Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

బాబర్‌ ఆజంపై వేటు?.. పీసీబీ కీలక నిర్ణయం!

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 8, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
babar_0.jpg

వరుస పరాభవాలతో డీలా పడ్డ పాకిస్తాన్‌ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని బోర్డు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టు జట్టు హెడ్‌ కోచ్‌గా జాసెన్‌ గిల్లెస్పీకి బాధ్యతలు అప్పగించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ).. పరిమిత ఓవర్ల క్రికెట్‌ ప్రక్షాళనపైనా దృష్టి సారించినట్లు సమాచారం.

బాబర్‌ ఆజంపై వేటు?
ఇందులో భాగంగా వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా ఉన్న బాబర్‌ ఆజంపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. సారథిగా అతడిని తప్పించేందుకు బోర్డు మొగ్గుచూపుతున్నట్లు పాక్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌ కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే నిష్క్రమించిన నేపథ్యంలో బాబర్‌ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్టు పగ్గాలను షాన్‌ మసూద్‌కు అప్పగించిన పీసీబీ.. టీ20 సారథిగా షాహిన్‌ ఆఫ్రిదిని నియమించింది.

ఈసారి కూడా చేదు అనుభవమే
అయితే, షాహిన్‌ కెప్టెన్‌గా ఆకట్టుకోకపోవడంతో టీ20 ప్రపంచకప్‌-2024 ఆరంభానికి ముందే బాబర్‌ ఆజంకు తిరిగి వన్డే, టీ20 నాయకుడిగా బాధ్యతలు అప్పగించింది. కానీ.. ఈసారి కూడా అతడికి చేదు అనుభవమే ఎదురైంది.

గత టీ20 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌ వరకు చేర్చిన బాబర్‌ ఆజం.. ఈసారి మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. కనీసం గ్రూప్‌ దశ దాటకుండానే పాకిస్తాన్‌ ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ పాక్‌ మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు.

అదే విధంగా.. బంధుప్రీతికి తావు లేకుండా జట్టును ఎంపిక చేయాలంటూ ఆజం ఖాన్‌ వంటి వాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీ.. కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ తదితర అంశాలకు సంబంధించి ప్రధాన కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌, ఛీఫ్‌ సెలక్టర్‌ వహాబ్‌ రియాజ్‌లను నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. 

కిర్‌స్టన్‌ నిర్ణయం మేరకే
అదే విధంగా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ విషయంలో కిర్‌స్టన్‌ నిర్ణయం మేరకే ముందుకు వెళ్లాలని నఖ్వీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాబర్‌ ఆజంపై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోందని పాక్‌ మీడియా ప్రచారం చేస్తోంది. 

మరోవైపు.. దేశవాళీ క్రికెట్‌ స్వరూపం గురించి మాజీ క్రికెటర్లతో చర్చించి రూట్‌మ్యాప్‌ తయారు చేయాలని పీసీబీ నిర్ణయించినట్లు సమాచారం. 

పీసీబీ చైర్మన్‌ను కలిసి
ఈ నేపథ్యంలో.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బాగు కోరే 30- 35 మంది అంతర్జాతీయ క్రికెటర్లు పీసీబీ చైర్మన్‌ను సోమవారం కలిసి తమ సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధమైనట్లు జియో న్యూస్‌ వెల్లడించింది. 

కాగా పాకిస్తాన్‌ తదుపరి తమ పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 విజేతగా టీమిండియా అవతరించిన విషయం తెలిసిందే.

చదవండి: BCCI: ద్రవిడ్‌కు రూ. 5 కోట్లు.. రోహిత్‌, కోహ్లి సహా వారందరికీ ఎంతంటే?

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Babar Azam
Pakistan Cricket Board
gary kirsten
pakistan captain
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు

చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు

బాబర్‌ ఆజం రికార్డును బద్దలు కొట్టిన గిల్‌

బాబర్‌ ఆజం రికార్డును బద్దలు కొట్టిన గిల్‌

పాక్‌ కెప్టెన్‌పై వేటు.. హెడ్‌కోచ్‌పై వేళాడుతున్న కత్తి!

పాక్‌ కెప్టెన్‌పై వేటు.. హెడ్‌కోచ్‌పై వేళాడుతున్న కత్తి!

షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్‌ పాక్‌దే

షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్‌ పాక్‌దే

కింగ్ ప‌దానికి కోహ్లీ అర్హుడు కాదు.. పాక్ క‌ప‌ట బుద్ధి!

కింగ్ ప‌దానికి కోహ్లీ అర్హుడు కాదు.. పాక్ క‌ప‌ట బుద్ధి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.