Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

మధ్యప్రదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన జమ్మూ కశ్మీర్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 10, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
auqib.jpg

రంజీ ట్రోఫీ నాకౌట్‌ దశలో మరో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో ఆదివారం జార్ఖండ్‌ను ఓడించి చిన్న జట్టు ఉత్తరాఖండ్‌ తొలి సారి టోర్నీ సెమీస్‌ చేరగా... తర్వాతి రోజే దేశవాళీ క్రికెట్‌లో మరో చిన్న జట్టు జమ్మూ కశ్మీర్‌ జట్టు ఇలాంటి ఫలితాన్నే పునరావృతం చేసింది. 

67 ఏళ్ల తమ రంజీ చరిత్రలో జమ్మూ కశ్మీర్‌ మొదటి సారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 1959–60 సీజన్‌లో తొలి సారి ఈ టోర్నీలో ఆడిన జట్టు ఇన్నేళ్ల తర్వాత సెమీస్‌ చేరడం విశేషం.  సోమవారం ముగిసిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కశ్మీర్‌  56 పరుగుల తేడాతో 2021–22 చాంపియన్‌ మధ్యప్రదేశ్‌పై విజయం సాధించింది. 

ఐదేసిన ఆఖిబ్‌ నబీ
ఇండోర్‌ వేదికగా  291 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్‌ స్కోరు 87/5తో నాలుగో రోజు ఆట కొనసాగించిన మధ్య ప్రదేశ్‌.. 68.3 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. సారాంశ్‌ జైన్‌ (81 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో పోరాడగా...శుభమ్‌ శర్మ (32) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. 

వైస్‌ కెప్టెన్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (17) విఫలం కావడంతో జట్టు గెలుపు ఆశలు కోల్పోయింది. పేస్‌ బౌలర్‌ ఆఖిబ్‌ నబీ (5/70) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా...ఆబిద్‌ ముస్తాక్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 12 వికెట్లు పడగొట్టిన ఆఖిబ్‌ నబీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

సెంచరీతో గెలిపించిన రాహుల్‌... 
భారత బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (182 బంతుల్లో 130; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో ముందుండి నడిపించగా చిరకాల ప్రత్యర్థి, 42 సార్లు విజేత అయిన ముంబైని ఓడించి కర్నాటక సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 

ఎనిమిది సార్లు చాంపియన్‌ కర్నాటక సోమవారం ఆసక్తికరంగా ముగిసిన క్వార్టర్స్‌ పోరులో 4 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఓవర్‌నైట్‌ స్కోరు 113/2తో కర్నాటక నాలుగో రోజు ఆట కొనసాగించింది. 

కరుణ్‌ నాయర్‌ ((13) ఆరంభంలోనే వెనుదిరగ్గా... రాహుల్, రవిచంద్రన్‌ స్మరణ్‌ (123 బంతుల్లో 83 నాటౌట్‌; 11 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. తొలి సెషన్‌లోనే 147 బంతుల్లో రాహుల్‌ శతకం పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అతనికి ఇది 24వ సెంచరీ కావడం విశేషం. 

లంచ్‌ తర్వాత కర్నాటక ఇన్నింగ్స్‌ కొంత తడబాటుకు గురైంది. 19 పరుగుల వ్యవధిలో రాహుల్, శ్రేయస్‌ గోపాల్‌ (1), కృతిక్‌ కృష్ణ (2) అవుట్‌ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కొద్ది సేపు మైదానంలో వాదనలు కూడా జరిగాయి. 

అయితే స్మరణ్, విద్యాధర్‌ పాటిల్‌ (30 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి జట్టును గట్టెక్కింటారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు అభేద్యంగా 40 పరుగులు జత చేశారు. ఆదివారం నుంచి జరిగే తొలి సెమీఫైనల్లో ఉత్తరాఖండ్‌తో కర్నాటక తలపడుతుంది.     

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Jammu Kashmir
Ranji Trophy 2025-26
Madhya Pradesh
Auqib Nabi
semi final
venkatesh iyer
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నిజం చెరగకూడదని.. చేతులు, కాళ్ల నిండా సూసైడ్‌ లేఖ రాసుకుని..

నిజం చెరగకూడదని.. చేతులు, కాళ్ల నిండా సూసైడ్‌ లేఖ రాసుకుని..

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’

IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’

పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్‌, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి!

పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్‌, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి!

రైలు ఢీకొని నలుగురు దుర్మరణం ఎక్కడంటే..!

రైలు ఢీకొని నలుగురు దుర్మరణం ఎక్కడంటే..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.