Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఆసీస్‌ కుర్రాడు ఆకట్టుకున్నా.. జడ్డూ, అక్షర్‌ తొక్కేశారు

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 10, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hadje.jpg

IND Vs AUS Day-2 Analaysis.. నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. విశ్లేషణ విషయానికి వస్తే.. రెండోరోజు ఆటలో మొదట ఆస్ట్రేలియాదే ఆధిపత్యంలా కనిపించినప్పటికి చివరాఖరికి టీమిండియాదే పైచేయి. తొలి రెండు సెషన్‌లలో ఆస్ట్రేలియా ఆధిక్యం కనబరిచినప్పటికి రోహిత్‌ సెంచరీతో ఆసీస్‌ ఆధిపత్యం ఒక సెషన్‌కు పరిమితమైనట్లే. ఎందుకంటే చివరి సెషన్‌లో జడేజా, అక్షర్‌ పటేల్‌ల ఆటతో టీమిండియా నిలదొక్కుక్కుంది.

నిలదొక్కుకోవడమే కాదు టీమిండియాకు భారీ ఆధిక్యం కట్టబెట్టేలా కనిపిస్తున్నారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. జడేజా 66, అక్షర్‌ పటేల్‌ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో ఈ ఇద్దరు లంచ్‌ వరకు నిలబడితే చాలు.. మ్యాచ్‌ టీమిండియాదే అవుతుంది. ఒకవేళ ఆధిక్యం 200 పరుగులు దాటినా మ్యాచ్ టీమిండియావైపే మొగ్గి ఉంటుంది. మొదటి రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌ మూడో రోజుకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. 

ఆకట్టుకున్న ఆసీస్‌ కుర్రాడు..

ఇక రెండోరోజు ఆటలో ఆస్ట్రేలియా ఏదైనా లాభపడిందంటే టాడ్‌ మర్ఫీ ఐదు వికెట్లతో రాణించడం. 22 ఏళ్ల ఈ కుర్రాడికి ఇదే తొలి అంతర్జాతీయ టెస్టు. అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీయడం అంటే మాములు విషయం కాదు. తన ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌తో మొదటిరోజే కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ పడగొట్టిన టాడ్‌ మర్ఫీ.. రెండోరోజు ఆటలో తన మ్యాజిక్‌ బౌలింగ్‌తో కోహ్లి, పుజారా, అశ్విన్‌, శ్రీకర్‌ భరత్‌లను బుట్టలో వేసుకొని పెవిలియన్‌ చేర్చాడు.

అయితే తొలి టెస్టులో స్టార్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ ప్రభావం చూపిస్తాడని అనుకున్నారు.. కానీ ఎవరు ఊహించని విధంగా టాడ్‌ మర్ఫీ తన బౌలింగ్‌తో హైలైట్‌ అయ్యాడు. అతని బౌలింగ్‌లో స్టీవ్‌ ఓ కఫీ(2017లో టీమిండియాను తొలి టెస్టులో శాసించిన బౌలర్‌) బౌలింగ్‌ శైలి కొట్టొచ్చినట్లు కనిపించింది. 2017లో ఆస్ట్రేలియా టీమిండియా పర్యటనకు వచ్చినప్పుడు.. తొలి టెస్టులో స్టీవ్‌ ఓ కఫీ సంచలన ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ 333 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో ఓ కఫీ ఆరు వికెట్లతో చెలరేగి టీమిండియా పతనాన్ని శాసించాడు.

2014లోనే అరంగేట్రం చేసినప్పటికి స్టీవ్‌ ఓ కఫీ బౌలింగ్‌ టీమిండియా బ్యాటర్లకు కొత్త. అందుకే అతని కొత్త బౌలింగ్‌ శైలిలో ఇబ్బందులు పడి వికెట్లు చేజార్చుకొని మ్యాచ్‌ ఓటమిపాలయ్యారు. అయితే ఇదే స్టీవ్‌ ఓ కఫీ బౌలింగ్‌ను తర్వాతి మ్యాచ్‌ల్లో చీల్చి చెండాడారు. ఆ దెబ్బకు ఓ కఫీ మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు.

తాజాగా టాడ్‌ మర్ఫీ కూడా అతని బౌలింగ్‌ శైలినే అనుకరిస్తుండడంతో అభిమానులు మరో స్టీవ్‌ ఓ కఫీ వచ్చాడని అభిప్రాయపడ్డారు. ఐదు వికెట్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే చివరి సెషన్‌లో జడేజా, అక్షర్‌ పటేల్‌లు అర్థశతకాలతో రాణించి టీమిండియాను నిలబెట్టారు. మర్ఫీ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికి జడ్డూ, అక్షర్‌ పటేల్‌లు తమ బ్యాటింగ్‌తో అతన్ని తొక్కేశారని అభిమానులు సరదాగా పేర్కొన్నారు.

చదవండి: IND VS AUS 1st Test: బంతితో విఫలమైనా బ్యాటింగ్‌లో ఇరగదీసిన అక్షర్‌ పటేల్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
india vs australia
Todd Murphy
Ravindra Jadeja
Axar Patel
cricket news
Web Special
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.