Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Anshul Kambo: జెర‍్సీ నంబర్‌ 'ఏకే-47'

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 24, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
anshul.jpg

భారత క్రికెట్‌లో దూసుకొచ్చిన అన్షుల్‌ కంబోజ్‌

దేశవాళీ క్రికెట్‌లో ఆకట్టుకునే ప్రదర్శనలు  

దాదాపు ఆరు వారాల క్రితం... నార్తాంప్టన్‌లో ఇంగ్లండ్‌ లయన్స్‌తో భారత్‌ ‘ఎ’ తలపడిన అనధికారిక టెస్టులో అన్షుల్‌ కంబోజ్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు తీయడంతో పాటు అతను అర్ధ సెంచరీ కూడా సాధించాడు. మరో 10 రోజుల్లో భారత్, ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుండగా జట్టులో ప్రధాన పేసర్‌ ఒకరు గాయంతో బాధపడుతుండటంతో ముందు జాగ్రత్తగా మరో పేసర్‌ను టీమ్‌తో చేర్చాలని మేనేజ్‌మెంట్‌ భావించింది. ‘ఎ’ తరఫున ప్రదర్శన చూసిన తర్వాత కంబోజ్‌కు అవకాశం దక్కవచ్చని అంతా అనుకున్నారు. అయితే హర్షిత్‌ రాణాను జట్టు ఎంచుకుంది. 

స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాతి రోజు ఉదయమే తాను రోజూ సాధన చేసే అకాడమీకి కంబోజ్‌ చేరుకున్నాడు. ఇంగ్లండ్‌ నుంచి వస్తూ వస్తూ అతను కొన్ని డ్యూక్స్‌ బంతులను వెంట తెచ్చుకున్నాడు. సింగిల్‌ స్టంప్‌ను పెట్టుకొని వాటితో ప్రాక్టీస్‌ మొదలు పెట్టేశాడు. కోచ్‌ ఎలా ఉన్నావు అడిగితే ‘అంతా బాగుంది సర్‌. కానీ నాకు ఇంకా నమ్మకం ఉంది’ అంటూ జవాబిచ్చాడు. జట్టులో స్థానంపై ఆశలు కోల్పోని కంబోజ్‌కు కొద్ది రోజులకే తీపి కబురు వచ్చింది. డ్యూక్స్‌ బంతులతో సాధన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ కోసమేనా అన్నట్లుగా వచ్చీ రాగానే టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం కూడా లభించింది.   – సాక్షి క్రీడా విభాగం

హరియాణాలో బాక్సర్లకు అడ్డా అయిన కర్నాల్‌ సమీపంలో ఫజీల్‌పూర్‌ అన్షుల్‌ స్వస్థలం. చాలా మందిలాగే అతనూ మట్టి మైదానాల్లో క్రికెట్‌ ఆడుతూ వచ్చాడు. 14 ఏళ్ల వయసు వచ్చాకే బౌలింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. తండ్రి ఉధమ్‌ సింగ్‌ అన్ని రకాలుగా అండగా నిలవగా... స్థానిక కోచ్‌ సతీశ్‌ రాణా అతడిని తీర్చి దిద్దాడు. అకాడమీలో చేర్పించిన అనంతరం అన్షుల్‌ ఆట పదునెక్కింది. 

ఆ్రస్టేలియా దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ను విపరీతంగా అభిమానించే అతను... మెక్‌గ్రాత్‌ తరహాలోనే పేస్‌ కంటే కూడా కచ్చితత్వంపైనే ఎక్కువగా ఆధారపడతాడు. భారత్‌లో స్వింగ్‌ బౌలింగ్‌కు బాగా అనుకూలించే మైదానంగా గుర్తింపు పొందిన లాహ్లిలో ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయడం కలిసి రాగా, తీవ్ర సాధనతో అన్షుల్‌ సీమ్‌ బౌలింగ్‌లో రాటుదేలాడు. ఇప్పుడే అదే ప్రత్యేకత అతడిని తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యేలా చేసింది.  


నాన్నకు ఆనందం పంచుతూ... 
ఆరేళ్ల క్రితం భారత అండర్‌–19 జట్టుకు ఎంపిక కావడం అన్షుల్‌ కెరీర్‌లో కీలక మలుపు. నిజానికి అంతకు కొద్ది రోజుల ముందే అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో ఆడే భారత జట్టులో చోటు లభించే అవకాశం రాగా, గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఆ సమయంలో తీవ్రంగా బాధపడిన అన్షుల్‌ ఆటను వదిలేద్దామనుకున్నాడు. 

కానీ అతనిలోని ప్రతిభ గురించి తెలిసిన తండ్రి కొనసాగమని గట్టిగా ప్రోత్సహించాడు. దాంతో పట్టుదలగా ఆడుతూ ముందుకు వెళ్లిన అన్షుల్‌ 2022లో తొలిసారి హరియాణా తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్‌ బరిలోకి దిగాడు. మూడేళ్లు గడిచేసరికి ఇప్పుడు భారత్‌ తరఫున టెస్టు క్రికెట్‌ ఆడటంతో తండ్రి ఆనందానికి అవధుల్లేవు. గత పదేళ్లుగా ఉధమ్‌ సింగ్‌ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కంబోజ్‌ ఎంపిక తండ్రి బాధలన్నీ ఒక్క క్షణంలో దూరం చేసిందని అతని సోదరుడు సంయమ్‌ చెప్పాడు. 

కంబోజ్‌ మ్యాచ్‌ ఆడే సమయంలోనే అతని తల్లికి కిడ్నీ సంబంధిత సర్జరీ కూడా ఉంది. ఆ సమయంలో కొడుకు లేకపోయినా... కోలుకున్న తర్వాత ఆ కుటుంబంలో కనిపించే సంతోషం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు 24 మ్యాచ్‌ల ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 22.88 సగటుతో 79 వికెట్లు పడగొట్టిన అన్షుల్‌ తొలి టెస్టులో బౌలింగ్‌ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు.


ఆ రెండు ప్రదర్శనలు...
అన్షుల్‌ అనూహ్యంగా దూసుకు వచ్చిన తరహా ఆటగాడు కాదు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. 2023–24 సీజన్‌ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీని హరియాణా గెలుచుకోవడంలో 17 వికెట్లతో అతను కీలక పాత్ర పోషించాడు. ఇది అతనికి రూ.20 లక్షలతో తొలి ఐపీఎల్‌ అవకాశం ఇప్పించింది. 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున 3 మ్యాచ్‌లు ఆడగలిగాడు. తొలి మ్యాచ్‌లో ట్రవిస్‌ హెడ్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేయగా... అది నోబాల్‌గా తేలింది. 

ఈ స్థాయిలో ఆడటం అంత సులువు కాదని అది తనకు నేర్పించిందని అతను గుర్తు చేసుకున్నాడు. అన్షుల్‌ ప్రతిభకు ఐపీఎల్‌ 2025లో గుర్తింపు దక్కింది. వేలంలో రూ.3 కోట్ల 40 లక్షలకు అతడిని సొంతం చేసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ 8 మ్యాచ్‌లలో అవకాశం ఇచ్చింది. ఈ హరియాణా ప్లేయర్‌ తన పేరును, జెర్సీ నంబర్‌ను ఒకే చోట చేర్చి (అన్షుల్‌ కంబోజ్‌–ఏకే 47) పేరుతో జెర్సీని ధరించి ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. 

గత సీజన్‌ దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్‌ ‘సి’ తరఫున ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన అన్షుల్, రంజీ మ్యాచ్‌లో కేరళపై ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఘనతను అందుకున్నాడు. అనంతపురంలో జరిగిన దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లో బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై భారత్‌ ‘సి’ 525 పరుగులు చేయగా... అన్షుల్‌ దెబ్బకు ‘బి’ 332 పరుగులకే ఆలౌటైంది. 

‘ప్రతిభ మాత్రమే కాదు...జహీర్, బుమ్రా తరహాలో తనదైన వ్యూహంతో బౌలింగ్‌ చేయగల అరుదైన పేసర్‌ అన్షుల్‌’ అంటూ అతని సీఎస్‌కే సహచరుడు అశ్విన్‌ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్‌ గడ్డపై తనకు లభించిన అవకాశాలను అన్షుల్‌ సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లడం ఖాయం.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
team india
Anshul Kamboj
england
test
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

ఇంగ్లండ్‌కు నో చెప్పిన ఆర్సీబీ హెడ్‌ కోచ్‌

ఇంగ్లండ్‌కు నో చెప్పిన ఆర్సీబీ హెడ్‌ కోచ్‌

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటన

ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటన

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.