Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

గతేడాది టెస్టులకు వీడ్కోలు.. దిగ్గజ పేసర్‌ రీఎంట్రీ

Sports Sakshi User Sakshi Sakshi Time May 16, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
anderson.jpg

ఇంగ్లండ్‌ దిగ్గజ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ పునరాగమనానికి రంగం సిద్ధమైంది. నలభై రెండేళ్ల ఈ స్పీడ్‌స్టర్‌ దేశీ క్రికెట్‌ బరిలో దిగబోతున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌ డివిజన్‌ 2లో భాగంగా లంకాషైర్‌ జట్టుకు ఆడనున్నాడు.

ఇందుకు సంబంధించి లంకాషైర్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జట్టులో జేమ్స్‌ ఆండర్సన్‌కు చోటు ఇచ్చినట్లు వెల్లడించింది. ​కాగా.. గతేడాది ఆండర్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో లార్డ్స్‌ వేదికగా జూలై నాటి టెస్టుతో ఇంగ్లండ్‌ జట్టుతో అతడి ప్రయాణం ముగిసిపోయింది.

ఆ తర్వాత ఇంగ్లండ్‌ పురుషుల క్రికెట్‌ జట్టుకు ఆండర్సన్‌ బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరించాడు. అయితే, ఆ పనికి కూడా స్వస్తి పలికి ఆటగాడిగా మరోసారి రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. మాంచెస్టర్‌ వేదికగా శుక్రవారం నుంచి డెర్బిషైర్‌తో జరిగే కౌంటీ మ్యాచ్‌తో అతడు మైదానంలో దిగుతున్నాడు.

704 వికెట్లు
కాగా 2003లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జేమ్స్‌ ఆండర్సన్‌.. ఇంగ్లండ్‌ తరఫున 188 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఏకంగా 704 వికెట్లు కూల్చి.. ఈ అరుదైన మైలురాయి చేరుకున్న తొలి పేసర్‌గా చరిత్రకెక్కాడు.

అంతేకాదు ఆండర్సన్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 32సార్లు నాలుగు వికెట్లు, 32 సార్లు ఐదు వికెట్లు, మూడుసార్లు పది వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ఒకే వేదికపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌బౌలర్‌గానూ రికార్డు సాధించాడు. లార్డ్స్‌ మైదానంలో అతడు 29 టెస్టుల్లో కలిపి 2.71 ఎకానమీతో 123 వికెట్లు తీశాడు.ఇక వన్డేల్లో 269 వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌.. అంతర్జాతీయ టీ20లలో 18 వికెట్లు పడగొట్టాడు.

లంకాషైర్‌ జట్టు
మార్కస్‌ హ్యారిస్‌ (కెప్టెన్‌), జేమ్స్‌ ఆండర్సన్‌, టామ్‌ బెయిలీ, జార్జ్‌ బాల్డర్‌సన్‌, జార్జ్‌ బెల్‌, జోష్‌ బొహానన్‌, టామ్‌ హార్ట్లీ, మ్యాట్‌ హర్ట్స్‌, కీటన్‌ జెన్నింగ్స్‌, మైకేల్‌ జోన్స్‌, ఆండర్సన్‌ ఫిలిప్‌, ఓలీ సటాన్‌, ల్యూక్‌ వెల్స్‌, విల్‌వియమ్స్‌. 

ఇంగ్లండ్‌ బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా సౌతీ 
మరోవైపు.. ఆండర్సన్‌ స్థానంలో న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ టిమ్‌ సౌతీని ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు ప్రత్యేక నైపుణ్య సలహాదారుగా నియమించుకుంది. త్వరలో ఇంగ్లండ్, భారత్‌ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ వరకే ఈ నియామకం జరిగినట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) తెలిపింది. 

వచ్చే నెల ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే భారత్‌ అక్కడ ఐదు టెస్టుల ముఖాముఖి సిరీస్‌లో తలపడుతుంది. ముందుగా లీడ్స్‌ వేదికగా జూన్‌ 20 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. జూలై 31 నుంచి ద ఓవల్‌లో జరిగే ఆఖరి టెస్టుతో సంప్రదాయ సిరీస్‌ ముగుస్తుంది.

ఈ నేపథ్యంలో ఎంతో అనుభవజ్ఞుడైన కివీ పేసర్‌ సౌతీ సేవల్ని ఉపయోగించుకొని సిరీస్‌లో లబ్ధి పొందాలని ఇంగ్లండ్‌ బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. 36 ఏళ్ల మాజీ సీమర్‌ గత డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 

కెరీర్‌లో 107 టెస్టులాడి 391 వికెట్లు తీశాడు. 161 వన్డేల్లో 221 వికెట్లు, 126 టీ20ల్లో 164 వికెట్లు తీసిన కివీస్‌ గ్రేటెస్ట్‌ బౌలర్‌ సౌతీ. భారత్‌తో సిరీస్‌ కంటేముందు ఇంగ్లండ్‌ ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికపై జింబాబ్వేతో ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. ఈ నెల 22 నుంచి ఈ మ్యాచ్‌ జరుగుతుంది.    

చదవండి: ‘రోహిత్‌ జట్టులో లేకపోయినా నష్టమేమీ లేదు.. అది పెద్ద విషయమే కాదు’
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
James Anderson
Lancashire
England County Cricket
Tim Southee
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

టీమిండియా యువ సంచలనానికి బంపరాఫర్‌

టీమిండియా యువ సంచలనానికి బంపరాఫర్‌

చరిత్ర సృష్టించిన బుమ్రా.. అంపైర్‌ తప్పు చేశాడా?

చరిత్ర సృష్టించిన బుమ్రా.. అంపైర్‌ తప్పు చేశాడా?

IPL 2026: కేకేఆర్‌ కీలక ప్రకటన

IPL 2026: కేకేఆర్‌ కీలక ప్రకటన

చరిత్ర సృష్టించిన రాహుల్‌ చాహర్‌.. 166 ఏళ్ల పురాతన రికార్డు బద్దలు

చరిత్ర సృష్టించిన రాహుల్‌ చాహర్‌.. 166 ఏళ్ల పురాతన రికార్డు బద్దలు

శతక్కొట్టిన మయాంక్‌ అగర్వాల్‌.. సిక్సర్‌తో సెంచరీ పూర్తి

శతక్కొట్టిన మయాంక్‌ అగర్వాల్‌.. సిక్సర్‌తో సెంచరీ పూర్తి

ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటిన వాషింగ్టన్‌ సుందర్‌

ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటిన వాషింగ్టన్‌ సుందర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.