Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

పసికూనను చిత్తు చేసి.. టీ20 సిరీస్‌ కైవసం

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bangla.jpg

నెదర్లాండ్స్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ (BAN vs NED T20I) ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో లిటన్‌ దాస్‌ బృందం చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

కాగా ఆసియా కప్‌-2025 (Asia Cup) సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్‌ సొంతగడ్డపై నెదర్లాండ్స్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతోంది. ఈ క్రమంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లా జట్టు.. తాజాగా రెండో టీ20లోనూ సత్తా చాటింది.

103 పరుగులకే ఆలౌట్‌
సెల్హైట్‌ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ ఆతిథ్య జట్టు బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 17.3 ఓవర్లలో కేవలం 103 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది.

ఓపెనర్లలో మాక్‌ ఒడౌడ్‌ (8) విఫలం కాగా.. విక్రమ్‌జిత్‌ సింగ్‌ (24) ఫర్వాలేదనిపించాడు. ఇక వన్‌డౌన్లో వచ్చిన తేజ నిడమానూరు డకౌట్‌ కాగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన కెప్టెన్‌ చార్ల్స్‌ ఎడ్‌వర్డ్స్‌ (9), షారిజ్‌ అహ్మద్‌ (12), నోవా క్రోస్‌ (2), సికందర్‌ జుల్ఫికర్‌ (2) కూడా చేతులెత్తేశారు.

మూడు వికెట్లతో సత్తా చాటిన నసూమ్‌
కైల్‌ క్లెన్‌ (4) కూడా విఫలం కాగా.. ఆఖర్లో ఆర్యన్‌ దత్‌ 24 బంతుల్లో 30 పరుగులు చేసి డచ్‌ జట్టు ఇన్నింగ్స్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లా బౌలర్లలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ నసూమ్‌ అహ్మద్‌ మూడు వికెట్లతో సత్తా చాటగా.. టస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ తలా రెండు వికెట్లు కూల్చారు.


తాంజిద్‌ హసన్‌ తమీమ్‌ అర్ధ శతకం
మిగిలిన వారిలో మెహదీ హసన్‌, తాంజిమ్‌ హసన్‌ సకీబ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ మరోసారి దుమ్మురేపింది. 13.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే నష్టపోయి 104 పరుగులు సాధించింది. ఓపెనర్లలో పర్వేజ్‌ హొసేన్‌ ఇమాన్‌ 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. తాంజిద్‌ హసన్‌ తమీమ్‌ అర్ధ శతకంతో సత్తా చాటాడు.

మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న తాంజిద్‌.. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ (18 బంతుల్లో 18 నాటౌట్‌) నిలవగా.. ఫోర్‌తో తాంజిద్‌ బంగ్లా విజయాన్ని ఖరారు చేశాడు. 

ఇక నెదర్లాండ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన నసూమ్‌ అహ్మద్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. బంగ్లాదేశ్‌- నెదర్లాండ్స్‌ మధ్య నామమాత్రపు మూడో టీ20కి బుధవారం (సెప్టెంబరు 3) షెడ్యూల్‌ ఖరారైంది.

చదవండి: IND vs PAK: నేను.. రోహిత్‌ ఘోరంగా ఢీకొట్టుకున్నాం.. ఆరోజు ధోని ఫైర్‌: కోహ్లి

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Litton Das
Scott Edwards
T20 series
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సంజూను కావాలనే తప్పించారా?

సంజూను కావాలనే తప్పించారా?

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్‌

హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్‌

AUS vs BAN: ఆసీస్‌ గడ్డపై ‘మనోడి’ చరిత్ర

AUS vs BAN: ఆసీస్‌ గడ్డపై ‘మనోడి’ చరిత్ర

BCCI: సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ

BCCI: సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.