Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Divya Deshmukh: అసలైన హీరో మాత్రం ఆమెనే: ఆనంద్‌ మహీంద్ర

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 29, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
divya2.jpg

దివ్య దేశ్‌ముఖ్‌ (Divya Deshmukh).. భారత చెస్‌ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మారుమ్రోగి పోతోంది. చదరంగ దిగ్గజాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (Dronavalli Harika)లకు కూడా సాధ్యం కాని అరుదైన ఘనతను దివ్య సాధించడమే ఇందుకు కారణం. 

ఫిడే మహిళల ప్రపంచకప్‌ (FIDE Women's World Cup) ఫైనల్లో ఏకంగా హంపినే ఓడించిన దివ్య.. ఈ టైటిల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది.

దూకుడు ప్రదర్శిస్తూనే
పందొమిదేళ్ల వయసులోనే ఈ మహారాష్ట్ర అమ్మాయి ఈ అరుదైన రికార్డు సాధించడం మరో విశేషం. దూకుడుగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే.. కీలక సమయాల్లో ఒత్తిడి దరిచేరనీయకుండా ప్రశాంతంగా ఉండటం దివ్యలోని అరుదైన లక్షణం. ప్రత్యర్థి ఎంతటివారైనా ఏమాత్రం తడబాటుకు లోనుకాకుండా తన పనిని పూర్తి చేయడంలో ఆమె దిట్ట.

అందుకే భారత చదరంగ మహారాణిగా వెలుగొందుతున్న 38 ఏళ్ల హంపిని కూడా.. ఇంత చిన్నవయసులోనే దివ్య ఓడించగలిగింది.  క్లాసిక్‌ గేమ్స్‌ను డ్రా చేసుకున్న దివ్య.. ర్యాపిడ్‌ రౌండ్స్‌లో మాత్రం చక్కటి ప్రదర్శనతో ఆద్యంతం సానుకూల దృక్పథంతో ముందుకు సాగి చాంపియన్‌గా అవతరించింది.

అసలైన ‘హీరో’కు కూడా క్రెడిట్‌
ఈ నేపథ్యంలో దివ్య దేశ్‌ముఖ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌, క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండుల్కర్‌ తదితరులు దివ్యను కొనియాడగా.. తాజాగా వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర కూడా ఈ జాబితాలో చేరారు. అయితే, ఆయన దివ్యను ప్రశంసిస్తూనే ఆమె వెనుక ఉన్న అసలైన ‘హీరో’కు కూడా క్రెడిట్‌ ఇవ్వడం విశేషం.

ఈ మేరకు.. ‘‘ఫిడే ప్రపంచకప్‌-2025 విజేత దివ్య దేశ్‌ముఖ్‌. ఈ విజయంతో ఆమె గ్రాండ్‌ మాస్టర్‌ హోదాను కూడా పొందింది. పందొమిదేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించింది.

అయినా, ప్రతీ గ్రాండ్‌ మాస్టర్‌ వెనుక ఓ తల్లి ఉంటుంది. ఎంతో మంది ఇలాంటి స్టార్ల వెనుక అన్‌సంగ్‌ హీరోగా నిలబడిపోతుంది’’ అంటూ దివ్య దేశ్‌ముఖ్‌ తన తల్లి నమ్రతను ఆలింగనం చేసుకున్న వీడియోను ఆనంద్‌ మహీంద్ర పంచుకున్నారు.

ఇక ఆయన వ్యాఖ్యలతో నెటిజన్లు కూడా ఏకీభవిస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నై చెస్‌ స్టార్లు ఆర్‌.ప్రజ్ఞానంద, ఆర్‌.వైశాలిల తల్లి నాగలక్ష్మిని గుర్తుచేస్తూ అమ్మలకు సెల్యూట్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

దివ్య భావోద్వేగం
ప్రపంచకప్‌ గెలవగానే దివ్య తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘ఈ విజయానుభూతిని ఆస్వాదిస్తున్నాను. దీని నుంచి తేరుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుంది. ఇక్కడికి వచ్చే ముందు నాకు ఒక్క జీఎం నార్మ్‌ కూడా లేదు.

నేను ఎప్పుడు నార్మ్‌ సాధిస్తానో అని ఆలోచించేదాన్ని. కానీ ఇక్కడ ఇలా గ్రాండ్‌మాస్టర్‌ కావాలని నాకు రాసి పెట్టి ఉంది. నాకు ఈ ఆనందంలో మాటలు రావడం లేదు. ఈ విజయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నా దృష్టిలో ఇది ఆరంభం మాత్రమే. 

మున్ముందు ఇంకా ఇలాంటివి చాలా సాధించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొంది. ఇక ఫైనల్‌ గెలవగానే తల్లి నమ్రతను హత్తుకుని దివ్య ఆనందభాష్పాలు రాల్చింది. ఆ తల్లి కూడా విజయగర్వంతో ఉప్పొంగిపోయింది. కాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన దివ్య దేశ్‌ముఖ్‌ తల్లిదండ్రులు నమ్రత, జితేంద్ర దేశ్‌ముఖ్‌. వీరిద్దరూ డాక్టర్లే!

చదవండి: ‘కోహ్లిపై వేటుకు సిద్ధమైన ఆర్సీబీ.. అతడి స్థానంలో మాజీ క్రికెటర్‌’
 

Divya Deshmukh, the Winner of the 2025 FIDE Women’s World Cup.
Through this victory she also achieves Grandmaster status. 
At the age of 19. 
And behind the Grandmaster is the caring mother…

As always, the unsung hero behind many stars…

pic.twitter.com/9AyeBBPbM5

— anand mahindra (@anandmahindra) July 28, 2025

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Divya Deshmukh
Koneru Humpy
Anand Mahindra
nagpur
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నీట్ రీ-ఎగ్జామ్: నాగ్‌పూర్, అహిల్యానగర్, లాతూర్‌లలో టైట్ సెక్యూరిటీ

నీట్ రీ-ఎగ్జామ్: నాగ్‌పూర్, అహిల్యానగర్, లాతూర్‌లలో టైట్ సెక్యూరిటీ

మళ్లీ నిర్లక్ష్యం?.. నాగ్‌పూర్‌ విద్యార్థికి అబుదాబిలో నీట్‌ సెంటర్‌

మళ్లీ నిర్లక్ష్యం?.. నాగ్‌పూర్‌ విద్యార్థికి అబుదాబిలో నీట్‌ సెంటర్‌

షాకింగ్‌ : ఐఏఎఫ్ ఆఫీస‌ర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..!

షాకింగ్‌ : ఐఏఎఫ్ ఆఫీస‌ర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..!

టెస్లా బాస్‌పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు!

టెస్లా బాస్‌పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు!

500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..!

500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..!

'హొన్నావర్' అందానికి జయహో అనాల్సిందే..!

'హొన్నావర్' అందానికి జయహో అనాల్సిందే..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.