Asia Cup Final 2023- Ind vs SL #Mohammed Siraj- #W 0 W W 4 W: ‘‘అంతా ఓ కలలా అనిపిస్తోంది. గతంలో త్రివేండ్రంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాగే జరిగింది. ఆరంభంలోనే నాలుగు వికెట్లు పడగొట్టాను. ఐదు వికెట్ల హాల్ నమోదు చేయలేకపోయాను. అయినా.. మన విధిరాతలో ఇలా జరగాలని రాసి ఉన్నపుడు కచ్చితంగా జరిగే తీరుతుందని నాకిప్పుడు అర్థమైంది.
నమ్మలేకపోయాను
నిజానికి ఈరోజు ఆరంభంలోనే వికెట్లు తీయడానికి నేను పెద్దగా ప్రయత్నించలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నేను ఎల్లప్పుడూ స్వింగ్ కోసమే చూస్తూ ఉంటా. గత మ్యాచ్‌లలో అస్సలు ఇలా లేదు. ఈరోజు మాత్రం బాల్ ఫుల్‌గా స్వింగ్ అయింది. అసలు నేనే నమ్మలేకపోయాను.
అవుట్ స్వింగర్లు సంధించి ఎక్కువ వికెట్లు పడగొట్టగలిగాను. బ్యాటర్లు ముందుకు వచ్చి ఆడేలా ట్రాప్ చేసి విజయవంతమయ్యాను. చాలా సంతోషంగా ఉంది’’ అని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ బౌలర్ అదరగొట్టిన విషయం తెలిసిందే.
W . W W 4 W! 🥵
Is there any stopping @mdsirajofficial?! 🤯
The #TeamIndia bowlers are breathing 🔥
4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka?
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR— Star Sports (@StarSportsIndia) September 17, 2023
సిరాజ్ దెబ్బకు పెవిలియన్‌కు క్యూ
కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లతో విజృంభించిన సిరాజ్ మియా.. మొత్తంగా 7 ఓవర్ల బౌలింగ్‌లో 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు.
సిరాజ్ దెబ్బకు శ్రీలంక టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ పాతుమ్ నిసాంక(2) సహా కుశాల్ మెండిస్(17), సమరవిక్రమ(0), చరిత్ అసలంక(0), ధనుంజయ డి సిల్వ(4), దసున్ షనక(0) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup!
6️⃣ for the pacer!
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI— Star Sports (@StarSportsIndia) September 17, 2023
ఇక జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్ కుశాల్ పెరీరాను డకౌట్ చేయగా.. హార్దిక్ పాండ్యా దునిత్ వెల్లలగే(8), ప్రమోద్ మదుషాన్(1), మతీశ పతిరణ(0)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో 15.2 ఓవర్లలో 50 పరుగులకే లంక ఆలౌట్ అయింది.
లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు ఇషాన్ కిషన్ 23, శుబ్‌మన్ గిల్ 27 పరుగులతో అదరగొట్టి 6.1 ఓవర్లలోనే విజయ లాంఛనం పూర్తి చేశారు. దీంతో టీమిండియా ఎనిమిదో సారి ఆసియా కప్ విజేతగా అవతరించింది.
పెద్ద మనసు చాటుకున్న సిరాజ్
ఇక విజయానంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ.. తన ప్రణాళికలను పక్కాగా అమలు చేశానన్నాడు. బుమ్రా, పాండ్యాల నుంచి సహకారం అందిందని.. సమిష్టిగా రాణించి జట్టుకు విజయం అందించామని పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా.. తనకు లభించిన ప్రైజ్‌మనీని గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చి పెద్ద చాటుకున్నాడు సిరాజ్. కాగా కొలంబోలో వర్షాల నేపథ్యంలోనూ సిబ్బంది ఎప్పటికప్పుడు మ్యాచ్ సజావుగా సాగేలా శ్రమించిన విషయం తెలిసిందే. దీంతో వారి పట్ల ఈ విధంగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు సిరాజ్.
చదవండి: ఏంటా బౌలింగ్ సామి! సిరాజ్ దెబ్బకు లంక విలవిల.. ఆసియా కప్ మనదే