Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజమ్‌.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 18, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
acn.jpg

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నివేదికల ప్రకారం.. సిడ్నీ సిక్సర్స్‌ ఫ్రాంచైజీ 2025-26 ఎడిషన్‌ కోసం బాబర్‌తో 4,20,000 ఆస్ట్రేలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్తానీ కరెన్సీలో ఇది 7.7 కోట్లు. భారత కరెన్సీలో రూ.2.35 కోట్లు.

బాబర్‌తో సిక్సర్స్‌ డ్రాఫ్ట్‌ (వేలం) కంటే ముందే ఒప్పందం చేసుకుంది (ప్రీ డ్రాఫ్ట్‌ సైనింగ్‌). బీబీఎల్‌లో ఓవర్సీస్‌ డ్రాఫ్ట్‌ కంటే ముందే ప్రీ డ్రాఫ్ట్‌ కింద విదేశీ ఆటగాళ్లతో ఒప్పందం చేసుకోవచ్చు. సిక్సర్స్‌ బాబర్‌తో పాటు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌తో కూడా ఇలాగే ఒప్పందం చేసుకుంది. బీబీఎల్‌లో బాబర్‌కు ఇదే తొలి డీల్‌. ఈ సీజన్‌తోనే అతను ఆసీస్‌ దేశవాలీ టీ20 లీగ్‌లో అరంగేట్రం చేస్తాడు. ఈ సీజన్‌ బీబీఎల్  డ్రాఫ్ట్ జూన్ 19న జరుగనుంది.

బీబీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు
బాబర్‌ బీబీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పాక్‌ మీడియా డప్పు కొట్టుకుంటుంది. బీబీఎల్‌లో అత్యధిక ధర పలికే ప్లాటినం కేటగిరీలో ఆటగాళ్లకు 3,40,000 ఆస్ట్రేలియన్‌ డాలర్లు పారితోషికంగా ఇస్తారు. అయితే బాబర్‌తో సిక్సర్స్‌ ఇంతకంటే 80,000 డాలర్లు అధికంగా ఒప్పందం చేసుకుంది. బీబీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర పొందిన ఆటగాడిగా డి'ఆర్సీ షార్ట్‌ పేరిట రికార్డు ఉంది. అతనికి 2023-24 సీజన్‌లో హోబర్ట్‌ హరికేన్స్‌ 2,58,900 ఆస్ట్రేలియన్‌ డాలర్లు చెల్లించింది.

బీబీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-5 ఆటగాళ్ల జాబితా:
డి'ఆర్సీ షార్ట్ – $2,58,900 (హోబార్ట్ హరికేన్స్)
ఆండ్రూ టై – $2,46,800 (పెర్త్ స్కార్చర్స్)
మార్కస్ స్టోయినిస్ – $2,27,900 (మెల్బోర్న్ స్టార్స్)
క్రిస్ లిన్ – $2,02,000 (బ్రిస్బేన్ హీట్)
జో రూట్ – $2,00,000 (సిడ్నీ థండర్)

బీబీఎల్‌లో ఆటగాళ్ల జీతాల శ్రేణుల వివరాలు:
ప్లాటినం: $3,40,000
గోల్డ్: $2,60,000
సిల్వర్: $1,75,000
కాంస్యం: $1,00,000

ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల కంటే తక్కువే
బీబీఎ‍ల్‌లో బాబర్‌ అత్యధిక ధర పలికిన ఆటగాడే అయినా, ఐపీఎల్‌లో ఓ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌కు లభించే మొత్తం కంటే తక్కువే తీసుకుంటాడు. భారత కరెన్సీలో బాబర్‌కు 2.35 కోట్లు (బీబీఎల్‌ పారితోషికం) లభిస్తే.. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు, అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ ప్రియాంశ్‌ ఆర్యకు రూ.3.5 కోట్లు లభిస్తుంది.

ఇదిలా ఉంటే, ప్రపంచవాప్తంగా ఉండే చాలా క్రికెట్‌ లీగ్‌ల్లో ఆడే (పీఎస్‌ఎల్‌, సీపీఎల్‌, ఎల్‌పీఎల్‌, బీపీఎల్, బీబీఎల్‌) బాబర్‌కు స్వదేశ టీ20 జట్టులో చోటు కరువైంది. పాకిస్తాన్ టీ20 సెట‌ప్ నుంచి బాబ‌ర్‌తో పాటు మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌, షాహీన్ అఫ్రిదిని పక్కన పెట్టారు.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Babar Azam
Big Bash League (BBL)
Pakistan
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

బిత్తర పోయిన పాక్‌ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!

బిత్తర పోయిన పాక్‌ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!

భారత్‌తో యుద్ధానికైనా రెడీ.. పాక్ మంత్రి సంచలన ప్రకటన

భారత్‌తో యుద్ధానికైనా రెడీ.. పాక్ మంత్రి సంచలన ప్రకటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.