమనించాను. ఫాహీం అష్రఫ్‌ ఈ జట్టులో ఉన్నాడు. అతడికి ఆల్‌ ది బెస్ట్‌. ప్రతిభావంతుడైన క్రికెటరే.

కానీ గత 20 మ్యాచ్‌లలో అతడి బౌలింగ్‌ సగటు 100.. బ్యాటింగ్‌ సగటు 9. అయినా.. సరే అష్రఫ్‌ను ఎలా ఎంపిక చేశారో అర్థం కావడం లేదు. ఇక ఖుష్‌దిల్‌ షా ఎంపిక కూడా అనూహ్యం. అయినా.. ఈసారి మనం ఒకే ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నాం.

అదే టీమిండియా.. ముగ్గురు, నలుగురు స్పిన్నర్లతో సిద్ధమైంది. అందుకు కారణాలు ఏమైనా గానీ.. మనం మాత్రం ఒకే స్పిన్నర్‌ను ఎంపిక చేయడమేంటి?.. ఇక ఆతిథ్య జట్టుగా మనపై ఎలాగూ ఒత్తిడి ఉంటుంది. అన్ని ప్రతికూలతలు అధిగమించి సెమీ ఫైనల్‌ వరకైనా చేరాలని ఆశిస్తున్నా’’ అని వసీం అక్రం స్పోర్ట్స్‌ యారీతో పేర్కొన్నాడు.

ఇదైతే బాగుంది
అయితే, చాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఫఖర్‌ జమాన్‌ను పిలిపించి మంచి పనిచేశారంటూ పాక్‌ సెలక్టర్ల నిర్ణయాన్ని వసీం అక్రం సమర్థించాడు. ‘‘మనకు ఓపెనింగ్‌ జోడీతో సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రెగ్యులర్‌ ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ను జట్టులోకి తీసుకోవడం సానుకూలాంశం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు.

ఏదేమైనా బాబర్‌ ఆజంను ఓపెనర్‌గా పంపాలి. అతడి బ్యాటింగ్‌ టెక్నిక్‌ గొప్పగా ఉంటుంది. యాభై ఓవర్లపాటు అతడు క్రీజులోనే ఉంటే.. కచ్చితంగా 125 పరుగులైనా చేస్తాడు. ఇక రిజ్వాన్‌ను మిడిలార్డర్‌లో పంపాలి. జట్టులో ఉన్న ఫాస్ట్‌ బౌలర్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. నసీం షా వచ్చేశాడు. ఇప్పటికే షాహిన్‌ ఆఫ్రిది, హ్యారీస్‌ రవూఫ్‌ ఉన్నారు. వీళ్లకు తోడుగా హస్నైన్‌ కూడా ఉన్నాడు’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.

ఆ ఆల్‌రౌండర్‌కు జట్టులో చోటివ్వాల్సింది
అయితే, ఆల్‌రౌండర్ల జాబితాలో ఆమిర్‌ జమాల్‌కు చోటు దక్కకపోవడం తనను నిరాశపరిచిందని వసీం అక్రం ఈ సందర్భంగా పేర్కొన్నాడు. దీర్ఘకాలం పాటు జట్టుకు ఉపయోగపడగల ఆమిర్‌ను సెలక్టర్లు పట్టించుకోకపోవడం సరికాదన్నాడు. 

ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్‌ మరోసారి విజేతగా నిలిస్తే చూడాలని ఉందని.. అయితే, మిగతా జట్లు కూడా వరల్డ్‌క్లాస్‌ ఆటతో గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నాడు. అందరితోపాటు తాను కూడా భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

కాగా వన్డే ప్రపంచకప్‌-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌ అర్హత సాధించగా.. వరల్డ్‌కప్‌లో సెమీస్‌ కూడా చేరని పాక్‌ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ టోర్నీలోకి దూసుకువచ్చింది. ఇక భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌కు వెళ్లలేని టీమిండియా.. దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది. క్రికెట్‌ ప్రపంచానికి ఎంతో ఇష్టమైన భారత్‌- పాక్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 23న జరుగుతుంది.

చాంపియన్స్‌ ట్రోఫీకి పాకిస్తాన్‌ జట్టు
మహ్మద్‌ రిజ్వాన్ (కెప్టెన్‌), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫాహీం అష్రఫ్, ఖుష్‌దిల్‌ షా, సల్మాన్ అలీ అఘా (వైస్‌ కెప్టెన్‌), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హ్యారీస్‌ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.
చదవండి: టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Wasim Akram
ICC Champions Trophy 2025
Pakistan Cricket Board (PCB)
Babar Azam
Mohammad Rizwan
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

పాకిస్తాన్‌ క్రికెట్‌ చారిత్రక ఒప్పందం!

పాకిస్తాన్‌ క్రికెట్‌ చారిత్రక ఒప్పందం!

చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు

చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు

బాబర్‌ ఆజం రికార్డును బద్దలు కొట్టిన గిల్‌

బాబర్‌ ఆజం రికార్డును బద్దలు కొట్టిన గిల్‌

పాక్‌ జట్టు ప్రకటన.. బీసీసీఐ అలా.. పీసీబీ ఇలా!

పాక్‌ జట్టు ప్రకటన.. బీసీసీఐ అలా.. పీసీబీ ఇలా!

షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్‌ పాక్‌దే

షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్‌ పాక్‌దే

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.