Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

తిలక్‌ వర్మ... పేరు గుర్తుంచుకోండి!

Sports Sakshi User Sakshi Sakshi Time Aug 15, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
TILAK-VARMA.jpg

తిలక్‌ పేరులో ‘లక్‌’ ఉంది. ఈ ‘లక్‌’ చోటు వచ్చేందుకు పనికొస్తుందేమో కానీ... రాణించేందుకు ఏమాత్రం ఉపయోగపడదు. శక్తి, సామర్థ్యాలతో పాటు టెక్నిక్, వచి్చన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్న పట్టుదల, పాతుకుపోవాలన్న సంకల్పమే ఏ ఆటగాడినైనా నిలబెడతాయి. ఎడంచేతి వాటం బ్యాటర్‌ తిలక్‌ వర్మ కూడా అదే చేశాడు. కష్టపడే జట్టులోకి వచ్చాడు. వచ్చాక ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతున్నాడు. బ్యాటింగ్‌లో ఈ నిలకడే భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కంట నాలుగో స్థానంపై ఆశాకిరణమయ్యేలా చేస్తోంది.



ఠాకూర్‌ తిలక్‌ వర్మ ఐపీఎల్‌లో దంచేస్తుంటే అందరికి తెలిసొచి్చంది. కానీ హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) డివిజన్‌ లీగ్‌ క్రికెట్‌లోనే అతను వార్తల్లో వ్యక్తి అని చాలా మందికి తెలియదు. మూడు రోజుల ఆటలో జట్టును అర్ధ సెంచరీలతో ఆదుకున్నాడు. సెంచరీలతో గెలిపించాడు. ఐపీఎల్‌ వేలంలోకి వచ్చాక లీగ్‌లో మనోడున్నాడు అనిపించాడు. నిలకడైన ఆటతో మెల్లిగా ముంబై ఇండియన్స్‌ జట్టు మొనగాడయ్యాడు. ఇప్పుడు కరీబియన్‌కు తీసుకెళ్తే భారత ఆశాకిరణమయ్యాడు. అలా ఒక్కో మెట్టెక్కుతూ... కింది నుంచే పైకొచ్చాడు.



గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన తిలక్‌ ఆ సీజన్‌లో ముంబైని మురిపించాడు. షాట్ల ఎంపిక, బంతిని పంపిన ప్లేసింగ్‌ తీరు, ధాటిగా ఆడే నైపుణ్యం ఇవన్నీ గమనించిన ముంబై యాజమాన్యం అతనికి విరివిగా అవకాశాలిచి్చంది. అన్ని మ్యాచ్‌ల్లో బరిలోకి దింపింది. దాంతో 131.02 స్ట్రయిక్‌రేట్‌తో 397 పరుగులు చేశాడు. 36.09 సగటు నమోదు చేశాడు. ఈ సీజన్‌లోనూ 11 మ్యాచ్‌ల్లో ఆడిస్తే 164.11 స్ట్రయిక్‌ రేట్‌తో 343 పరుగులు చేశాడు.



సగటేమో 42.87! అంటే ఈ రెండేళ్లలో సగటు, స్ట్రయిక్‌రేట్‌ రెండు పెంచుకున్నాడు. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ గణాంకాలతోనే తిలక్‌ వర్మ అదరగొట్టాడనుకుంటే పొరబడినట్లే! ఎందుకంటే ముంబై కష్టాల్లో ఉంటే ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగితే... అతను మాత్రం యథేచ్ఛగా ఆడిన తీరే అందరిమెప్పు పొందేలా చేసింది. క్రికెట్‌ విశ్లేషకులు, ప్రముఖ టీవీ వ్యాఖ్యా తలే కాదు... దిగ్గజ క్రికెటర్లు సైతం తిలక్‌ వర్మ ఆటకు, ఆడిన తీరుకు ముచ్చటపడ్డారు. ప్రశంసలు కురిపించారు.  



విండీస్‌లో సిక్సర్లతో...

అతని ప్రతిభను బీసీసీఐ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ కూడా గుర్తించి కరీబియన్‌ పర్యటనకు పంపింది. కేవలం టి20ల్లో మాత్రమే అవకాశమిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదుగా లభించిన ఈ సదవకాశాన్ని హైదరాబాదీ లెఫ్ట్‌ హ్యాండర్‌ వదులుకోలేదు. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్, కెపె్టన్‌ హార్దిక్‌ పాండ్యాల గేమ్‌ ప్లాన్‌లో భాగమైన తిలక్‌... విండీస్‌ తురుపుముక్కలైన సీమర్లను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న తొలి బంతికి పరుగు తీయలేకపోయాడు... కానీ అంతర్జాతీయ పరుగుల ప్రయాణాన్ని మాత్రం సిక్సర్లతో ప్రారంభించాడు. తొలి రెండు టి20ల్లో 39 పరుగులు, 51 పరుగులు అతనిదే టాప్‌ స్కోర్‌! తర్వాత మూడు మ్యాచ్‌ల్లో 49 నాటౌట్, 7 నాటౌట్, 27 పరుగులు... ఇలా ప్రతి మ్యాచ్‌లోనూ బాధ్యత కనబరిచాడు. ఓవరాల్‌గా 173 పరుగులతో ఈ సిరీస్‌లో భారత టాప్‌ స్కోరర్‌గా అవతరించాడు. అందుకే భారత కెపె్టన్‌ రోహిత్‌ ఓ ఇంటర్యూలో హైదరాబాదీ ఆటగాడిని ప్రత్యేకంగా ప్రస్తావించాడు, ప్రశంసించాడు.



ఆసియా కప్, ప్రపంచకప్‌లపై...

యువరాజ్‌ సింగ్‌ రిటైర్మెంట్‌ తర్వాత బదులు తోచని ప్రశ్నగా మిగిలిపోయిన నాలుగో స్థానం ఇప్పుడు తిలక్‌ను ఊరిస్తోంది. ఆసియా కప్‌లో సెలక్టర్లు మాత్రం అతన్ని కొనసాగించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇక అక్కడ కూడా మ్యాచ్‌ మ్యాచ్‌కు ఇలాంటి నిలకడ, ధాటైన జోరు కొనసాగిస్తే మాత్రం స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం అతని పేరును పరిశీలించడం, చోటివ్వడం ఖాయమవుతుందేమో చూడాలి. 



–సాక్షి క్రీడా విభాగం  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
tilak varma
batting
BCCI
Selection Committee
ODI World Cup qualifying
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

 బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

తిలక్‌ వర్మ విధ్వంసకర సెంచరీ.. 259 టార్గెట్‌ హాంఫట్‌

తిలక్‌ వర్మ విధ్వంసకర సెంచరీ.. 259 టార్గెట్‌ హాంఫట్‌

TG20 League 2026: తిలక్‌ వర్మ సూపర్‌ సెంచరీ

TG20 League 2026: తిలక్‌ వర్మ సూపర్‌ సెంచరీ

వైభవ్, తిలక్‌ మెరుపులు.. శ్రీలంక-ఏ టార్గెట్‌ 378 రన్స్‌

వైభవ్, తిలక్‌ మెరుపులు.. శ్రీలంక-ఏ టార్గెట్‌ 378 రన్స్‌

లంకతో ఫైనల్‌ మ్యాచ్‌.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్‌

లంకతో ఫైనల్‌ మ్యాచ్‌.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.