Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

MI VS RCB: చరిత్ర సృష్టించిన భువీ

Sports Sakshi User Sakshi Sakshi Time Apr 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bhjks.jpg

ఆర్సీబీ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేస్‌ బౌలర్‌గా అవతరించాడు. నిన్న (ఏప్రిల్‌ 7) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌ వర్మ వికెట్‌ తీయడం ద్వారా భువీ ఈ ఘనత సాధించాడు. భువీ ఐపీఎల్‌ 179 మ్యాచ్‌లు ఆడి 184 వికెట్లు తీశాడు. భువీ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా డ్వేన్‌ బ్రావో ఉన్నాడు. బ్రావో 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-5 పేసర్లు
184 - భువనేశ్వర్ కుమార్ (179 మ్యాచ్‌లు)
183 - డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌లు)
170 - లసిత్ మలింగ (122 మ్యాచ్‌లు)
165 - జస్ప్రీత్ బుమ్రా (134 మ్యాచ్‌లు)
144 - ఉమేష్ యాదవ్ (148 మ్యాచ్‌లు)

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్‌ పేరిట ఉంది. చహల్‌ 163 మ్యాచ్‌ల్లో 206 వికెట్లు తీశాడు. చహల్‌ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఘనత పియూశ్‌ చావ్లాకు దక్కుతుంది. చావ్లా 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చహల్‌ , చావ్లా తర్వాత భువీ, బ్రావో, అశ్విన్‌ ఉన్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-5 బౌలర్లు
206 - యుజ్వేంద్ర చహల్‌ (163 మ్యాచ్‌లు)
192 - పియూశ్‌ చావ్లా (192 మ్యాచ్‌లు)
184 - భువనేశ్వర్‌ కుమార్‌ (179 మ్యాచ​్‌లు)
183 -  డ్వేన్‌ బ్రావో (161 మ్యాచ్‌లు)
183 - రవిచంద్రన్‌ అశ్విన్‌ (216 మ్యాచ​్‌లు)

కాగా, నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 221 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో ముంబై ఇండియన్స్‌ కూడా ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్‌ చేసి చివరివరకు పోరాడింది. అయితే లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

తద్వారా ఆర్సీబీ 10 ఏళ్ల తర్వాత ముంబై ఇండియన్స్‌ను వారి సొంత ఇలాకాలో ఓడించింది. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీకి 4 మ్యాచ్‌ల్లో ఇది మూడో గెలుపు. ముంబైకి 5 మ్యాచ్‌ల్లో నాలుగో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉండగా.. ముంబై చివరి నుంచి మూడో స్థానంలో ఉంది.

నిన్నటి మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి (67), రజత్‌ పాటిదార్‌ (64), జితేశ్‌ శర్మ (40 నాటౌట్‌), పడిక్కల్‌ (37) సత్తా చాటి ఆర్సీబీ భారీ స్కోర్‌ చేయడానికి దోహదపడ్డారు. బౌల్ట్‌, హార్దిక్‌ తలో 2 వికెట్లు తీయగా.. విజ్ఞేశ్‌ పుతుర్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. ఛేదనలో ముంబైకు ఆదిలోనే షాక్‌ తగిలింది. 

మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రోహిత్‌ శర్మ (17) రెండో ఓవర్‌లోనే ఔటయ్యాడు. అనంతరం మరో ఓపెనర్‌ రికెల్టన్‌ (17) నాలుగో ఓవర్‌లో పెవిలియన్‌కు చేరాడు. విల్‌ జాక్స్‌ (22), సూర్యకుమార్‌ యాదవ్‌ (28) క్రీజ్‌లో నిలదొక్కుకునే క్రమంలో ఔటయ్యారు. ఈ దశలో తిలక్‌ వర్మ (56), హార్దిక్‌ పాండ్యా (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ముంబైని గెలుపు దిశగా తీసుకెళ్లారు. 

అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్‌ కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ముంబై చివరి ఓవర్‌ వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ఆర్సీబీ బౌలర్‌ కృనాల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అంతకుముందు భువీ 18వ ఓవర్‌లో తిలక్‌ వర్మను.. 19వ ఓవర్‌లో హాజిల్‌వుడ్‌ హార్దిక్‌ పాండ్యాను ఔట్‌ చేశారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL 2025
Bhuvaneshwar Kumar
RCB
MI vs RCB
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంగ్లండ్‌కు నో చెప్పిన ఆర్సీబీ హెడ్‌ కోచ్‌

ఇంగ్లండ్‌కు నో చెప్పిన ఆర్సీబీ హెడ్‌ కోచ్‌

సెలెక్షన్‌ కమిటీపై భువ‌నేశ్వ‌ర్‌ సంచ‌ల‌న వ్యాఖ్యలు!

సెలెక్షన్‌ కమిటీపై భువ‌నేశ్వ‌ర్‌ సంచ‌ల‌న వ్యాఖ్యలు!

'ఆర్సీబీలోకి రావడమే ఇష్టం లేదు'

'ఆర్సీబీలోకి రావడమే ఇష్టం లేదు'

టీమిండియా నుంచి తీసేశారు.. క‌ట్ చేస్తే! కేవ‌లం 10 బంతుల్లోనే

టీమిండియా నుంచి తీసేశారు.. క‌ట్ చేస్తే! కేవ‌లం 10 బంతుల్లోనే

పాపం పాటిదార్‌.. ఆర్సీబీ కెప్టెన్‌పై సానుభూతి వెల్లువ

పాపం పాటిదార్‌.. ఆర్సీబీ కెప్టెన్‌పై సానుభూతి వెల్లువ

భువీని కాదని హర్షిత్‌కు చోటు.. గంభీర్‌పై ఆగ్రహజ్వాలలు

భువీని కాదని హర్షిత్‌కు చోటు.. గంభీర్‌పై ఆగ్రహజ్వాలలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.