Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

బాబర్‌ ఆజం వరల్డ్‌ ఎలెవన్‌: కోహ్లి, బుమ్రాలకు దక్కని చోటు

Sports Sakshi User Sakshi Sakshi Time May 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
vkrojb.jpg

పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌, మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజం (Babar Azam) టీ20 ఫార్మాట్లో తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. తన వరల్డ్‌ ఎలెవన్‌లో తనతో పాటు టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli), ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)లకు మాత్రం బాబర్‌ చోటివ్వలేదు.

టీమిండియా నుంచి ఆ ఇద్దరు
అయితే, భారత్‌ నుంచి మరో ఇద్దరు ఆటగాళ్లను మాత్రం బాబర్‌ ఆజం తన జట్టుకు ఎంపిక చేసుకున్నాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో​ దుమ్మురేపిన రోహిత్‌ శర్మతో పాటు.. టీమిండియా టీ20 జట్టు ప్రస్తుత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌లకు చోటిచ్చాడు. కాగా ఇంటర్నేషనల్‌ టీ20 క్రికెట్‌లో రోహిత్‌ శర్మ అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.

హిట్‌మ్యాన్‌ ఖాతాలో 4231 పరుగులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవర్‌ హిట్టర్‌గా పేరొందిన రోహిత్‌ను బాబర్‌ ఆజం తన జట్టులో ఓపెనర్‌గా ఎంపిక చేసుకున్నాడు. అతడికి జోడీగా పాకిస్తాన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌కు స్థానం ఇచ్చాడు.

ఇక వన్‌డౌన్‌లో పాక్‌కే చెందిన ఫఖర్‌ జమాన్‌ను సెలక్ట్‌ చేసుకున్న బాబర్‌.. మిడిలార్డర్‌లో ధనాధన్‌ దంచికొట్టే సూర్యకుమార్‌ యాదవ్‌ను నాలుగో నంబర్‌ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు.  అదే విధంగా ఇంగ్లండ్‌ విధ్వంసకర వీరుడు జోస్‌ బట్లర్‌, సౌతాఫ్రికా హార్డ్‌ హిట్టర్‌ డేవిడ్‌ మిల్లర్‌లను ఐదు, ఆరు స్థానాలకు ఎంపిక చేసుకున్నాడు.

ఏకైక స్పిన్నర్‌ 
ఏడో స్థానంలో సౌతాఫ్రికా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌కు చోటు ఇచ్చిన బాబర్‌ ఆజం.. ఎనిమిదో స్థానానికి అఫ్గనిస్తాన్‌ మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను ఎంచుకున్నాడు. ఇక పేస్‌ దళంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌తో పాటు ఆసీస్‌కే చెందిన మరో ఫాస్ట్‌బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌లకు బాబర్‌ తన జట్టులో స్థానం ఇచ్చాడు. వీరితో పాటు ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌ను పేస్‌ దళంలో చేర్చాడు.

తన జట్టులో పవర్‌ హిట్టర్లతో పాటు విలక్షణ బౌలర్లు ఉన్నారని.. అందుకే ఈ టీమ్‌ సమతూకంగా ఉంటుందని బాబర్‌ ఆజం చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో కనీసం గ్రూప్‌ దశను కూడా దాటకుండానే పాకిస్తాన్‌ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబర్‌ ఆజంను కెప్టెన్సీ నుంచి తప్పించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా నియమించింది. 

అయితే, అతడి సారథ్యంలోనూ పాక్‌ ఘోర పరాభవాలు చవిచూస్తోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలలో వన్డేలు గెలవడం మినహా చెప్పుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు.

ఇక ఇటీవల నిర్వహించిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో రిజ్వాన్‌ బృందం ఒక్క గెలుపు కూడా లేకుండానే టోర్నీని ముగించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవడం విశేషం. కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచిన  తర్వాత రోహిత్‌, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ టెస్టులకు కూడా రిటైర్మెంట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు వన్డేలలోనూ కొనసాగుతున్నారు.

బాబర్‌ ఆజం వరల్డ్‌ ఎలెవన్‌:
రోహిత్‌ శర్మ, మహ్మద్‌ రిజ్వాన్‌, ఫఖర్‌ జమాన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, జోస్‌ బట్లర్‌, డేవిడ్‌ మిల్లర్‌, మార్కో యాన్సెన్‌, రషీద్‌ ఖాన్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్క్‌వుడ్‌.

చదవండి: బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్‌: టీమిండియా మాజీ కోచ్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Babar Azam
Virat Kohli
Jasprit Bumrah
rohit sharma
suryakumar yadav
Jos Buttler
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

బుమ్రా పునరాగమనం

బుమ్రా పునరాగమనం

భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సెంచ‌రీ హీరోకు నో ఛాన్స్‌

భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సెంచ‌రీ హీరోకు నో ఛాన్స్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.